For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

28 బ్యాంకులకు కుచ్చుటోపీ; రూ.22,842 కోట్ల మోసం చేసిన ఏబీజీ షిప్‌యార్డ్ : సీబీఐ కేసు నమోదు

|

ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు టోకరా పెట్టిన ఏబీజీ షిప్‌యార్డ్ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. 28 బ్యాంకులను 22,842 కోట్ల రూపాయల మేర మోసగించిన ఆరోపణలపై ఏబీజీ షిప్‌యార్డ్ మరియు దాని డైరెక్టర్లు రిషి అగర్వాల్, సంతానం ముత్తుస్వామి మరియు అశ్విని కుమార్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ శనివారం నాడు కేసు నమోదు చేసింది.

విజయ్ మాల్యా ధిక్కారకేసు: మాల్యాకు సుప్రీంకోర్టు చివరి అవకాశం; ఫిబ్రవరి 24కి విచారణ వాయిదావిజయ్ మాల్యా ధిక్కారకేసు: మాల్యాకు సుప్రీంకోర్టు చివరి అవకాశం; ఫిబ్రవరి 24కి విచారణ వాయిదా

బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని చెల్లించకుండా మోసం చేసిన ఏబీజీ షిప్ యార్డ్

బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని చెల్లించకుండా మోసం చేసిన ఏబీజీ షిప్ యార్డ్

ఏబీజీ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఏబీజీ గ్రూప్ యొక్క ఫ్లాగ్‌షిప్ కంపెనీ, ఇది షిప్‌ బిల్డింగ్ మరియు షిప్ రిపేర్‌ లకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది. గుజరాత్‌లోని దహేజ్ మరియు సూరత్‌లలో ఈ సంస్థకు షిప్‌యార్డ్‌లు ఉన్నాయి. ఇక ఈ సంస్థపై వివిధ బ్యాంకులు చేసిన ఫిర్యాదు ప్రకారం, కంపెనీ వివిధ బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని చెల్లించకుండా ఉంది.

వివిధ బ్యాంకులకు ఉన్న బకాయిల వివరాలు ఇవే

వివిధ బ్యాంకులకు ఉన్న బకాయిల వివరాలు ఇవే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 2,925 కోట్ల రూపాయలు, ఐ సి ఐ సి ఐ బ్యాంక్‌కు 7,089 కోట్ల రూపాయలు, ఐడీబీఐ బ్యాంక్‌కి 3,634 కోట్ల రూపాయలు, బ్యాంక్ ఆఫ్ బరోడాకి 1,614 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు 1,244 కోట్ల రూపాయలు మరియు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు 1,228 కోట్ల రూపాయలు బకాయిలు ఉంది. ఏప్రిల్ 2012 నుండి జూలై 2017 వరకు 18.01.2019 నాటి ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక, నిందితులు కుమ్మక్కయ్యారని మరియు నిధుల మళ్లింపు, దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంది. నేరపూరిత విశ్వాస ఉల్లంఘన వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డారని వెల్లడించింది. మొత్తం 22,842 కోట్ల మేర బకాయిలు ఉన్నట్టు పేర్కొంది.

నిధుల మళ్లింపు, దుర్వినియోగం, ఉద్దేశపూర్వక మోసం అని పేర్కొన్న సీబీఐ

నిధుల మళ్లింపు, దుర్వినియోగం, ఉద్దేశపూర్వక మోసం అని పేర్కొన్న సీబీఐ

బ్యాంకు నిధులను విడుదల చేసే ప్రయోజనాల కోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వినియోగించారని సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ తన ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించింది. బ్యాంకు నిధుల ఖర్చుతో చట్టవిరుద్ధంగా పొందే లక్ష్యంతో నిధుల మళ్లింపు, దుర్వినియోగం మరియు నేరపూరిత నమ్మకాన్ని ఉల్లంఘించడం ద్వారా మోసం జరిగిందని కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఫోరెన్సిక్ ఆడిట్ నివేదిక ఏప్రిల్ 2012 మరియు జూలై 2017 మధ్య మోసం జరిగినట్లు చూపిస్తుంది.

గడువు తేదీలో కంపెనీ వడ్డీ మరియు వాయిదాలను చెల్లించటంలో విఫలం

గడువు తేదీలో కంపెనీ వడ్డీ మరియు వాయిదాలను చెల్లించటంలో విఫలం

కమోడిటీ డిమాండ్ మరియు ధరలు తగ్గడం మరియు కార్గో డిమాండ్ తగ్గడం వల్ల గ్లోబల్ సంక్షోభం షిప్పింగ్ పరిశ్రమపై ప్రభావం చూపింది. కొన్ని ఓడలు,ఓడల కోసం ఒప్పందాలను రద్దు చేయడం వల్ల ఇన్వెంటరీ పేరుకుపోయిందని పేర్కొంది . దీని ఫలితంగా వర్కింగ్ క్యాపిటల్ కొరత ఏర్పడింది. ఆపరేటింగ్ సైకిల్‌లో గణనీయమైన పెరుగుదలకు కారణమైంది. తద్వారా లిక్విడిటీ సమస్య తోపాటు ఆర్థిక సమస్య తీవ్రమైంది. 2015 నుండి పరిశ్రమ తిరోగమనంలో ఉందని పేర్కొంది. వాణిజ్య నౌకలకు డిమాండ్ లేదని పేర్కొన్నారు. ఆర్ధిక నష్టాల కారణంగా గడువు తేదీలో కంపెనీ వడ్డీ మరియు వాయిదాలను చెల్లించలేకపోయింది అని సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఏబీజీ షిప్పింగ్ లిమిటెడ్ ఇప్పటికి 165కి పైగా నౌకలను నిర్మించింది.

English summary

28 బ్యాంకులకు కుచ్చుటోపీ; రూ.22,842 కోట్ల మోసం చేసిన ఏబీజీ షిప్‌యార్డ్ : సీబీఐ కేసు నమోదు | ABG shipyard defrauded 28 banks of Rs 22,842 crore: CBI registers case

The CBI has registered a case against ABG Shipyard directors for defrauding 28 banks of Rs 22,842 crore. CBI said That they deliberately defrauded the banks.
Story first published: Saturday, February 12, 2022, 17:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X