For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా ఉత్పత్తులకు రాంరాం, సర్వేలో 87% మందిది చెప్పింది ఇదే

|

భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయులు చాలామంది చైనా ఉత్పత్తుల వాడకాన్ని మానేస్తామని ఉద్యమిస్తున్నారు. ప్రజలతో పాటు ట్రేడర్స్, వివిధ సంస్థలు బాయ్‌కాట్ చైనా అంటు పిలుపునిస్తున్నాయి. తాము చైనా ఉత్పత్తులను ఉపయోగించమని ఓ సర్వేలో ఎక్కువమంది చెప్పారు. చైనా దుశ్చర్య నేపథ్యంలో తాము ఆ దేశ ఉత్పత్తులను కొనేది లేదని 87 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు.

కొనేవాళ్లు లేరు.. వడ్డీ రేటు భారం: ప్రభుత్వం సాయంతో లాభమేంటి!?కొనేవాళ్లు లేరు.. వడ్డీ రేటు భారం: ప్రభుత్వం సాయంతో లాభమేంటి!?

చైనా బ్రాండ్స్ బహిష్కరించాలని 97% మంది

చైనా బ్రాండ్స్ బహిష్కరించాలని 97% మంది

20 మంది సైనికులను బలిగొన్న చైనాకు వాణిజ్యపరంగా బుద్ధి చెప్పాలని ఎక్కువమంది భారతీయులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఏడాది పాటు చైనా వస్తువుల జోలికి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. షియామీ, వివో, ఒప్పో వంటి చైనా బ్రాండ్స్‌ను బహిష్కరించాలని 97% మంది పేర్కొనగా, 39% మంది ఇప్పటికే కొనుగోలు చేసినవి ఉపయోగిస్తామని, ఇకపై మాత్రం కొనేది లేదని చెప్పారు. చైనా దిగుమతులపై 200% సుంకాలు విధించాలని 78% మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. ముడి సరుకు దిగుమతులపై ఇంతటి భారం తగదని 36% మంది చెప్పారు.

భారతీయ ప్రమాణాలు పాటించాలి

భారతీయ ప్రమాణాలు పాటించాలి

బీఐఎస్, ఎఫ్ఎస్ఎస్ఏఐ తదితర భారతీయ ప్రమాణాలను చైనా కంపెనీలు తప్పక పాటించాల్సిందేనని 90% మంది భారతీయులు చెప్పారు. దేశంలోని 235 జిల్లాల్లో లోకల్ సర్కిల్స్ ఈ సర్వే చేపట్టగా 32 వేలమందికి పైగా ఇందులో పాల్గొన్నారు. మీరు వచ్చే ఏడాది వరకు చైనీస్ వస్తువులు కొనుగోలు చేయడం మానుకుంటారా అని ప్రశ్నించగా, ఇందులో ఎక్కువ శాతం మంది తాము వాటిని బహిష్కరించేందుకు సిద్ధమని చెప్పారు.

వాడి వదిలేస్తాం

వాడి వదిలేస్తాం

వివో, ఒప్పో, వన్ ప్లస్, షెయిన్ వంటి చైనీస్ ఉత్పత్తులను ఇప్పటి నుండే ఉపయోగించడం మానేస్తామని 58 శాతం మంది చెప్పగా, ఇక నుండి కొనుగోలు చేయమని, ఇప్పుడు కొనుగోలు చేసినవి వాడి వదిలేస్తామని 39 శాతం మంది చెప్పారు. చైనీస్ ఉత్పత్తులను పక్కన పెట్టి వాటి స్థానంలో భారతీయ బ్రాండ్స్ ఏమైనా ఉంటే చూస్తామని 97 శాతం మంది చెప్పారు. CDSCO, BIS, FSSAI, CRS సర్టిఫికెట్స్ అవసరమని 90 శాతం మంది చెప్పగా, 5 శాతం మంది సర్టిఫికెట్స్ అవసరం లేదన్నారు.

English summary

చైనా ఉత్పత్తులకు రాంరాం, సర్వేలో 87% మందిది చెప్పింది ఇదే | 87 percent Indians ready to boycott Chinese products: Survey

There seems to be significant anger against China in the country after Chinese aggression at the LAC in Ladakh in which 20 soldiers were killed by the Chinese troop.
Story first published: Monday, June 22, 2020, 16:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X