For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెల్త్ ఇన్‍‌ఫ్రాలో 5వ స్థానంలో హైదరాబాద్, ఢిల్లీ లాస్ట్: అందులో మన సిటీ బెస్ట్!

|

వైద్య మౌలిక వసతులపరంగా భారతదేశంలో పుణే మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ ప్రతి వెయ్యి మందికి 3.5 హాస్పిటల్ బెడ్స్ ఉన్నాయి. ఈ మేరకు ఆన్‌లైన్ రియల్ ఎస్టేట్ పోర్టల్ హౌసింగ్ డాట్ కామ్ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అయిదో స్థానంలో ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వైద్య మౌలిక వసతుల పరంగా దేశ రాజధాని ఢిల్లీ చివరి స్థానంలో ఉంది. పుణే అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత వరుసగా అహ్మదాబాద్ 2, బెంగళూరు 3, ముంబై 4, హైదరాబాద్ 5, చెన్నై 6, కోల్‌కతా 7వ స్థానంలో ఉన్నాయి.

<strong>క్రిప్టోకరెన్సీ: లైట్‌కాయిన్, డోజీకాయిన్, బిట్ కాయిన్ ధరలు ఇలా</strong>క్రిప్టోకరెన్సీ: లైట్‌కాయిన్, డోజీకాయిన్, బిట్ కాయిన్ ధరలు ఇలా

హాస్పిటల్ బెడ్స్‌కు ప్రాధాన్యత

హాస్పిటల్ బెడ్స్‌కు ప్రాధాన్యత

ప్రతి వెయ్యి మంది జనాభాకు అందుబాటులో ఉన్న హాస్పిటల్ బెడ్స్ సంఖ్య, గాలి-నీటి నాణ్యత, పారిశుద్ధ్యం, మెరుగైన జీవనం వంటి వాటిని ప్రమాణాలుగా తీసుకుని ఈ ర్యాంకులు ఇచ్చినట్లు హౌసింగ్ డాట్‌కామ్ వెల్లడించింది. అమెరికాకు చెందిన న్యూస్‌కార్ప్, ఆస్ట్రేలియా గ్రూప్ సంస్థ ఆర్‌ఈఏకు చెందిన ఈ సంస్థ భారత్‌లో ఆరోగ్య సంరక్షణ స్థితి పేరుతో నివేదికను విడుదల చేసింది. ఆయా నగరాలకు ర్యాంకు ఇచ్చే విషయంలో హాస్పిటల్ బెడ్స్‌కు 40 శాతం ప్రాధాన్యత ఇచ్చారు. దేశంలోని 8 ప్రధాన నగరాలను పరిగణనలోకి తీసుకుంది.

భారత్‌లో సగటున 1.4 మాత్రమే

భారత్‌లో సగటున 1.4 మాత్రమే

భారత్‌లో సగటున ప్రతి వెయ్యి మందికి సగటున 1.4 బెడ్స్ ఉన్నాయి. పుణే నగరంలో మాత్రం 3.5 ఉన్నాయి. ఆసియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్ క్రమంగా హెల్త్ కేర్ రంగంలోకి పెట్టుబడులు పెంచుతోందని, మరింత పెంచవలసి ఉందని అభిప్రాయపడుతున్నారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్‌లో మౌలిక వైద్య సదుపాయాల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని హౌసింగ్ డాట్ కామ్ గ్రూప్ సీవోవో మని రంగరాజన్ అన్నారు.

అహ్మదాబాద్‌లో ప్రతి వెయ్యి మందికి 3.2 హాస్పిటల్ బెడ్స్‌తో రెండో స్థానంలో ఉండగా, బెంగళూరు మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా నగరాలు ఐదు, ఆరు, ఏడో స్థానాల్లో ఉన్నాయి. దేశంలో 69 శాతం బెడ్స్ నగరాలకే పరిమితమయ్యాయి.

హైదరాబాద్ నగరంలో ఎంతంటే

హైదరాబాద్ నగరంలో ఎంతంటే

హైదరాబాద్ నగరంలో ప్రతి వెయ్యి మందికి 2.9 హాస్పిటల్ బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ 86 లక్షల మంది ప్రజలు ఉండగా, వీరికోసం 24వేల నుండి 26వేల బెడ్స్ ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ, ప్రయివేటు హాస్పిటల్స్ బెడ్స్ పరిగణలోకి తీసుకున్నారు. గాలి నాణ్యత, శానిటేషన్, వేస్ట్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో హైదరాబాద్ మిగతా నగరాలతో పోలిస్తే బెట్టర్‌గా ఉంది.

English summary

హెల్త్ ఇన్‍‌ఫ్రాలో 5వ స్థానంలో హైదరాబాద్, ఢిల్లీ లాస్ట్: అందులో మన సిటీ బెస్ట్! | 69 percent of hospital beds are concentrated in urban areas, Hyderabad in 5th

Pune is the most equipped city in India in terms of health infrastructure offering 3.5 hospital beds per 1,000 people, according to a recent report by online real estate portal Housing.com.
Story first published: Thursday, May 13, 2021, 13:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X