భారత అతిపెద్ద ఈ-కామర్స్ కేంద్రీకృత సాస్ ప్లాట్‌ఫాం (సాఫ్టువేర్ యాజ్ ఎ సర్వీస్) యూనికామర్స్ నివేదిక ప్రకారం దసరా, దీపావళి పండుగ సమయంలో ఈ-కామర్స్ ఆర్డర్స్ వ్యాల్యూమ్ వృద్ధి గత ఏడాదితో పోలిస్తే 56 శాతంగా నమోదయింది. 2019 దీపావళికి నెల రోజులకు ముందు, 2020లో దీపావళికి నెల రోజుల ముందు ఆర్డర్లను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించింది సంస్థ. కస్టమర్లు గతంలో కంటే ఇప్పుడు విలువకు ప్రాధాన్యం ఇస్తున్నారని, కొత్త విభాగాల్లో కొనుగోళ్లకు ఆన్‌లైన్‌లో ఆసక్తి చూపిస్తున్నారన్నారు.

వీటి కోసం ఎక్కువ ఖర్చు
కన్స్యూమర్లు గతంలోకంటే ఎక్కువ వ్యాల్యూవైపు ఆసక్తి కనబరుస్తున్నారని, కొత్త విభాగాల్లో షాపింగ్ నిర్వహిస్తున్నారని, ముఖ్యంగా వ్యక్తిగత సంరక్షణ, బ్యూటీ ఉత్పత్తులపై అధికంగా వెచ్చిస్తున్నారని తెలిపింది. తక్కువ ధరల ఉత్పత్తుల్లో ఎక్కువ విక్రయాలు జరిగాయని, దీంతో సరాసరి ఆర్డర్ వ్యాల్యూ గత పండుగ సీజన్‌తో పోలిస్తే నాలుగు శాతం తగ్గినట్లు తెలిపింది. ఈ ఏడాది బ్రాండ్ వెబ్ సైట్స్, కంపెనీల పెరుగుదల, డీ2సీ బిజినెస్ మోడల్ పైన దృష్టి సారించడం వంటి అంశాలను కూడా యూనీకామర్స్ డీకోడ్ చేసింది. ఇందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

రిటర్న్స్ 35 శాతం తగ్గాయి
వ్యక్తిగత సంరక్షణ విభాగంలో ఎక్కువగా వృద్ధి కనిపించింది. ఆర్డర్ పరిమాణం 176 శాతం పెరిగింది. సౌందర్య, సంరక్షణ విభాగంలో ఆర్డర్ పరిమాణం 52 శాతం వృద్ధి నమోదు చేసింది. ఫ్యాషన్, ఉపకరణాల విభగంలో ఆర్డర్ల పరిమాణం 71 శాతం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విభాగంలో 65 శాతం పెరిగింది. ఆర్డర్స్ రిటర్న్స్ ఇవ్వడం 35 శాతం తగ్గాయి. ఫ్యాషన్, ఉపకరణాల విభాగంలో రిటర్న్స్ ఎక్కువగా ఉన్నాయి.

చిన్న నగరాలు, పట్టణాల నుండి 59 శాతం
పెద్ద బ్రాండ్స్ తమ సొంత వెబ్ సైట్ల ద్వారా విక్రయాలు జరిపేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ వెబ్ సైట్ల ఆర్డర్ల పరిమాణంలో వృద్ధి 77 శాతం నమోదయింది. మార్కెట్ ఆర్డర్స్ పరిమాణంలో వృద్ధి 60 శాతంతో పోలిస్తే ఇది ఎక్కువ. బ్రాండ్ వెబ్ సైట్స్ GMV (గ్రాస్ మర్చంటైజ్డ్ వ్యాల్యూ) 48 శాతం పెరగగా, మార్కెట్లో ఇది 50 శాతంగా ఉంది. మార్కెట్ కంటే వెబ్ సైట్లలోను బ్రాండ్స్ ఎక్కువగా రాయితీ అందిస్తున్నాయి. ఇక చిన్న నగరాలు, పట్టణాల నుండి ఆన్ లైన్ కస్టమర్ల 59 శాతంగా ఉంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications