ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. కేజ్రీ నేతృత్వంలోని ఈ పార్టీ 54 శాతం ఓట్లతో 62 సీట్లు గెలుచుకోగా, కమలం పార్టీ 38 శాతం ఓట్లతో 8 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకోలేదు. పైగా ఓటు బ్యాంకు నాలుగు శాతానికి పడిపోయింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అత్యంత ధనిక, ఆస్తులు తక్కువగా ఉన్న ఎమ్మెల్యేల విషయానికి వస్తే...

ఏఏపీ నుండి 45, బీజేపీ నుండి 7గురు
70 మంది ఢిల్లీ ఎమ్మెల్యేల్లో 52 మంది కోటీశ్వరులు ఉన్నారని ఏడీఆర్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. 62 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల్లో 45 మంది, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 7గురు కోటీశ్వరులు. అంటే వీరి ఆస్తులు రూ.1 కోటి కంటే ఎక్కువగా ఉన్నాయి.

ఇరు పార్టీల ఎమ్మెల్యేల సరాసరి ఆస్తులు
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల ఆస్తులు సరాసరిన రూ.14.96 కోట్లు ఉండగా, బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తులు కలుపుకుంటే ఒక్కొక్కరి చొప్పున సరాసరిన రూ.9.10 కోట్లు ఉన్నాయి.

ధనిక ఎమ్మెల్యే
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అత్యంత ధనిక ఎమ్మెల్యేల్లో మండ్కా నియోజకవర్గం నుండి గెలిచిన ధర్మపాల్ లక్రా ముందున్నారు. ఆయన ఆస్తులు రూ.292 కోట్లు. ఈ కొత్త అసెంబ్లీలో అత్యంత ధనిక ఎమ్మెల్యే ఇతను.

రెండు, మూడో స్థానాల్లో వీరే...
అత్యంత ధనిక ఎమ్మెల్యేల్లో రెండో స్థానంలో ఆర్కే పురం ఎమ్మెల్యే ప్రమీలా తోకాస్ ఉన్నారు. వీరి ఆస్తులు రూ.80 కోట్లు. పటేల్ నగర్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ రూ.78 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. రాజౌరీ గార్డెన్ నుండి గెలిచిన ధనావంతి చండేలా ఆస్తులు రూ.57, ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేష్ బాల్యన్ ఆస్తులు రూ.56.3 కోట్లు ఉంది.

తక్కువ ఆస్తులున్న ఎమ్మెల్యే
అతి తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేల్లో మంగోళ్‌పూరి నుండి గెలిచిన రాఖీ బిర్లా ఉన్నారు. 2015లో ఈమె ఆస్తులు రూ.18,000. ఇప్పుడు రూ.76,000గా ప్రకటించారు. ఆ తర్వాత అతి తక్కువ ఆదాయం ఉన్న వారిలో... బురారీ ఎమ్మెల్యే సంజీవ్ ఝా రూ.9.6 లక్షలు, సాదర్ బజార్ ఎమ్మెల్యే సోమ్ దత్ రూ.11.9 లక్షలు, కైరారీ ఎమ్మెల్యే రితూరాజ్ ఝా రూ.14 లక్షలు, పాలం ఎమ్మెల్యే భవనా గౌర్ రూ.14.2 లక్షలతో ఉన్నారు.

ఎమ్మెల్యేల సగటు ఆస్తి
2015లో గెలిచిన 70 మంది ఎమ్మెల్యేల ఆస్తులు సగటున రూ.6.29 కోట్లుగా ఉండగా, ఇప్పుడు రెండింతల కంటే ఎక్కువ పెరిగి రూ.14.29 కోట్లుగా ఉంది. ఏఏపీ కోటీశ్వరులు 77 శాతంగా ఉండగా, బీజేపీ కోటీశ్వరులు 88 శాతంగా ఉన్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications