For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

3 ఏళ్లలోనే నెంబర్ 1 స్థానానికి జియో, వొడాఫోన్ ఐడియాకు భారీ షాక్

|

టెలికం రంగంలో రిలయన్స్ జియో సంచలనాలు సృష్టించింది. జియో ఆరంగేట్రం తర్వాత కాలింగ్, డేటా ప్లాన్ టారిఫ్స్ అతిచౌకగా మారి, వినియోగదారులకు ఊరటను కలిగించాయి. మూడేళ్లలోనే (2016) జియో మరో రికార్డ్ సాధించింది. సబ్‌స్క్రైబర్ల పరంగా దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీగా రిలయన్స్ జియో అవతరించింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం గత ఏడాది నవంబర్ చివరి నాటికి జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య 36.9 కోట్లకు చేరుకుంది.

రూ.1.47 కోట్లు చెల్లించాల్సిందే: వొడాపోన్ ఐడియా, ఎయిర్‌టెల్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి?రూ.1.47 కోట్లు చెల్లించాల్సిందే: వొడాపోన్ ఐడియా, ఎయిర్‌టెల్ నెక్స్ట్ స్టెప్ ఏమిటి?

జియో తర్వాత వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్

జియో తర్వాత వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్

జియో తర్వాత 33.62 కోట్ల సబ్‌స్క్రైబర్లతో వొడాఫోన్ ఐడియా రెండో స్థానంలో, 32.73 కోట్ల యూజర్లతో బారతీ ఎయిర్‌టెల్ మూడో స్థానంలో నిలిచింది. ఇక మొత్తం టెలిఫోన్ చందాదారులసంఖ్య అక్టోబర్ నాటికి 120.48 కోట్లుగా ఉండగా, నవంబర్ చివరి నాటికి 2.4 శాతం మేర తగ్గి 117.58 కోట్లకు పరిమితమైంది.

వొడాఫోన్ తగ్గించుకుంటే.. మిగతావి పెంచుకున్నాయి

వొడాఫోన్ తగ్గించుకుంటే.. మిగతావి పెంచుకున్నాయి

2019 అక్టోబర్ నాటికి మొబైల్ కనెక్షన్ల సంఖ్య 118.34 కోట్ల నుంచి 2.43 శాతం తగ్గి 115.43 కోట్లకు పరిమితమైంది. అక్టోబర్ వరకు మొదటి స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా ఒకే నెలలో 3.6కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో రెండో స్థానానికి పడిపోయింది. జియో కొత్తగా 56 లక్షలు, ఎయిర్‌టెల్ 16.59 లక్షలు, బీఎస్ఎన్ఎల్ 3.41 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను పెంచుకున్నాయి.

2019 అక్టోబర్ నాటికి మొబైల్ కనెక్షన్ల సంఖ్య 118.34 కోట్ల నుంచి 2.43 శాతం తగ్గి 115.43 కోట్లకు పరిమితమైంది. అక్టోబర్ వరకు మొదటి స్థానంలో ఉన్న వొడాఫోన్ ఐడియా ఒకే నెలలో 3.6కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. దీంతో రెండో స్థానానికి పడిపోయింది. జియో కొత్తగా 56 లక్షలు, ఎయిర్‌టెల్ 16.59 లక్షలు, బీఎస్ఎన్ఎల్ 3.41 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను పెంచుకున్నాయి.

బీఎస్ఎన్ఎల్..

బీఎస్ఎన్ఎల్..

వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్స్ షేర్ మార్కెట్లో ప్రయివేటు ప్రొవైడర్స్‌ది దాదాపు 90 శాతం వాటా ఉంది. ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ మార్కెట్ వ్యాల్యూ 10 శాతానికి పైగా ఉంది. అక్టోబర్ చివరి నాటికి బీఎస్ఎన్ఎల్ మార్కెట్ వ్యాల్యూ 10.19 శాతంగా ఉంది. ఇది అక్టోబర్‌లో 3,41,722 మంది యూజర్లను యాడ్ చేసుకోగలిగింది.

English summary

3 ఏళ్లలోనే నెంబర్ 1 స్థానానికి జియో, వొడాఫోన్ ఐడియాకు భారీ షాక్ | 3 years after launch, Jio becomes No.1 telco by user base, revenue

Reliance Jio Infocomm Ltd is now the number one telecom operator in India by both subscriber base as well as revenue market share, achieving the feat in just more than three years of starting operations.
Story first published: Friday, January 17, 2020, 12:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X