For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.500 నుంచి రూ.20,000 వరకు వస్త్రాలు: అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌లతో జగన్ ప్రభుత్వం ఒప్పందం

|

చేనేత కార్మికులకు శుభవార్త. ప్రస్తుతం ఆఫ్‌లైన్‌తో పోటీ పడుతూ ఆన్‌లైన్ ద్వారా సేల్స్ జరుగుతున్నాయి. మొబైల్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా ఆన్ లైన్ ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో భారీ ఎత్తున సేల్స్ జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ కంపెనీలతో ఆన్ లైన్ ద్వారా చేనేత వస్త్రాల అమ్మకానికి ఒప్పందం కుదుర్చుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి అమ్మకాలు ఉంటాయి.

నిరుద్యోగులకు శుభవార్త: కొత్త ఉద్యోగాలకు టెంత్ పాస్!నిరుద్యోగులకు శుభవార్త: కొత్త ఉద్యోగాలకు టెంత్ పాస్!

ఆన్‌లైన్ ద్వారా చేనేత ఉత్పత్తులు

ఆన్‌లైన్ ద్వారా చేనేత ఉత్పత్తులు

ఎన్నికలకు ముందు చేనేత రంగం అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వైయస్సార్ చేనేత నేస్తం కింద ప్రతి సంవత్సరం రూ.24,000 ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో దేశవిదేశాలకూ చేనేత ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా పటిష్టమైన మార్కెటింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందే

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందే

వివిధ రకాల పట్టు చీరలు మొదలు, చొక్కాలు, దోవతులు.. ఇలా అన్ని చేనేత ఉత్పత్తులను ఇకపై ఆన్‌లైన్ షాపింగ్ చేసుకునేలా చర్యలు తీసుకుంటోంది. మీకు నచ్చిన చేనేత ఉత్పత్తులను ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇందుకే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ఆన్‌లైన్ ద్వారా అమ్మకాలకు పెడుతుంది.

మొదటి వారంలో అమెజాన్, చివరి వారంలో ఫ్లిప్‌కార్ట్

మొదటి వారంలో అమెజాన్, చివరి వారంలో ఫ్లిప్‌కార్ట్

నవంబర్ 1వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభం కానున్నాయి. తొలిదశలో భాగంగా 25 ఉథ్పత్తులను అమెజాన్ ద్వారా విక్రయిస్తున్నారు. నవంబర్ చివరి వారం నుంచి ఫ్లిప్‌కార్ట్‌లోను ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. 25 రకాల చేనేత ఉత్పత్తులను.. ఒక్కో రకానికి వెయ్యి చొప్పున ఆన్‌లైన్ మార్కెట్లో ఉండేలా చూస్తున్నారు. చీరలు, డ్రస్ మెటిరీయల్స్, చున్నీలు, చొక్కాలు, దోవతులు, బెడ్ షీట్స్, టవల్స్, పిల్లో కవర్స్, లుంగీలు, హ్యాండ్ కర్చీఫ్స్ వంటివి ఉన్నాయి. ఏవైనా వస్త్రాలు అమ్ముడు పోకుంటే ఎప్పటికప్పుడు వాటిని తీసేసి కొత్త డిజైన్లను అందుబాటులోకి తెస్తారు.

రూ.500 నుంచి రూ.20,000 వరకు...

రూ.500 నుంచి రూ.20,000 వరకు...

ఆన్‌లైన్ మార్కెట్లో చేనేత వస్తువులు అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు ఉండనున్నాయి. రూ.500 నుంచి రూ.20,000 వరకు ధరలు ఉంటాయి. మార్కెట్ కంటే తక్కువ ధరకు విక్రయించేలా చర్యలు తీసుకుంటున్నారు. కస్టమర్లు చీటింగ్‌కు గురికాకుండా ఉండేందుకు ఆన్‌లైన్ ద్వారా విక్రయించే చేనేత వస్త్రాలపై ప్రభుత్వ గుర్తింపు లోగో ఉంటుంది.

English summary

రూ.500 నుంచి రూ.20,000 వరకు వస్త్రాలు: అమెజాన్-ఫ్లిప్‌కార్ట్‌లతో జగన్ ప్రభుత్వం ఒప్పందం | AP government agreement with Amazon and Flipkart for handloom garments

Andhra Pradesh government agreement with Amazon and Flipkart for handloom garmets. Customers can buy handloom products from e-commerce websites from November 1.
Story first published: Monday, October 28, 2019, 9:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X