For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్ఫోసిస్ దెబ్బ, భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

|

ముంబై: మార్కెట్లు మంగళవారం నాడు భారీ నష్టాల్లో ముగిశాయి. సీఈవోపై ఆరోపణల నేపథ్యంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు కుప్పకూలాయి. ఈ ప్రభావం పడింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు కూడా బలహీనంగా ఉన్నాయి. దీంతో భారత మార్కెట్లు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. ఎనర్జీ, బ్యాంకింగ్ రంగాల షేర్లు ఉత్సాహంగా ప్రారంభమైనప్పటికీ ఇన్ఫోసిస్ పతనంతో ఒత్తిడికి గురయ్యాయి. నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు ఏ దశలోను కోలుకోలేదు.

షేర్లు లాభాల్లో ఉంటే పట్టించుకోరు..: ఇన్ఫోసిస్ సీఈవో 'పక్కదారి' పట్టించారని ఆరోపణలు

సెన్సెక్స్ 334.54 పాయింట్లు (0.85 శాతం) దిగజారి 38963.84 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 73.50 పాయింట్లు (0.63 శాతం) తగ్గి 11588.40 వద్ద క్లోజ్ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.94 వద్ద ట్రేడ్ అయింది.

 Sensex ends 300 pts lower, Nifty below 11,600: Infosys tanks 16%

ఇన్ఫోసిస్ సీఈవో, సీఎఫ్ఓపై ఆరోపణల నేపథ్యంలో ఈ టెక్ దిగ్గజం షేర్లు 16 శాతం మేర నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో ధర రూ.16.65 తగ్గి రూ.640 వద్ద క్లోజ్ కాగా, బీఎస్ఈలో 16.21 తగ్గి రూ.640.30 వద్ద ముగిసింది.

ఈ రోజు మధ్యాహ్నం గం.3.33 నిమిషాల వరకు టాప్ గెయినర్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకు, కోల్ ఇండియా, హెచ్‌యూఎల్, సన్ ఫార్మా, బజాజ్ ఆటో ఉన్నాయి. నష్టపోయిన వాటిల్లో ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, హెచ్‌సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

English summary

ఇన్ఫోసిస్ దెబ్బ, భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Sensex ends 300 pts lower, Nifty below 11,600: Infosys tanks 16%

Sensex ended down 334.54 points or 0.85 percent at 38963.84, and the Nifty closed 73.50 points lower or 0.63 percent at 11588.40.
Story first published: Tuesday, October 22, 2019, 18:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X