For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'అనైతిక' దెబ్బ: ఆరేళ్ల కనిష్టానికి... భారీ నష్టాల్లో ఇన్ఫోసిస్ షేర్లు

|

ముంబై: సాఫ్టువేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ అనైతిక పద్ధతి ఆరోపణల్లో చిక్కుకున్న నేపథ్యంలో మంగళవారం ఉదయం (అక్టోబర్ 22) ఆ కంపెనీ షేర్లు ఓ సమయంలో 16 శాతం మేర నష్టపోయాయి. గత ఆరేళ్లలో ఇన్ఫీ షేర్లు ఇంతలా పడిపోవడం ఇదే ప్రథమం. సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నిలంజన్ రాయ్‌లపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ఎస్ఈలో స్టాక్స్ 10 శాతం పడిపోయి రూ.691 వద్ద ఉంది. ఉదయం గం.10.27 నిమిషాలకు షేర్ 103.00 (13.41%) తగ్గి 664.85 వద్ద ఉంది.

ఇన్ఫోసిస్ అనైతిక విధానాల ఆరోపణల్లో చిక్కుకోవడం సంచలనం రేపుతోంది. దీంతో షేర్లు పడిపోతున్నాయి. తాజా పరిమాణాల నేపథ్యంలో అమెరికాలోని నాస్‌డాక్‌లో లిస్టైన ఇన్ఫోసిస్ ఏడీఆర్ (అమెరికన్ డిపాజిటరీ రిసీట్) సోమవారం కుప్పకూలింది. ఓ దశలో 16 శాతం వరకు నష్టపోయింది.

సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ స్వల్పకాలిక ఆదాయాలు, లాభాలను పెంచి చూపించేందుకు అనైతిక విధానాలు పాటిస్తున్నట్లు కంపెనీకి చెందిన కొంతమంది గుర్తు తెలియని ఉద్యోగులు బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కొన్ని క్వార్టర్లలో సీఈవో పాటిస్తున్న అనైతిక విధానాలను మీ దృష్టికి తీసుకు వస్తున్నామని, స్వల్పకాలిక ఆదాయాలు, లాభాలు పెంచి చూపిస్తున్నారని, ప్రస్తుత త్రైమాసికంలోను అలాంటి విధానాలే పాటిస్తున్నారని ఆరోపించారు.

షేర్లు లాభాల్లో ఉంటే తప్పు పట్టించుకోరు: ఇన్ఫోసిస్ సీఈవో 'పక్కదారి' పట్టించారని ఆరోపణలుషేర్లు లాభాల్లో ఉంటే తప్పు పట్టించుకోరు: ఇన్ఫోసిస్ సీఈవో 'పక్కదారి' పట్టించారని ఆరోపణలు

Infosys Shares Sink 16% After Whistleblowers Target CEO Over Unethical Practices

దీనిపై బోర్డు తక్షణమే విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని సెప్టెంబర్ 20వ తేదీన డైరెక్టర్స్ బోర్డుకు వారు లేఖ రాశారు. ఇందుకు సంబంధించిన ఈ-మెయిల్స్, వాయిస్ రికార్డింగ్స్ తమ వద్ద ఉన్నట్లు వారు తెలిపారు. ఫిర్యాదు చేసిన వారు తమను తాము నైతిక ఉద్యోగులుగా పేర్కొన్నారు. ప్రజావేగుల ఫిర్యాదును కంపెనీ పాలసీ ప్రకారం ఆడిట్ కమిటీ ముందు ఉంచినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.

కాగా, మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.52 నిమిషాలకు సెన్సెక్స్ 83 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అయింది. ఉదయం గం.10.33 నిమిషాలకు సెన్సెక్స్ 101.95 (0.26%) పాయింట్లు కోల్పోయి 39,196.43 వద్ద, నిఫ్టీ 9.10 (0.078%) పాయింట్లు నష్టపోయి
11,652.75 వద్ద ట్రేడ్ అయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.92గా ఉంది. ఇన్ఫోసిస్‌తో పాటు టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. యస్ బ్యాంకు, టైటాన్ ఇండస్ట్రీస్, విప్రో, బీపీసీఎల్, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.

English summary

'అనైతిక' దెబ్బ: ఆరేళ్ల కనిష్టానికి... భారీ నష్టాల్లో ఇన్ఫోసిస్ షేర్లు | Infosys Shares Sink 16% After Whistleblowers Target CEO Over Unethical Practices

Infosys shares plunged 16 per cent on Tuesday, marking their worst intraday drop in over six years, after CEO Salil Parekh and CFO Nilanjan Roy were accused of unethical practices by anonymous employees.
Story first published: Tuesday, October 22, 2019, 10:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X