ముంబై: ఉన్నతాధికారులపై విజిల్ బ్లోయర్ ఫిర్యాదుల నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఆడిట్ కమిటీ పరిశీలిస్తోందని, ఈ దర్యాఫ్తు పారదర్శకంగా, స్వతంత్రంగా ఉంటుందని, అందుకే సీఈవో, సీఎఫ్ఓలను ఇందులో నుంచి ఉపసంహరించామని ఇన్ఫీ చైర్మన్ నందన్ నీలేకని మంగళవారం (అక్టోబర్ 22) స్టాక్ ఎక్స్చేంజీకి తెలియజేశారు. ఇన్ఫోసిస్ దర్యాఫ్తు సారాంశాన్ని తగిన సమయంలో అందిస్తామని, కార్పోరేట్ పాలనాప్రమాణాలను పాటిస్తామని, అలాగే, వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని, ఇందుకు ఇన్ఫోసిస్ బోర్డు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
ఇన్ఫోసిస్ అనైతిక విధానాల ఆరోపణల్లో చిక్కుకుంది. సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ స్వల్పకాలిక ఆదాయాలు, లాభాలను పెంచి చూపించేందుకు అనైతిక విధానాలు పాటిస్తున్నట్లు కంపెనీకి చెందిన కొంతమంది గుర్తు తెలియని ఉద్యోగులు బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఇది సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లు మంగళవారం పది శాతం నుంచి 15 శాతం మధ్య పడిపోయాయి. మరోవైపు, నందన్ నీలేకని స్టాక్ ఎక్స్చేంజ్‌కు సమాచారం ఇచ్చారు.

అక్టోబర్ 11, 2019 నాటి బోర్డు సమావేశం అనంతరం ఆడిట్ కమిటీ స్వతంత్ర అంతర్గత ఆడిటర్లతో సంప్రదింపులు జరిపింది. స్వతంత్ర దర్యాఫ్తు జరిపేందుకు న్యాయ సంస్థ పార్థూల్ అమర్ చంద్ మంగళదాస్ అండ్ కంపెనీని సంప్రదించినట్లు కూడా స్టాక్ ఎక్స్చేంజ్‌కు తెలిపారు.
కంపెనీకి చెందిన పేరు తెలియని విజిల్ బ్లోయర్స్ ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నామని, ఓ బోర్డు సభ్యుడికి సెప్టెంబర్ 30, 2019న రెండు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ విషయాన్ని అక్టోబర్ 10, 11 తేదీల్లో బోర్డ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కమిటీల ముందు ఉంచామని చెప్పారు. ఈ ఫిర్యాదులు వరుసగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications