For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రయాణం టు షాపింగ్: చిన్న చిట్కాలు.. బోలెడన్ని లాభాలు!

|

మధ్యతరగతి ప్రజలకు ప్రతి రూపాయీ విలువైనదే. సంపాదించే సొమ్మును చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తుంటారు. చేతిలో ఉన్న మొత్తాన్నిఅనవసరాల కోసం ఖర్చు చేసి దిక్కులు చూడటం కన్నా ఉన్న దాంట్లో కొంత దాచుకుంటే అది మరో రోజుకు ఉపయోగపడుతుందని ఆలోచించే మనస్తత్వం పెరిగిపోతోంది. ముఖ్యంగా నగరాల్లో జీవించే వారు తమ రోజువారీ జీవనంలో ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రయాణాలు, నిత్యావసరాలు, అద్దెల కోసం వీరు ఎక్కువ మొత్తం వెచ్చిస్తుంటారు. అయితే కొన్ని రకాల పొదుపు చర్యలు పాటించడం వల్ల ఖర్చులను తగ్గించుకోవడానికే కాకుండా సొమ్మును పొదుపు చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఆ చిట్కాలు ఏమిటంటే...

లాభాలు పెంచి చూపుతున్నారని తీవ్ర ఆరోపణలులాభాలు పెంచి చూపుతున్నారని తీవ్ర ఆరోపణలు

ప్రయాణాల్లో...

ప్రయాణాల్లో...

* ఉద్యోగం చేసే వారు తాము పని చేస్తున్న కంపెనీకి దగ్గరలో నివసిస్తుంటే ప్రయాణ ఖర్చు మిగులుతుంది. దూరంగా ఉంటే మాత్రం ప్రయాణం కోసం ఖర్చు చేయక తప్పదు. బైక్ లేదా బస్సు లేదా మెట్రో ట్రైన్ ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. పెట్రోల్ ధరలు పెరుగుతున్నందు వల్ల బైక్ పై వెళితే పెట్రోల్ వ్యయం పెరిగినట్టే. ఇలాంటి పరిస్థితిలో ఒకే ఆఫీసులో పని చేసే వారు కలిసి బైక్ పై వెళ్లడం వల్ల ఖర్చు కలిసి వస్తుంది. పెట్రోల్ బిల్లును పంచుకుంటే ఇద్దరికీ ప్రయోజనం ఉంటుంది.

మెట్రో కార్డు

మెట్రో కార్డు

* మెట్రో లో ప్రయాణించే వారు టికెట్ కొనుగోలు చేయకుండా మెట్రో స్మార్ట్ కార్డును తీసుకోవడం వల్ల ప్రతి ప్రయాణంలోను డిస్కౌంట్ లభిస్తుంది. అంతే కాకుండా డిజిటల్ వ్యాలెట్ల ద్వారా మెట్రో కార్డు రీఛార్జి చేసుకుంటే కొంత క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. ప్రతి రోజు ప్రయాణం చేసే వారికీ ఇవి ఎంతగానో కలిసివస్తాయి.

ఉబెర్, ఓలా

ఉబెర్, ఓలా

* ఓలా, ఉబెర్ లాంటి వాటిలోనూ ప్రయాణించే వారు పెరుగుతున్నారు. కాబట్టి వీటిలో ప్రయాణించే సమయంలోను కొంత మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. ఈ సంస్థలు కొన్ని సందర్భాల్లో ఆఫర్లను ఇస్తుంటాయి. వాటిని వినియోగించుకోవడం వల్ల ప్రయాణ ఖర్చు తగ్గుతుంది. అంతే కాకుండా రైడ్ షేరింగ్ సదుపాయం కూడా ఉంటుంది కాబట్టి దాన్ని వినియోగించుకోవడం వల్ల బిల్లు తగ్గడానికి అవకాశం ఏర్పడుతుంది. బైక్ లను కూడా బుక్ చేసుకునే సదుపాయం ఉంది. దీని వల్ల కూడా ప్రయాణ వ్యయం తగ్గడమే కాకుండా తక్కువ సమయంలోనే గమ్య స్థానానికి చేరుకునే అవకాశం ఏర్పడుతుంది.

రీఛార్జులు

రీఛార్జులు

* ఇంట్లో ఉన్న వాళ్లందరికీ ఒక్కో ఫోను ఉన్న రోజులివి. ఫీచర్ ఫోన్ల కన్నా స్మార్ట్ ఫోన్లే ఎక్కువ ఉంటున్నాయి. వీటిలో ఇంటర్నెట్ తప్పనిసరి. వీటి రిఛార్జుల కోసం తెలియకుండానే వందల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది.మాట్లాడినా మాట్లాడుకున్న ప్రతి నెలా మొబైల్ ఫోన్ కు కనీస రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు మొబైల్ వ్యాలెట్లను వినియోగించుకోవడం మేలు. ఈ వ్యాలెట్లు రిఛార్జులపై క్యాష్ బ్యాక్ లు ఇస్తుంటాయి. వాటిని వాడుకోవడం వల్ల కొంత కలిసి వస్తుంది. కొన్ని టెలికం కంపెనీలు తమ యాప్ ల ద్వారా రీఛార్జ్ చేసుకుంటే కొంత డిస్కౌంట్ ఇస్తున్నాయి. ఇవి కూడా రీఛార్జ్ బిల్లులను

తగ్గిస్తుంటాయి.

* డీటీహెచ్, కేబుల్ టీవీ రిఛార్జులను కూడా ఆన్ లైన్ లో చేసుకోవడం ద్వారా కొంత మేరకు డిస్కౌంట్లను పొందడానికి అవకాశం ఉంటుంది.

* కరెంట్ బిల్లుల చెల్లింపులు కూడా ఆన్ లైన్ ద్వారా చెల్లింపు సదుపాయాలున్నాయి. వీటి చెల్లింపులపై కూడా కొన్ని వాలెట్లు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్లను ఇస్తున్నాయి. అంతే కాకుండా పేమెంట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నాయి. దీని వల్ల బిల్లుపై చెల్లింపు గడువు తేదీని మరచి పోయి జరిమానాను భరించే అవసరం తప్పుతుంది.

ఇంధనాలు కొనేటప్పుడు...

ఇంధనాలు కొనేటప్పుడు...

* వాహనాలకు పెట్రోల్, డీజిల్ తప్పనిసరి. మనం ఖచ్చితంగా లెక్కించము గాని ప్రతి నెలా బైక్ పెట్రోల్ కోసం వందల రూపాయలు పెడుతుంటాము. కార్లకు కూడా బిల్లు బాగానే అవుతుంది. కొన్ని రకాల క్రెడిట్ కార్డులతో ఇంధన బిల్లులు చెల్లిస్తే ఎక్కువ పాయింట్లు వస్తుంటాయి. వీటిని మల్లి ఇంధనం కోసం లేదా ఇతర కొనుగోళ్ల కోసం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలంటి వాటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు పెట్రోల్ పంపుల్లో డిజిటల్ చెల్లింపునకు అవకాశం ఉంటుంది. డిజిటల్ వ్యాలెట్లను వినియోగించి చెల్లింపులు చేస్తే క్యాష్ బ్యాక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటిని వినియోగించుకోవడం మంచిది.

ఫుడ్ ఆర్డరింగ్

ఫుడ్ ఆర్డరింగ్

* రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేయడం వల్ల కాస్త ఖర్చు ఎక్కువే అవుతుంది. ప్రయాణం కోసం సమయం కూడా వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే ఆహారాన్ని డెలివరీ చేస్తున్న యాప్స్ లో మంచి డిస్కౌంట్లు ఇచ్చే వాటి ద్వారా ఫుడ్ ను ఆర్డర్ చేయడం వల్ల కొంత మొత్తం ఆదా అవుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుంటారు. కాబట్టి వాటిపై పెడితే ఆహార ఖర్చును కొంత తగ్గించుకోవచ్చు.

షాపింగ్...

షాపింగ్...

* షాపింగ్ మాల్స్, రిటైల్ స్టోర్లు పండగలు లేదా ప్రత్యేక రోజుల్లో డిస్కౌంట్లు, ఆఫర్లను ఇస్తుంటాయి. అంతే కాకుండా క్యాష్ బ్యాక్ కూడా ఇస్తాయి. సాధారణ రోజులకన్నా ఇలాంటి ప్రత్యేక సందర్భల్లో కొనుగోళ్లు జరిపితే ఎక్కువ లాభం ఉంటుంది.

ఇప్పటికే ఇలాంటి చిన్న చిట్కాలను చాలా మంది పాటిస్తున్నారు.. మీరు కూడా పాటించండి... డబ్బు ఆదా చేసుకోండి.

English summary

ప్రయాణం టు షాపింగ్: చిన్న చిట్కాలు.. బోలెడన్ని లాభాలు! | From travelling to shopping: benefit from small tricks

Using a metro card gives you a 10 per cent discount of the actual fare. Easy to use and swipe. No standing in long queues and waiting in the token counter. Saves your your time. No tension of money and changes of the fare.
Story first published: Monday, October 21, 2019, 16:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X