For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వండర్ ఫుల్ అఫర్ : ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి... బీమా కవరేజ్ పొందండి..

|

ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్ డీ ) కస్టమర్లను ఆకర్షించే నిమిత్తం ప్రయివేట్ రంగంలోని ఐసీఐసీఐ బ్యాంక్ సరికొత్త డిపాజిట్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని పేరు 'ఎఫ్ డీ హెల్త్'. దీని ద్వారా కస్టమర్లు ద్వంద్వ ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంది. ఎఫ్ డీ ద్వారా పెట్టుబడులను వృద్ధి పరచుకోవచ్చు. మరోవైపు 30 రకాల తీవ్రమైన వ్యాధులకు బీమా కవరేజీ ప్రయోజనాన్ని పొందవచ్చు.

ఐసీఐసీఐ ఉచిత ఇన్సురెన్స్ కవరేజ్

ఐసీఐసీఐ ఉచిత ఇన్సురెన్స్ కవరేజ్

ఈ కవరేజీని మొదటి ఏడాదికి ఉచితంగానే అందిస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ చెబుతోంది. తర్వాత కస్టమర్లు దాన్ని అవసరమైతే రెన్యూవల్ చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొంది. ఇలాంటి సదుపాయాన్ని బ్యాంకింగ్ రంగంలో ఇప్పటివరకు ఎవరు అందుబాటులోకి తీసుకురాలేదని చెబుతోంది. ప్రస్తుతం అన్ని బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను అందిస్తున్నాయి. ఇవి అందించే వడ్డీ రేటులో కాస్త ఎక్కువ తక్కువ ఉంటుంది. అయితే ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్శించాలంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. అందుకే ఐసీఐసీఐ బ్యాంక్ ఈ వినూత్న పథకాన్ని తెచ్చినట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

రూ. 1 లక్ష కవరేజీ

రూ. 1 లక్ష కవరేజీ

* ఎఫ్ డీ హెల్త్ కింద రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు కనీసం రెండేళ్లకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

* ఇలా డిపాజిట్ చేసిన కస్టమర్లకు ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్సు నుంచి కంపెనీ నుంచి కాంప్లిమెంటరీగా రూ. లక్ష క్రిటికల్ ఇల్ నెస్ కవరేజీ లభిస్తుంది.

* వడ్డీ రేటు కూడా ఆకర్షణీయంగా ఉంటుందని బ్యాంకు చెబుతోంది.

* 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు ఈ ఎఫ్ డీ ఖాతాను ప్రారంభించవచ్చు.

* కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీ పనిచేయకపోవడం, కాలేయ వ్యాధులు, బ్రెయిన్ ట్యూమర్, అలజమీర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు బీమా కవరేజీ లభిస్తుంది.

* కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఫిక్స్డ్ , రీకరింగ్ డిపాజిట్ పథకాలను ఎప్పటికప్పుడు తీసుకువస్తున్నట్టు ఐసీఐసీఐ బ్యాంక్ చెబుతోంది. ఇప్పటికే ఎఫ్ డీ ఎక్స్ ట్రా పేరుతో తెచ్చినట్టు పేర్కొనండి. ఇది విభిన్న వయసుల కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉన్నట్టు బ్యాంకు పేర్కొంది.

ఫిక్స్డ్ డిపాజిట్లపై పెరుగుతున్న ఆసక్తి

ఫిక్స్డ్ డిపాజిట్లపై పెరుగుతున్న ఆసక్తి

*ఫైనాన్సియల్ మార్కెట్లో తీవ్ర ఒడిదొడుకులు నెలకొంటున్నాయి. దీనివల్ల ఇన్వెస్టర్లలో ఆందోళన ఎక్కువ అవుతోంది. ఇలాంటి తరుణంలో పెట్టుబడులు పెడితే నష్టాలకువస్తాయేమోనని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి రిస్క్ లేకుండా ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లకు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నారని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.

* మంచి వడ్డీ రేటు, లిక్విడిటీ, మూలధనానికి భద్రత, హామీ పూర్వక రిటర్న్ ను ఇచ్చే ఎఫ్ డీ ల్లో పెట్టుబడులు పెడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త పథకాలకు బ్యాంకులు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

English summary

వండర్ ఫుల్ అఫర్ : ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి... బీమా కవరేజ్ పొందండి.. | ICICI Bank introduces new fixed deposit scheme FD Health

ICICI Bank has launched a new Fixed Deposit (FD) scheme - FD Health. The scheme offers FD with a health benefit through a critical illness coverage. Customers will be offered a complimentary insurance cover of Rs 1 lakh.
Story first published: Thursday, October 17, 2019, 15:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X