For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ దూకుడు.. సాటి ఎవ్వరు?: రెచ్చిపోతున్న రిలయన్స్ షేరు!

|

వ్యాపార రంగంలో ఆయన ఏది పట్టినా అది బంగారమే అవుతోంది. మీ ఊహ కరెక్టే.. ఆయన పేరు ముఖేశ్ అంబానీ. స్టాక్ మార్కెట్‌లో ఒక షేర్ రెచ్చిపోతోంది. ఇప్పుడూ మీ ఊహ కరెక్టే. అది రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్. దేశంలోకెల్లా అత్యంత ధనవంతుడాయన. మళ్లీ మీ ఊహే రైట్. ఆయనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ.

ఇలా చెప్పుకుంటూ పోతే.. అటు రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యం గురించి, దాని అధిపతి ముఖేశ్ అంబానీ గురించి చాలా చెప్పొచ్చు. విశేషం ఏమిటంటే.. చాలా ఏళ్లుగా ఈయన వ్యాపార సామ్రాజ్యంగాని, ఈయన సంపదగాని పెరగడమే తప్ప తరగడం అనేది ఎరుగవు. నిన్నగాక మొన్న విడుదలైన ఫోర్బ్స్ జాబితాలో కూడా ముఖేశ్ అంబానీదే టాప్ ప్లేస్‌.

రెచ్చిపోతున్న రిలయన్స్ షేరు...

రెచ్చిపోతున్న రిలయన్స్ షేరు...

అవును రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు రెచ్చిపోతోంది. గత నెలలో ఈ షేరు ధర 9.6 శాతం పెరిగింది. ప్రస్తుతం షేరు ధర రూ.1,352.40కి చేరుకుంది. దీంతో దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలోని అపర కుబేరుల్లో ముఖేశ్ అంబానీ టాప్ అయితే.. ఆయన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా టాప్ ప్లేస్‌లో నిలిచింది.

ఒక్క నెలలో రూ.40 వేల కోట్లు...

ఒక్క నెలలో రూ.40 వేల కోట్లు...

గత నెలలో ముఖేశ్ అంబానీ సంపద ఏకంగా రూ.40 వేల కోట్లు పెరిగింది. ప్రస్తుతం ఈయన సంపద రూ.4.2 లక్షల కోట్లకు చేరుకుంది. ఇదంతా కూడా స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ షేర్ రెచ్చిపోవడం వల్లే. గత శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8.57 లక్షల కోట్లకు ఎగసింది. గత రెండు మూడు వారాలుగా రిలయన్స్ షేర్ బాగా ర్యాలీ చేస్తోంది.

ప్రధాన పోటీ టీసీఎస్‌తోనే...

ప్రధాన పోటీ టీసీఎస్‌తోనే...

గతంలో మోస్ట్ వాల్యూడ్ కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) నిలిచేది. అయితే ఇప్పుడు ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ కంపెనీతో పోటీ పడుతోంది. ఒకదానితో ఒకటి పోటీపడుతున్నాయి. ఒక్కోసారి ఈ రేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్.. టీసీఎస్‌ను మించిపోతోంది. గత శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.8.57 లక్షల కోట్లకు ఎగసింది. ఆ రోజున టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.46 లక్షల కోట్లుగా ఉంది.

ఈ రెండు కంపెనీల నడుమ ఉన్న వ్యత్యాసం రూ.1.11 లక్షల కోట్లు.

అంతా.. ‘జియో' మహిమ...

అంతా.. ‘జియో' మహిమ...

రిలయన్స్ షేరు ధర రెచ్చిపోవడానికి ప్రధాన కారణం ఆ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ‘రిలయన్స్ జియో' అని తెలుస్తోంది. జియో.. ప్రత్యర్థి కంపెనీలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలతో పోల్చితే మంచి మార్జిన్లు రాబడుతోంది. యాక్సిస్ క్యాపిటల్ అంచనా ప్రకారం.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో జియో ఆపరేటింగ్ ఇన్‌కమ్ 5.2 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకేం మరి.. రిలయన్స్ జియో అందామా? జియో రిలయన్స్ అందామా??

English summary

ఈ దూకుడు.. సాటి ఎవ్వరు?: రెచ్చిపోతున్న రిలయన్స్ షేరు! | Mukesh Ambani's wealth surges by Rs 40,000 crore in a month

In the last month, Mukesh Ambani's wealth increased by Rs 40,000 crore to Rs 4.2 lakh crore ($59 billion) due to the 9.6 per cent jump in the share price of Reliance Industries (RIL). Last month's rally of RIL's shares has helped the company regain the top spot as the most valued company in India, ahead of its competitor Tata Consultancy Services (TCS).
Story first published: Monday, October 14, 2019, 18:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X