For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీ రైతులకు జగన్ 'భరోసా': రూ.1,000 రైతు భరోసా పెంపు, అనర్హులు, దరఖాస్తు చివరి తేదీ..

|

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ ప్రభుత్వం సోమవారం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ఇదివరకు పెట్టుబడి సాయంగా కేంద్రం రూ.6,000కు తోడు ఏపీ ప్రభుత్వం రూ.6500 కలిపి మొత్తం రూ.12,500 ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు మరో రూ.1,000 అదనంగా ఇవ్వనున్నారు. దీంతో రైతుకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.13,500 కానుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అమలు అందిస్తారు. రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15న (నేడు) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కాకుటూరులో ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభిస్తారు. 15వ తేదీ ఉదయం గం.10.30లకు విక్రమసింహపురి యూనివర్సిటీకి చేరుకుంటారు. అనంతరం కౌలు రైతులకు కార్డులను పంపిణీ చేస్తారు. రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేస్తారు.

తప్పిన జగన్ ప్రభుత్వం అంచనాలు, భారమవుతున్న ఖర్చులు!తప్పిన జగన్ ప్రభుత్వం అంచనాలు, భారమవుతున్న ఖర్చులు!

రూ.13,500... ఎప్పుడెప్పుడు ఎంత ఇస్తారంటే?

రూ.13,500... ఎప్పుడెప్పుడు ఎంత ఇస్తారంటే?

రైతు భరోసా పథకానికి రూ.5,510 కోట్లను విడుదల చేస్తూ ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. రైతు భరోసా డబ్బులను బ్యాంకులు పాత బకాయిలు లేదా ఇతర బకాయిల కింద జమ చేసుకోవడానికి వీల్లేదు. రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 ఇస్తారు. ఇందులో రూ.7,500 మే నెలలో ఇస్తారు. రబీలో రూ.4,000, సంక్రాంతికి రూ.2,000 రైతుల అకౌంట్లలో జమ చేస్తారు.

రైతు భరోసా నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంపు

రైతు భరోసా నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంపు

రైతులకు, కౌలు రైతులకు నాలుగేళ్ల పాటు.. ఏడాదికి రూ.12,500 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఏడాదికి రూ.13,500తో పాటు మరో గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగేళ్లకు బదులు అయిదేళ్ల పాటు దీనిని ఇవ్వనున్నట్లు చెప్పింది.

నేతల్లో రైతు భరోసాకు అనర్హులు.. అర్హులు

నేతల్లో రైతు భరోసాకు అనర్హులు.. అర్హులు

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చే రూ.6,000కు తోడు ఏపీ ప్రభుత్వం రూ.7,500 జత చేసి రైతు భరోసాను ఇస్తుంది. అయితే ఈ రైతు భరోసా పొందేందుకు కొంతమంది అనర్హులు. వారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలకు రైతు భరోసా వర్తించదు. అదే సమయంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అర్హులు. పిల్లలు ఉద్యోగులుగా ఉండి వ్యవసాయం చేస్తున్న తల్లిదండ్రులు కూడా రైతు భరోసాకు అర్హులు.

రైతు.. కౌలు రైతుకు లాభం..

రైతు.. కౌలు రైతుకు లాభం..

రైతు భరోసా వల్ల 50 లక్షలమంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం ద్వారా కౌలు రైతులకు కూడా ప్రయోజనం చేకూరనుంది. 3 లక్షల మంది కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు.

రైతుకు పెరగనున్న భరోసా

రైతుకు పెరగనున్న భరోసా

రైతులకు రూ.1,000 అదనంగా పెంచడంతో పాటు నాలుగేళ్ల నుంచి అయిదేళ్లకు పెంచిన నేపథ్యంలో రైతు భరోసా పొందే వారికి అయిదేళ్లలో రూ.50,000కు బదులు రూ.67,500 లబ్ధి చేకూరనుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ కంటే రూ.17,500 మొత్తాన్ని ఎక్కువగా ఇస్తోంది. అయితే ఇందులో కేంద్రం సహకారం కూడా ఉంది.

15వ తేదీ వరకు రైతు భరోసా దరఖాస్తు..

15వ తేదీ వరకు రైతు భరోసా దరఖాస్తు..

రైతు భరోసా కోసం రైతులు, కౌలు రైతులు నవంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి కన్నబాబు వెల్లడించారు. రైతు భరోసా అర్హత ఉన్న రైతు మృతి చెందినా ఆ కుటుంబానికి దీనిని కొనసాగిస్తారు. మృతి చెందిన రైతు భార్యకు పెట్టుబడి సాయం వస్తుంది.

English summary

ఏపీ రైతులకు జగన్ 'భరోసా': రూ.1,000 రైతు భరోసా పెంపు, అనర్హులు, దరఖాస్తు చివరి తేదీ.. | Good News for AP farmers: Rythu Bharosa increased to Rs.13,500

Good news for Andhra Pradesh farmers. Andhra Pradesh Government announced that Rythu Bharosa increased to Rs.13,500 per year.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X