For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్‌న్యూస్: జియో 30 నిమిషాల ఉచిత టాక్‌టైమ్ ఆఫర్, కానీ....

|

ఇతర టెలికం ఆపరేటర్లకు చేసే ఫోన్ కాల్ పైన నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నట్లు రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై జియో యూజర్లు ఆసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ ఛార్జ్ వసూలు చేసినప్పటికీ ఆ మొత్తానికి గాను డేటా ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. కానీ ఇది కస్టమర్లకు అంతగా నచ్చలేదు. మరోవైపు, వొడాఫోన్ ఐడియా మాత్రం తాము తమ కస్టమర్లకు ఎలాంటి ఐయూసీ ఛార్జ్ విధించమని స్పష్టం చేసింది. ఇతర నెట్ వర్క్స్‌కు చేసే వాయిస్ కాల్స్‌పై ఛార్జ్ వసూలు చేస్తామని చెప్పిన జియో తాజాగా కస్టమర్లకు శుభవార్త చెప్పింది! ఈ మేరకు ఎకనమిక్ టైమ్స్‌లో న్యూస్ వచ్చింది.

30 నిమిషాల పాటు ఉచిత టాక్ టైమ్

30 నిమిషాల పాటు ఉచిత టాక్ టైమ్

30 నిమిషాలపాటు ఉచిత టాక్ టైమ్ ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. నిమిషానికి 6 పైసలు ప్రకటన జియోకు నష్టం చేకూర్చేలా ఉంది. అనుకున్నదొక్కటి.. అయ్యేది ఒక్కటిలా తయారయింది పరిస్థితి. ఇలా ఛార్జ్ విధించడం ద్వారా మిగతా నెట్ వర్క్ కస్టమర్లను కూడా తనవైపు తిప్పుకోవాలనే సహా ఎన్నో యోచనలు ఉండి ఉండవచ్చు. కానీ జియో యూజర్లే దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ ప్రకటన తర్వాత రెండు రోజుల్లో అరగంట ఫ్రీ అనే శుభవార్త తెలిపింది.

వారం రోజుల పాటు అందుబాటులో ఆఫర్

వారం రోజుల పాటు అందుబాటులో ఆఫర్

ఇది (30 నిమిషాల ఉచిత టాక్ టైమ్) ఫస్ట్ టైమ్ రీఛార్జ్ చేయించుకున్న కస్టమర్లకు వర్తిస్తుంది. అలాగే, రీచార్జ్ ప్లాన్స్ ప్రకటించిన తొలి వారం రోజులు ఈ వన్ టైమ్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. కస్టమర్లను కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఆఫర్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే జియో వైపు కూడా కస్టమర్లు సులువుగా వచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది.

ఆర్పు పెరగొచ్చు.

ఆర్పు పెరగొచ్చు.

కాగా, ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీ (IUC) కింద నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నట్లు జియో ప్రకటించిన నేపథ్యంలో ఆర్పు (ARPU) పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీస్ చెబుతున్నాయి. జియోకు 350 మిలియన్ల కస్టమర్లు ఉన్నారు. అయితే ఈ నిర్ణయం ఇతర టెలికోస్ నుంచి వచ్చే కస్టమర్లను నిరోధిస్తోందని అంటున్నారు. అంటే జియోకు మళ్లేందుకు ఇప్పటి వరకు ఆసక్తి చూపిన వారు ఇక నుంచి పెద్దగా చూపించకపోవచ్చునని అంటున్నారు. అలాగే, ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోత్ 8 శాతం నుంచి 10 శాతానికి మాత్రమే పరిమితం కావొచ్చునని చెబుతున్నారు.

రిలయన్స్ జియో...

రిలయన్స్ జియో...

ఇతర నెట్ వర్క్ ఆపరేటర్లకు కాల్ చేస్తే జియో నిమిషానికి 6 పైసలు ఛార్జ్ చేస్తోంది. అయితే కస్టమర్లు తగ్గకుండా ఆఫర్ చేస్తున్న కొన్ని సంక్షిప్తంగా....

- మొదటి రీచార్జ్ పైన 30 నిమిషాల ఉచిత టాక్ టైమ్

- ఈ వన్ టైమ్ ఆఫర్ అక్టోబర్ 10 నుంచి ప్రారంభం. ఇది ఏడు రోజుల వరకు ఉంటుంది.

- సబ్‌స్క్రైబర్లను కోల్పోకుండా ఉండేందుకు అడిషనల్ ఫ్రీ టాక్ టైమ్

English summary

గుడ్‌న్యూస్: జియో 30 నిమిషాల ఉచిత టాక్‌టైమ్ ఆఫర్, కానీ.... | Jio offers 30 minutes free talk time to soothe customers

Reliance Jio Infocomm has started offering 30 minutes of free talk time to pacify customers unhappy about paying for calls made to other networks in an attempt to protect its subscriber base.
Story first published: Sunday, October 13, 2019, 7:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X