For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుడ్ న్యూస్: ఇకపై ఇండియాలోనే ఆపిల్ ఫోన్ల తయారీ: రవి శంకర్ ప్రసాద్

|

ఆపిల్ ఫోన్లు అంటేనే ప్రపంచమంతా ఒకటే క్రేజ్. ఆ కంపెనీ నుంచి వచ్చే ప్రతి కొత్త మోడల్ ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన తోలి రోజే సొంతం చేసుకోవాలని కలలు కంటారు. ముఖ్యంగా ఐఫోన్ సిరీస్ మొబైల్ ఫోన్లకు డిమాండ్ చాలా ఎక్కువ. అయితే, ఇప్పటివరకు ఆపిల్ సంస్థ తమ ఉత్పత్తులను అమెరికాలో డిజైన్ చేసి చైనా లో తయారు చేస్తోంది. చైనా నుంచి దిగుమతి చేసుకొని భారత్ సహా ప్రపంచ దేశాలకు సరఫరా చేస్తోంది. కానీ ఇకపై ఆపిల్ ఫోన్లు ఇండియా లోనే తయారు కాబోతున్నాయి. అతి త్వరలోనే ఆపిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ ది ఎకనామిక్ టైమ్స్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

దీంతో త్వరలోనే మనం మేడ్ ఇన్ ఇండియా ఆపిల్ ఐఫోన్ ను వాడబోతున్నామన్నమాట. అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చైనా తో ట్రేడ్ వార్ చేస్తున్నారు. చైనా లో వివిధ రంగాల్లో పనిచేస్తోన్న అమెరికా కంపెనీలను ఆ దేశం వీడాల్సిందిగా అల్టిమేటం జారీ చేసారు. ఈ నేపథ్యంలో అమెరికా కంపెనీలు చైనా కు ప్రత్యామ్నాయ దేశాలపై దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ప్రపంచంలోనే ఐదు అతిపెద్ద వినియోగ మార్కెట్ల లో ఒకటైన భారత్ వాటికి ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

SBI కీలక నిర్ణయం: ఏటీఎం నుంచి రూ.2000 నోటు తొలగింపు, రూ.500 నోటు కూడా

ముంబై లో అతిపెద్ద ఆపిల్ స్టోర్...

ముంబై లో అతిపెద్ద ఆపిల్ స్టోర్...

భారత్ లో తయారీకి ఆపిల్ పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం తమిళనాడులోని శ్రీపెరంబుదూరు వేదిక అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే, ముంబైలో అతి పెద్ద ఆపిల్ స్టోర్ నెలకొల్పాలని కూడా కంపెనీ తలపోస్తున్నట్లు కేంద్ర మంత్రి హింట్ ఇచ్చారు. అదే సమయంలో ఇప్పటికే భారత్లో మొబైల్స్ తయారు చేస్తున్న ఫాక్స్ కాన్ రెండో, మూడో తయారీ యూనిట్ కూడా నెలకొల్పే అవకాశం ఉంది. శ్యాం సుంగ్ కూడా చైనా నుంచి తరలి రానుంది. కస్టమ్స్ సుంకం 5% కూడా రద్దు చేయడటం తో మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్ లో ఆపిల్ ఆఫీస్...

హైదరాబాద్ లో ఆపిల్ ఆఫీస్...

దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా ఆపిల్ ఇప్పటికే పలు చర్యలు తీసుకోంది. ఇందులో భాగంగా అమెరికా వెలుపల అతిపెద్ద ఆఫీస్ ను హైదరాబాద్ లో నెలకొల్పింది. హైదరాబాద్ కేంద్రంగా ఆపిల్ తన కార్యకలాపాలు కొనసాగించనుంది. ఇందులో మ్యాప్ డెవలప్మెంట్ కార్యకలాపాలు కూడా ఉండనున్నాయి. అయితే, తయారీ కి మాత్రం ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీ సిటీ లేదా తమిళ నాడు లోని శ్రీపెరంబుదూరు ను ఎంచుకొనే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా హైదరాబాద్ ఆఫీస్ విస్తరణపై పాజిటివ్ గా ఉన్నారు. అయన ప్రత్యక్షంగా హాజరై ఇక్కడ నిర్వహణ సులభంగా ఉందని, ఉద్యోగుల సంఖ్యను భారీగా పెంచుతామని హామీ ఇచ్చారు.

ధరలు తగ్గే అవకాశం...

ధరలు తగ్గే అవకాశం...

ఆపిల్ ఫోన్లు భారత్ లోనే తయారు చేస్తే ... వాటి ధరలు కొంత మేరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే వస్తువులపై కస్టమ్స్ సుంకం విధిస్తారు. దీంతో ఆ మేరకు భారం వినియోగదారులపై పడుతుంది. కానీ భారత్ లోనే తయారు చేస్తే మాత్రం కస్టమ్స్ సుంకం పన్నులు ఏమి ఉండవు. అందుకే, ధరలు కనీసం 5 శాతం నుంచి 10% వరకు తగ్గే సూచనలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మొబైల్ ఫోన్ల తయారీ లో భారత్ ఇప్పటికే రెండో స్థానంలో ఉంది. ఆపిల్ సహా మరిన్ని సంస్థలు భారత్ కు తరలి వస్తే ఒకప్పటి చైనా లా భారత్ ఎదిగే అవకాశాలు మెండు అని విశ్లేషకులు చెబుతున్నారు.

పన్ను తగ్గింపు తో మేలు...

పన్ను తగ్గింపు తో మేలు...

ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ భారత్ లో కార్పొరేట్ టాక్స్ ను 30% నుంచి 22% నికి తగ్గించారు. మరీ ముఖ్యంగా అక్టోబర్ 1 తర్వాత నెలకొల్పే తయారీ రంగ కంపెనీలకు కార్పొరేట్ టాక్స్ కేవలం 15% మాత్రమేనని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆపిల్ సహా అనేక కంపెనీలు తమ తయారీ విభాగాన్ని కొత్త కంపెనీ రూపంలో నెలకొల్పి ప్రభుత్వం ప్రకటించిన 15% పన్నురేటును ఎంచుకొనే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆపిల్ కు దాదాపు 15% పన్ను చెల్లింపుల భారం తగ్గిపోతుంది. ఇది ఆ కంపెనీ లాభదాయకత పెరిగేందుకు ఉపయోగపడుతుంది. అదే సమయంలో ధరలు తగ్గేందుకు కూడా ఉపకరిస్తుంది. చైనా వంటి ఆకర్షణీయ దేశాల నుంచి భారత్ కు తమ తయారీ యూనిట్ల ను తరలించేందుకు తగ్గించిన కార్పొరేట్ టాక్స్ బాగా పనికి వస్తుంది. ప్రస్తుతం చైనా లో కార్పొరేట్ పన్ను రేటు 25% గా ఉంది.

English summary

Want to see Assembled in India on an iPhone: Ravi Shankar Prasad

Corporate tax rate cuts will spur manufacturing as overseas companies such as Apple, Foxconn and Flextronics are drawing plans to massively expand production in India, Union minister Ravi Shankar Prasad told.
Story first published: Monday, October 7, 2019, 10:42 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more