For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

HDFC ఫెస్టివ్ ట్రీట్స్ అదుర్స్:భారీ డిస్కౌంట్, 7,000 వరకు క్యాష్‌బ్యాక్, లోన్ తీసుకుంటే...

|

హైదరాబాద్: ప్రైవేటు రంగ బ్యాంకు దిగ్గజం HDFC తమ కస్టమర్లకు పండుగ సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. ఫెస్టివ్ ట్రీట్స్ పేరుతో పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తోంది. ఈ మేరకు హైదరాబాదులోని హెడ్ ఆఫీస్‌లో సోమవారం HDFC బ్యాంకు బ్రాంచ్ బ్యాంకింగ్ మేనేజర్ మధుసూదన్ హెగ్డే ఫెస్టివ్ ట్రీట్స్ రాయితీలకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. ఫెస్టివ్ ట్రీట్స్ వివరాలు వెల్లడించారు.

IRCTC ఆఫర్, ప్రత్యేక డిస్కౌంట్: తొలి రోజు 76% సబ్‌స్క్రైబ్IRCTC ఆఫర్, ప్రత్యేక డిస్కౌంట్: తొలి రోజు 76% సబ్‌స్క్రైబ్

1000కి పైగా బ్రాండ్స్‌పై డిస్కౌంట్స్

1000కి పైగా బ్రాండ్స్‌పై డిస్కౌంట్స్

HDFC ఫెస్టివ్ ట్రీట్ 2019ను సెప్టెంబర్ 30వ తేదీన లాంచ్ చేశారు. కస్టమర్లు ఈ బ్యాంకుకు చెందిన అన్ని ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు పొందతారు. లోన్స్ మొదలు బ్యాంకు అకౌంట్స్ వరకు అన్ని ఫైనాన్షియల్ సేవల ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. 1000కి పైగా బ్రాండ్స్‌తో చేతులు కలిపింది. పెద్ద ఎత్తున డిస్కౌంట్స్ ఉన్నాయి.

ప్రాసెసింగ్ ఫీజు డిస్కౌంట్, ఈఎంఐ తగ్గింపు, గిఫ్ట్ ఓచర్

ప్రాసెసింగ్ ఫీజు డిస్కౌంట్, ఈఎంఐ తగ్గింపు, గిఫ్ట్ ఓచర్

తొలిసారిగా రిటైల్ వినియోగదారులకు, వ్యాపార వినియోగదారులకు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు డిస్కౌంట్, ఈఎంఐ తగ్గింపు, గిఫ్ట్ ఓచర్స్ సహా ఎన్నో ప్రయోజనాలు అందిస్తోంది. స్పెక్ట్రం పరిధిలో ఈ పండుగ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజును సగానికి తగ్గించింది.

క్రెడిట్ కార్డుతో 1000కి పైగా బ్రాండ్స్‌పై క్యాష్ బ్యాక్

క్రెడిట్ కార్డుతో 1000కి పైగా బ్రాండ్స్‌పై క్యాష్ బ్యాక్

క్రెడిట్ కార్డులు, వ్యాపార రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, హోమ్ లోన్స్ పైన పలు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. 100కు పైగా ఈ-స్టోర్లు, పలు ఆన్‌లైన్ స్టోర్లు, పదివేలకు పైగా రిటైల్ స్టోర్లలో 1000కి పైగా బ్రాండ్స్ పైన క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. ఇందుకోసం ఒప్పందం చేసుకుంది.

ఈ ఆఫర్ ఎప్పటి వరకు అంటే..

ఈ ఆఫర్ ఎప్పటి వరకు అంటే..

HDFC ఫెస్టివ్ ఆఫర్ సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు నెల రోజుల పాటు దీర్ఘకాలం కొనసాగుతుంది. ఏడాదిలో ఈ త్రైమాసికంలోనే సేల్స్ ఎక్కువగా ఉంటాయని, ప్రత్యేక రాయితీల ద్వారా వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచుతున్నామని బ్యాంకు తెలిపింది. దేశవ్యాప్తంగా తమ బ్యాంకు శాఖలను ఫైనాన్షియల్ సూపర్ మార్కెట్లుగా మార్చనున్నట్లు తెలిపారు.

ప్రతీ గంటకూ లక్కీ డ్రా...

ప్రతీ గంటకూ లక్కీ డ్రా...

ఫెస్టివ్ ట్రీట్స్‌లో భాగంగా దేశవ్యాప్తంగా HDFCకి చెందిన 5.130 శాఖల్లో నెల రోజుల పాటు ప్రతి గంటకూ లక్కీ డ్రా కూడా నిర్వహిస్తున్నారు. ఫెస్టివ్ ట్రీట్ గురించి అకౌంట్ హోల్డర్స్ ఆయా బ్యాంకు శాఖలను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.

వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్స్

వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్స్

శాంసంగ్, ఎల్జీ, రిలయన్స్ డిజిటల్, ఆపిల్, లైఫ్ స్టైల్, మింత్ర, విజయ్ సేల్స్, హెచ్‌పీ, బిగ్ బాస్కెట్ వంటి బ్రాండ్స్ ఉత్పత్తుల్ని ఇన్-స్టోర్, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది. రుణాల ప్రాసెసింగ్ ఛార్జీలో తగ్గింపు, గిఫ్ట్‌ ఓచర్లు వంటివి ఉంటాయి. హైదరాబాద్‌ సహా పది ప్రధాన నగరాల్లో ఒకేసారి ఫెస్టివ్‌ ట్రీట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ అంటే..

లోన్ తీసుకుంటే ఎంత ఈఎంఐ అంటే..

ఆన్‌లైన్ స్టోర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో ఐఫోన్11ను కొనుగోలు చేస్తే రూ.7000 వరకు క్యాష్ బ్యాక్.

చిన్న వ్యాపారులకు ప్రాసెసింగ్ ఫీజు యాభై శాతాన్ని తగ్గించింది. దీంతో రూ.50 లక్షలకు పైగా రుణం తీసుకునే సంస్థలకు దాదాపు రూ.45,000 వరకు ప్రాసెసింగ్ ఫీజు ఆదా అవుతుంది.

వెహికిల్ లోన్ విషయానికి వస్తే కారుపై ప్రతి రూ.1 లక్షకు రూ.1,234, బైక్ పైన రోజుకు రూ.77, పర్సనల్ లోన్ పైన రూ.1 లక్షకు రూ.2,162 వరకు ఈఎంఐ చెల్లించాలి.

English summary

HDFC ఫెస్టివ్ ట్రీట్స్ అదుర్స్:భారీ డిస్కౌంట్, 7,000 వరకు క్యాష్‌బ్యాక్, లోన్ తీసుకుంటే... | Home loan to credit cards: HDFC Bank rolls out festive offers

HDFC Bank Festive Treats 2019: HDFC Bank on September 30 launched Festive Treats, India's largest financial services dhamaka. Customers will get special offers on all banking products from loans to bank accounts, as well as major discounts on over 1000+ brands.
Story first published: Tuesday, October 1, 2019, 8:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X