For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డులకు పండుగల కిక్కు: జోరుగా పెరుగుతున్నాయ్

|

దేనికైనా సమయం, సందర్భం రావాలంటారు పెద్దలు. ఇది క్రెడిట్ కార్డులకు కూడా వర్తిస్తుంది. ఆర్ధిక మందగమనం నేపథ్యంలో చాలా మంది కొనుగోళ్ల విషయంలో పునరాలోచనలో పడిపోయారు. అయితే ఇప్పుడు పండగ సీజన్ మొదలైంది. కాబట్టి ఆన్ లైన్, ఆఫ్ లైన్ సంస్థలు ఇస్తున్న ఆఫర్లకు ఫిదా అయిపోయి కొనుగోళ్లు చేసేందుకు జనం ముందుకువస్తున్నట్టు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో పండగల సీజనులో అమ్మకాలు పుంజుకుంటాయని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్ధిక సంస్థలు ఆశిస్తున్నాయి.

అమ్మకాలు పెరిగితే బ్యాంకుల ద్వారా లావాదేవీలు పెరుగుతాయి. రుణాలు తీసుకునే వారు ఎక్కువ అవుతారు. బ్యాంకింగేతర ఆర్ధిక కంపెనీలు ఈ పండగల సీజన్ మీదనే ఆశలు పెట్టుకున్నాయి. వాహనాల అమ్మకాలు తగ్గడం వల్ల వీటి నుంచి రుణం తీసుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. అందుకే ఈ పండగల సీజన్ మీద కంపెనీలు ఆధార పడ్డాయి.

గుడ్ న్యూస్: మ్యూచువల్ ఫండ్స్ లో జోరుగా ఉద్యోగాలు !గుడ్ న్యూస్: మ్యూచువల్ ఫండ్స్ లో జోరుగా ఉద్యోగాలు !

క్రెడిట్ కార్డులు పెరిగాయ్.. డెబిట్ కార్డులు తగ్గాయ్ ..

క్రెడిట్ కార్డులు పెరిగాయ్.. డెబిట్ కార్డులు తగ్గాయ్ ..

* రిజర్వ్ బ్యాంకు వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది జులై నాటికీ దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డుల సంఖ్య 5.02 కోట్లుగా ఉంది. గత ఏడాది ఇదే నెలలో కార్డుల సంఖ్య 4.01 కోట్లుగా ఉంది.

* ఇదేకాలంలో డెబిట్ కార్డుల సంఖ్య 96.2 కోట్ల నుంచి 84.06 కోట్లకు తగ్గింది.

* పండగల సీజన్ ను దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు కొంతకాలంగా సరికొత్త ఫీచర్ల తో కూడిన క్రెడిట్ కార్డులను జారీ చేస్తున్నాయి.

* డెబిట్ కార్డులపై కూడా ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. ఖర్చు చేస్తున్న కొన్ని విభాగాలను దృష్టిలో ఉంచుకొని సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నారు.

ఇవీ కొత్త కార్డులు

ఇవీ కొత్త కార్డులు

* ఇటీవలే ఫెడరల్ బ్యాంక్ తన డెబిట్ కార్డు కస్టమర్ల కోసం నెలవారీ వాయిదాల్లో చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు పైన్ లాబ్స్ తో టై అప్ కుదుర్చుకుంది.

* హెచ్ డీ ఎఫ్ ఎఫ్ సి బ్యాంకు .. ఇండియన్ ఆయిల్ తో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది. ఈ కార్డును వినియోగించుకొని పెట్రోల్, డీజిల్ పోయించుకుంటే ఆకర్షణీయమైన రివార్డ్స్, ప్రయోజనాలను అందిస్తోంది.

* స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ' డిజి స్మార్ట్ ' క్రెడిట్ కార్డును విడుదల చేసింది.

* ఫ్రీ ఛార్జ్... యాక్సిస్ బ్యాంక్ తో కలిసి డిజిటల్ క్రెడిట్ కార్డును విడుదల చేసింది.

* హెచ్ డీ ఎఫ్ సి బ్యాంక్ మిల్లీనియల్స్ కోసం వివిధ రకాల కార్డులను విడుదల చేసింది.

లావాదేవీలు పెంచే ప్రయత్నం..

లావాదేవీలు పెంచే ప్రయత్నం..

* కొత్త కస్టమర్లకు ఆకర్షించడంతో పాటు లావాదేవీల సంఖ్యను పెంచుకోవడానికి బ్యాంకులు ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆఫర్లు తెస్తున్నాయి.

* ఈ పండగల సీజన్లో దృష్టిలో ఉంచుకొని ఈ- కామర్స్ కంపెనీలతో కలిసి తక్షణ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ లు ఇస్తున్నారు.

English summary

క్రెడిట్ కార్డులకు పండుగల కిక్కు: జోరుగా పెరుగుతున్నాయ్ | Credit card issuance by banks set to rise on strong festival demand

Despite concerns over economic slowdown, banks and NBFCs remain upbeat about consumer spending in the upcoming festival season with a number of new credit offerings lined up by them.
Story first published: Tuesday, October 1, 2019, 10:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X