For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓలా, ఉబెర్ మధ్య పోటీ... ఎందుకోసం? ఎవరికోసం?

|

ఓలా, ఉబర్ గురించి తెలియని వారుండరు. నగరాల్లో ప్రయాణం కోసం అప్పటికప్పుడు మొబైల్ యాప్ ద్వారా క్యాబ్ ను బుక్ చేసుకునే సదుపాయాన్ని ఈ సంస్థలు కల్పిస్తున్నాయి. వీటి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. లక్షలాది మంది వీటి ద్వారా పలు నగరాల్లో ప్రయాణాలు చేస్తున్నారు. ప్రయాణికులను ఆకట్టు కోవడానికి ఈ సంస్థలు డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తుంటాయి. అయితే ఈ సంస్థలు ప్రయాణికుల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందులో భాగంగా బీమా రక్షణను కల్పిస్తున్నాయి. ఆవివరాలు మీ కోసం...

<strong>ఉచితంగా ప్రయాణీకులకు ఉబెర్ బంపరాఫర్: ఫ్రీ ఇన్సురెన్స్</strong>ఉచితంగా ప్రయాణీకులకు ఉబెర్ బంపరాఫర్: ఫ్రీ ఇన్సురెన్స్

ఉబర్...

ఉబర్...

* తన యాప్ ద్వారా వాహనాన్ని బుక్ చేసుకొని ప్రయాణించే వారికి ఉచితంగానే బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు ఉబర్ ప్రకటించింది.

* ప్రయాణంలో ప్రమాదం వల్ల మరణం సంభవించినా లేదా అంగవైకల్యం పాలయినా రూ.5 లక్షల వరకు బీమా కవరేజ్ ను అందిస్తుంది. హాస్పిటల్లో చేరితే రూ.2 లక్షల వరకు కవరేజీ అందిస్తుంది. ఇందులో ఓపీడీ ప్రయోజనం రూ. 50,000 వరకు ఉంటుంది.

* రైడర్ ఒకవేళ ఆక్సిడెంట్ జరిగిందని ఉబర్ కు తెలియజేయాలంటే ఉబర్ యాప్ లోని పాస్ట్ ట్రిప్స్ సెక్షన్ లోకి వెళ్లి 'ఐ వస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆన్ ఆక్సిడెంట్ ఆప్షన్' ఎంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఉబర్ సపోర్ట్ టీం రైడర్ ను చేరి క్లెయిమ్ ప్రాసెస్ పూర్తయ్యే విధంగా బీమా సంస్థతో కో ఆర్డినెట్ చేస్తారు.

ఓలా

ఓలా

* ఓలా విషయానికి వస్తే.. డైలీ రైడ్స్ పై ఒక రూపాయికి, ఓలా రెంటల్స్ పై రూ.10, ఓలా ఔట్ స్టేషన్ బుకింగ్ పై రూ.15తో బీమా రక్షణను కల్పిస్తోంది.

* ఓలా అందిస్తున్న ప్రయోజనంలో భాగంగా..ప్రయాణంలో పర్సనల్ యాక్సిడెంట్ జరిగితే రూ.5 లక్షల వరకు, గాయాలపాలై ఆస్పత్రిలో చేరితే రూ.లక్ష వరకు, దేశీయ ప్రయాణం సమయంలో విమానం మిస్సయితే రూ.5,000 వరకు కవరేజీ లభించనుంది.

* డ్రైవర్ రైడ్ ను రద్దు చేయడం లేదా అనియంత్రిత జాప్యాలు, మెడికల్ వ్యయాలు, బ్యాగేజ్ నష్టం వంటివి బీమా కవరేజీ కింద లభిస్తాయి.

* క్లెయిమ్ పొందే ప్రక్రియ కూడా సులభతరం చేసినట్టు ఓలా చెబుతోంది.

* ఓలా యాప్ ద్వారా నేరుగా క్లెయిమ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.

ఆరోగ్య బీమా..

ఆరోగ్య బీమా..

* రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్సు భాగస్వామ్యంతో తన ఫైనాన్సియల్ సంస్థ ఓలా మనీ ద్వారా హెల్త్ ఇన్సూరెన్సు ను ఓలా అందుబాటులోకి తెచ్చింది.

* ఓలా మనీ- రెలిగేర్ హోస్పి క్యాష్ ద్వారా పాలసీ ధరలు ఆస్పత్రిలో చేరినప్పుడు రోజుకు రూ.5,000 పొందే అవకాశం ఉంటుంది. ఈ పాలసీలో ఏడాదికి కనీస సమ్ అష్యురెన్సు మొత్తం రూ. 5 లక్షలు ఉంటుంది.

* దీని ద్వారా నాణ్యమైన ఆరోగ్య సేవలు తగిన సమయంలో పొందడానికి అవకాశం ఉంటుందని ఓలా చెబుతోంది.

* ఈ పాలసీ రిజిస్టర్ అయిన మొత్తం మంది ఓలా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఓలా యాప్ ద్వారా ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ఈ పాలసీ తీసుకున్న వారికి ప్రమాదంవల్ల ఆస్పత్రిలో చేరినా, చికిత్స, తీవ్ర అనారోగ్యాలకు బీమా కవరేజీ లభించనుంది.

* ఓలా యాప్ ద్వారా ఎంత బీమా ప్రీమియం చెల్లించాలి, కవరేజీ వంటి వివరాలు పొందవచ్చు.

English summary

ఓలా, ఉబెర్ మధ్య పోటీ... ఎందుకోసం? ఎవరికోసం? | Uber vs Ola insurance coverage

Do you know that app-based cab booking platform Ola and Uber offer insurance coverage during the travel. On Wednesday US-based Uber announced that it will offer free insurance to its riders.
Story first published: Monday, September 30, 2019, 11:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X