For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో 1.40 లక్షల ఉద్యోగాలు, కానీ తాత్కాలికం

|

దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు భారీ ధమాకా సేల్స్‌కు సిద్ధమయ్యాయి. ఈ నెల 29వ తేదీ నుంచి స్మార్ట్ ఫోన్ నుంచి టీవీ, హోమ్ అప్లియెన్సెస్ వరకు 70 శాతం వరకు ఆఫర్లు ఉన్నాయి. ఈ పండుగ సీజన్లో భారీ అమ్మకాలు ఉంటాయని ఈ దిగ్గజాలు భావిస్తున్నాయి. ఇటీవల వరకు దాదాపు అన్ని సేల్స్ పడిపోయాయి. అయితే కేంద్ర ఉద్దీపన చర్యలకు తోడు, పండుగ సేల్స్ సమయంలో భారీ ఆఫర్లు ఉంటాయి. కాబట్టి సేల్స్ ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అయితే ఇవి తాత్కాలికమే.

ఉల్లి ధర పెరగడానికి అసలు కారణం ఇదీ! అక్కడ కిలో రూ.22 మాత్రమఉల్లి ధర పెరగడానికి అసలు కారణం ఇదీ! అక్కడ కిలో రూ.22 మాత్రమ

అమెజాన్‌లో 90,000 ఉద్యోగాలు

అమెజాన్‌లో 90,000 ఉద్యోగాలు

దసరా, దీపావళి పండుగ సీజన్ కావడంతో భారీ అమ్మకాల నేపథ్యంలో 90,000 మందిని తాత్కాలికంగా నియమించుకుంటున్నట్లు అమెజాన్ తెలిపింది. క్రమబద్ధీకరణ కేంద్రాలు, డెలివరీ స్టేషన్స్, కస్టమర్ సేవా వంటి విభాగాల్లో వీరిని నియమించుకుంటున్నామని తెలిపింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాదే, పుణేలలో తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్‌లో 50,000 ఉద్యోగాలు

ఫ్లిప్‌కార్ట్‌లో 50,000 ఉద్యోగాలు

ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ పండుగ సీజన్‌లో టెంపరరీగా 50,000 మంది ఉద్యోగాలను నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. సప్లై చైన్, కస్టమర్ సపోర్ట్, లాజిస్టిక్స్ వంటి విభాగాల్లో ఉద్యోగుల అవసరం ఉందని తెలిపింది. అయితే ఇవి తాత్కాలిక ఉద్యోగాలు. దసరా, దీపావళి పండుగ సీజన్లో సేల్స్ పెద్ద ఎత్తున ఉంటాయి. ఆఫర్లు కూడా ఇస్తుంటాయి.

గత ఏడాది కంటే డబుల్ ఉద్యోగాలు

గత ఏడాది కంటే డబుల్ ఉద్యోగాలు

గత ఏడాది కంటే ఈ ఏడాది రెండింతల మంది ఉద్యోగులను తీసుకున్నామని అమెజాన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ ఫుల్‌ఫిల్‌మెంట్) అఖిల్ సక్సేనా అన్నారు. సీజనల్‌గా ఉద్యోగులను తీసుకోవడం ద్వారా తమ కస్టమర్లకు దేశవ్యాప్తంగా వెంటనే ఆర్డర్స్ అందించడం చేయవచ్చునని చెప్పారు. ఈ అమెరికాకు చెందిన అమెజాన్‌కు భారత్‌లో 11 నగరాల్లో కస్టమరల్ సర్వీస్ సైట్స్ ఉన్నాయి. ఈ-మెయిల్, చాట్, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా కన్నడ, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ప్రీ, పోస్ట్ ఆర్డర్స్ చేయవచ్చు.

డెలివరీ సర్వీస్ పార్ట్‌నర్స్ డబుల్

డెలివరీ సర్వీస్ పార్ట్‌నర్స్ డబుల్

ఈ సంవత్సరం ఏడాది పండుగ సీజన్ నేపథ్యంలో వేర్ హౌస్‌లలో 26 మిలియన్ క్యూబిక్ ఫీట్ అదనపు కెపాసిటీని పెంచారు. 750 సిటీలలో 1400 డెలివరీ స్టేషన్లలో డెలివరీ సర్వీస్ పార్ట్‌నర్స్‌ను రెండింతలు చేశారు. తీసుకున్న ఉద్యోగులను సప్లై చైన్‌తో పాటు సంబంధిత విభాగాల్లో శిక్షణ ఇచ్చినట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. బిగ్ బిలియన్ డేస్ ద్వారా ప్రయోజనం చేకూర్చడమే తమ ఉద్దేశ్యమని, ఉద్యోగాల సృష్టి, వ్యాపారులకు సేల్స్ పెంచడం, స్థానిక పరిశ్రమలకు కొత్త ఉత్సాహం ఇవ్వడం తమ లక్ష్యమని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

English summary

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో 1.40 లక్షల ఉద్యోగాలు, కానీ తాత్కాలికం | Amazon, Flipkart create 1.4 lakh temporary jobs ahead of festive sales

E-commerce giants Amazon and Flipkart have created over 1.4 lakh temporary jobs across supply chain, last-mile connectivity and customer support in preparation for their festive sales that kicks off later this month.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X