For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెట్ మ్యూచువల్ ఫండ్ నిబంధనలు మరింత కఠినం: ఎందుకంటే?

|

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ.. మ్యూచువల్ ఫండ్స్ కు సంబంధించిన నిబంధనలు మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగా లిక్విడ్ స్కీమ్స్ కు సంబంధించి కనీసం 20 శాతం లిక్విడ్ ఆస్తుల్లో నిధులు ఉంచడం తప్పని సరి చేసింది. ఈ క్యాష్, ప్రభుత్వ సెక్యూరిటీల కోసం కేటాయించాల్సి ఉంటుంది. ఇటీవలి రుణ సంక్షోభం నేపథ్యంలో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధన వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. రిస్క్ మేనేజ్ మెంట్, సరిపోయేంతగా లిక్విడిటీ ఉంచే నిమిత్తం సెబీ ఈ చర్య తీసుకుంది.

* సెబీ తాజా ఆదేశాల ప్రకారం షెడ్యూల్డ్ కమెర్షియల్ బ్యాంకుల షార్ట్ టర్మ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల నుంచి ఇన్వెస్ట్ మెంట్, అడ్వైజరీ ఫీజులను అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏ ఎంసీ ) ఛార్జ్ చేయరాదు. నెల రోజుల తర్వాతి నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.

మ్యూచువల్ ఫండ్స్ సిప్ స్టేట్మెంట్ ఎందుకు చూడాలి?మ్యూచువల్ ఫండ్స్ సిప్ స్టేట్మెంట్ ఎందుకు చూడాలి?

* లిక్విడ్ ఫండ్స్.. లిక్విడ్ ఆస్తులైన నగదు, నగదుకు సమానమైన ట్రెజరీ బిల్స్, ప్రభుత్వ సెక్యూరిటీలపై రేపో వంటి వాటిలో 20 శాతం హోల్డింగ్ కలిగి ఉండాలి.
* ఒకవేళ లిక్విడ్ ఆస్తుల్లో నిధులు 20 శాతం కన్నా తగ్గితే తదుపరి పెట్టుబడులు పెట్టే ముందు ఏ ఎం సి లు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
*షార్ట్ టర్మ్ డిపాజిట్లు, డెట్, మనీ మార్కెట్ సాధనాల్లో లిక్విడ్, ఓవర్ నైట్ స్కీమ్స్ పెట్టుబడులను సెబీ నిషేధించింది.
* అయితే ప్రభుత్వ గ్యారంటీ ఉన్న డెట్ సెక్యూరిటీలకు మాత్రం ఇలాంటి ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.
* ఈ నిబంధన అన్ని కొత్త పెట్టుబడులకు తక్షణమే అమల్లోకి వస్తుంది.

Sebi tightens rules for debt mutual fund

ఎగ్జిట్ లోడ్

* ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి తర్వాత ఏడూ రోజుల్లోనే లిక్విడ్ ఫండ్స్ నుంచి వైదొలగితే మ్యూచువల్ ఫండ్ ఎగ్జిట్ లోడ్ ను విధించవచ్చని సెబీ పేర్కొంది.
* ఈ నిబంధన సెబీ సర్క్యులర్ వెలువడిన 30వ రోజు నుంచి అన్ని కొత్త పెట్టుబడులకు వర్తిస్తుంది.
* లిక్విడ్, ఓవర్ నైట్ ఫండ్స్ కొనుగోలుకు సంభందించి నికర అసెట్ విలువ అమలు కట్ ఆఫ్ టైమింగ్స్ మధ్యాహ్నం 2 గంటలకు బదులుగా 1.30 గంటలు ఉంటుంది.

ఎన్ బీ ఎఫ్ సి రంగంలో సంక్షోభం...

* గత ఏడాదిలో ఎన్ బీ ఎఫ్ సి రంగంలో నగదు సంక్షోభం ప్రారంభమైంది. ఐ ఎల్ అండ్ ఎఫ్ ఎస్ గ్రూప్ సంస్థల చెల్లింపుల డిఫాల్ట్ తో ఇది మొదలైంది. ఆ తర్వాత డీ హెచ్ ఎఫ్ ఎల్ , జీ గ్రూప్ ఇతర సంస్థలు కూడా రుణాల విషయంలో డీఫాల్ట్ అయ్యాయి.
* ఈ కంపెనీలు తమ రుణదాతలతో తగిన ఒప్పందాలను చేసుకున్నాయి. కాగా కొన్ని కంపెనీల్లో ఇబ్బందికర పరిస్థి తి ఉండటం వల్ల మొత్తం ఎన్ బీ ఎఫ్ సి రంగం కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

English summary

డెట్ మ్యూచువల్ ఫండ్ నిబంధనలు మరింత కఠినం: ఎందుకంటే? | Sebi tightens rules for debt mutual fund

Tightening the norms for mutual funds, markets regulator Sebi on Friday made it mandatory for liquid schemes to hold at least 20% in liquid assets like cash and government securities in the wake of recent credit crisis.
Story first published: Sunday, September 22, 2019, 17:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X