For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4వ రోజు తగ్గిన బంగారం ధర, రూ.2,200 తగ్గుదల

|

బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం, బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి తగ్గించుకోవడం దీనికి కారణం. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 0.04 శాతం తగ్గి రూ.37,670గా ఉంది. గత నెలలో రూ.39,885కు పెరిగి రికార్డ్ స్థాయికి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.2,200 తగ్గింది. ఎంసీఎక్స్‌లో వెండి ధర రూ.0.04 శాతం తగ్గి రూ.46,626కు పడిపోయింది. వెండి గత నెలలో రికార్డ్ హై రూ.51,489 కు చేరుకున్న తర్వాత ఇప్పటి వరకు రూ.4900 పడిపోయింది.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే న్యూయార్క్‌లో ఔన్స్ బంగారం ధర 1,503గా ఉంది. వెండి ధర ఔన్సుకు 17.87 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గినప్పటికీ ఈ తగ్గుదల ఇలాగే ఉండకపోవచ్చుననే అనుమానాలు ఉన్నాయి. పసిడి ధరలు పెరగడానికి అంతర్జాతీయంగా నెలకొన్న అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం భయాలు ప్రధాన కారణం. ఇప్పుడు అవి సమసిపోవడానికి తోడు ఫెడ్ రేట్ కట్ వంటి కారణాల వల్ల బంగారం ధరలు తగ్గుతున్నాయి.

ఇప్పుడు తగ్గినా...

ఇప్పుడు తగ్గినా...

బంగారం ర్యాలీకి కాస్త బ్రేక్ పడినప్పటికీ భవిష్యత్తలో మాత్రం పసిడి ధర పెరుగుతుందని భావిస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుతో పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ల వైపు కదులుతున్నప్పటికీ అది దీర్ఘకాలికంగా మాత్రం కాదని అంటున్నారు. మరోసారి కుదుపులు వస్తే ఇన్వెస్టర్లు బంగారం వైపు చూస్తారని అంటున్నారు.

ఆయా నగరాల్లో బంగారం ధరలు....

ఆయా నగరాల్లో బంగారం ధరలు....

చెన్నై 22 క్యారెట్ల బంగారం ₹ 35,830, 24 క్యారెట్ల బంగారం ₹ 39,020, ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ₹ 36,500, 24 క్యారెట్ల బంగారం ₹ 37,500, న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ₹ 36,600, 24 క్యారెట్ల బంగారం ₹ 37,710, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ₹ 36,800, 24 క్యారెట్ల బంగారం ₹ 38,050, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ₹ 35,150 24 క్యారెట్ల బంగారం ₹ 38,340గా ఉంది.

హైదరాబాద్, విజయవాడల్లో బంగారం...

హైదరాబాద్, విజయవాడల్లో బంగారం...

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ₹ 35,830, 24 క్యారెట్ల బంగారం ₹ 39,020, కేరళ 22 క్యారెట్ల బంగారం ₹ 34,800, 24 క్యారెట్ల బంగారం ₹ 37,860, పూణేలో 22 క్యారెట్ల బంగారం ₹ 36,500, 24 క్యారెట్ల బంగారం ₹ 37,500, విజ‌య‌వాడ‌లో 22 క్యారెట్ల బంగారం ₹ 35,830, 24 క్యారెట్ల బంగారం ₹ 39,020, విశాఖలో 22 క్యారెట్ల బంగారం ₹ 35,830, 24 క్యారెట్ల బంగారం ₹ 39,020గా ఉంది.

English summary

4వ రోజు తగ్గిన బంగారం ధర, రూ.2,200 తగ్గుదల | Gold prices fall for fourth day, down Rs.2,200

Gold prices remained under pressure for the fourth day in Indian markets today. On MCX, October gold futures were down 0.04% to ₹37,670 per 10 grams.
Story first published: Friday, September 20, 2019, 17:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X