For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెలకు రూ.1,500 జీతం, ఇప్పుడు KBCలో రూ.1 కోటి గెలిచిన వంటమనిషి!

|

భారత్ మోస్ట్ పాపులర్ షో 'కౌన్ బనేగా కరోడ్ పతి' (KBC 11) ఈ సీజన్‌లో రెండో వ్యక్తి రూ.1 కోటి గెలుచుకున్నారు! గతవారం బీహార్‌కు చెందిన యూపీఎస్సీ ఆస్పిరెంట్ సనోజ్ రాజ్ కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి వ్యక్తి. ఆ తర్వాత ఇప్పుడు మహారాష్ట్రలోని అమ్రావతికి చెందిన ఓ సాధారణ మహిళ కోటి రూపాయలు గెలుచుకున్న రెండో వ్యక్తి అయ్యారు.

వరుసగా 4 రోజులు బ్యాంకులు పని చేయవు: మీరేం చేయాలి!?వరుసగా 4 రోజులు బ్యాంకులు పని చేయవు: మీరేం చేయాలి!?

రూ.1 కోటి గెలుచుకున్న రెండో వ్యక్తి బబితా తాడే

రూ.1 కోటి గెలుచుకున్న రెండో వ్యక్తి బబితా తాడే

ఈ మేరకు సోనీ ఎంటర్టైన్మెంట్ ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ హోస్ట్‌గా అమితాబ్ బచ్చన్ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 11వ సీజన్ సాగుతోంది. ఈ సీజన్‌లో రూ.కోటి గెలుచుకున్న రెండో వ్యక్తిగా బబితా తాడే నిలిచారు.

కుక్‌గా రూ.1500 వేతనం

కుక్‌గా రూ.1500 వేతనం

విడుదలైన ప్రోమో ప్రకారం.. బబితా తాడే మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో కుక్ (వంట మనిషి)గా పని చేస్తున్నారు. ఈమె పాఠశాలలో 450 మంది విద్యార్థులకు భోజనం వండి పెడుతుంటారు. ఆమెకు నెలకు కేవలం రూ.1500 వేతనం వస్తోంది. అయితే కుకింగ్ అంటే ఇష్టపడే ఆమె, తన పని పట్ల గర్వపడుతున్నారు. ఈమె కిచిడీ స్పెషలిస్ట్. విద్యార్థులతో సహా ఎవరైనా ఆమె కిచిడీని చాలా ఇష్టంగా తింటారు.

కోటి రూపాయల ప్రశ్న ఎదురైనప్పుడు ఉత్కంఠ

కోటి రూపాయల ప్రశ్న ఎదురైనప్పుడు ఉత్కంఠ

ఇలాంటి బబితా తాడేకు లక్ష్మీ తలుపు తట్టింది. కౌన్ బనేగా కరోడ్ పతికి ఎంపికయ్యారు. మెగా క్విజ్‌లో పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆమె తొందరపాటు లేకుండా ప్రశాంతంగా సమాధానమిచ్చారు. ఒక్కో రౌండ్ దాటి, చివరకు రూ.కోటి గెలుచుకున్నారు. ఆమెకు కోటి రూపాయల ప్రశ్న ఎదురైనప్పుడు అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశారు.

నిన్న రూ.1500 వేతనం.. నేడు రూ.1 కోటి ప్రశ్న..

నిన్న రూ.1500 వేతనం.. నేడు రూ.1 కోటి ప్రశ్న..

రూ.1 కోటి ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పాక... అమితాబ్ బచ్చన్.. సమాధానం సరైనది అని చెప్పి, రూ.కోటి గెలుచుకున్నట్లుగా ప్రకటించారు. రూ.1500 వేతనంకు పని చేసిన ఆమె ఇప్పుడు కోటీశ్వరురాలిగా మారారు.

పని పెద్దదా, చిన్నదా అని ఉండదని, మనం చేసే పనిలో సంతృప్తి పడాలని, తనకు ఫోన్ కూడా లేదని, త్వరలో మంచి ఫోన్ కొనుక్కుంటానని ఆమె చెప్పారు.

2002 నుంచి కుక్‌గా...

2002 నుంచి కుక్‌గా...

కౌన్ బనేగా కరోడ్ పతిలో భాగంగా అమితాబ్ బచ్చన్ ఆమె గురించిన వివరాలను అడిగారు. 450 మందికి వండి పెట్టేందుకు ఎంత సమయం పడుతుందని ప్రశ్నించగా దాదాపు మూడు నాలుగు గంటలు పడుతుందని చెప్పారు. 2002 నుంచి తాను ఈ పని చేస్తున్నానని చెప్పారు. పిల్లలు తనను కాకూ (ఆంటీ) అని పిలుస్తారని చెప్పారు.

English summary

నెలకు రూ.1,500 జీతం, ఇప్పుడు KBCలో రూ.1 కోటి గెలిచిన వంటమనిషి! | Cook In Maharashtra Government School Is KBC 11's Second Crorepati

India's most popular quiz show Kaun Banega Crorepati has found its second crorepati of the season in a cook from Amravati, Maharashtra.
Story first published: Wednesday, September 18, 2019, 15:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X