For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

6 కోట్ల మంది పీఎఫ్ మెంబర్స్‌కు గుడ్ న్యూస్

|

దేశవ్యాప్తంగా ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ఓ సభ్యులు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను 8.65 శాతం వడ్డీని పొందనున్నారని కార్మిక శాఖమంత్రి సంతోష్ గాంగ్వార్ మంగళవారం చెప్పారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సబ్‌స్కైబర్లకు 8.65 వడ్డీ రేటు ఇచ్చేందుకు గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరిలోనే నిర్ణయం తీసుకుంది.

భారత ఆర్థిక వ్యవస్థకు 'సౌదీ' షాక్, రూ.6 పెరగనున్న పెట్రోల్భారత ఆర్థిక వ్యవస్థకు 'సౌదీ' షాక్, రూ.6 పెరగనున్న పెట్రోల్

దీని ఆమోదం కోసం ఆర్థికమంత్రిత్వ శాఖకు పంపించారు. ఈ నేపథ్యంలో కార్మిక మంత్రి వ్యాఖ్యలు గమనార్హం. పండుగ సీజన్ నేపథ్యంలో 6 కోట్ల మందికి పైగా ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్లకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం వడ్డీని ఇస్తున్నామని తెలిపారు.

Over 6 crore EPFO members to get 8.65 percent interest for 2018-19: Labour minister Gangwar

ప్రస్తుతం ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.55 శాతంగా ఉంది. 2017-18లో ఆమోదించిన వడ్డీ రేటు ఉంది. ఇప్పుడు 0.10 శాతం పెంచుతున్నారు. దీని కోసం ఎంతోమంది వేచి చూస్తున్నారు.

కార్మిక, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య వడ్డీ రేటుపై ఉన్న భిన్నాభిప్రాయాలను తొలగించుకునేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో జరిపిన చర్చల్లో 8.65 శాతం వడ్డీ రేటు చెల్లించినా సంస్థ వద్ద సరిపడా మిగులు ఉందని వివరించిన అనంతరం పెంపుదలకు మార్గం సుగమమైనట్లు చెబుతున్నారు.

English summary

6 కోట్ల మంది పీఎఫ్ మెంబర్స్‌కు గుడ్ న్యూస్ | Over 6 crore EPFO members to get 8.65 percent interest for 2018-19: Labour minister Gangwar

Labour Minister Santosh Gangwar on Tuesday said over 6 crore EPFO members will get 8.65 per cent interest on their deposits for 2018-19. The Central Board of Trustees — the apex decision-making body of the Employees’ Provident Fund Organisation (EPFO) — had approved 8.65 per cent interest rate for the last fiscal in February this year.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X