For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉమ్మడిగా గృహ రుణం.. తెలుసా ప్రయోజనం?

|

సొంతింటి కల సాకారం చేసుకోవాలని ప్రతి దంపతులకు ఉంటుంది. అందుకోసమే నిరంతరం శ్రమిస్తుంటారు. నేటి కాలంలో ఉద్యోగం చేస్తున్నయువ జంటలు అనేకం. వారు సంపాదిస్తున్న దాంట్లో ఖర్చులు తగ్గించుకుంటూ తమ కలల గృహం కోసం దాచుకుంటున్నారు చాలా మంది. అయితే ఇల్లు కొనాలంటే ఈ1 రోజులలో బ్యాంకు నుంచి రుణం తీసుకోవడం తప్పనిసరి. స్థలాలు, ఇంటికి అవసరమైన సామాగ్రి ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎక్కువ రుణం అవసరం ఉంటుంది. అయితే ఒక్కరి పేరుమీద రుణం కోసం దరఖాస్తు చేస్తే తక్కువ రుణం మంజూరు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భార్య/భర్త తో కలిసి ఉమ్మడిగా రుణం తీసుకుంటే ఎక్కువ మొత్తం మంజూరు కావడానికి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ప్రయోజనాలు, కూడా ఉన్నాయి. వీటిని బట్టి ఉమ్మడిగా గృహ రుణం తీసుకోవాలా వద్దా అన్న దానిపై ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకుందామా...

గుడ్ న్యూస్: ఆధార్ కార్డులో ఈ మార్పులకు ప్రూఫ్స్ అవసరంలేదుగుడ్ న్యూస్: ఆధార్ కార్డులో ఈ మార్పులకు ప్రూఫ్స్ అవసరంలేదు

పెద్ద మొత్తంలో రుణం

పెద్ద మొత్తంలో రుణం

* గృహ రుణం కోసం ఒకరు దరఖాస్తు చేసుకున్న దానికి ఇద్దరు కలిసి దరఖాస్తు చేసుకున్న దానికి మధ్య తేడా ఉంటుంది.

* వ్యక్తిగతంగా రూ.20 లక్షల రుణం ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తే ఉమ్మడిగా మరో రూ. 20-25 లక్షల రుణం ఇవ్వడానికి బ్యాంకులు అంగీకరించవచ్చు.

* ఇద్దరు ఉద్యోగం చేస్తుంటే మరింత ఎక్కువ రుణం పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇరుకైన ఇల్లు కాకుండా పెద్ద ఇంటిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది.

* ఇద్దరు సంపాదిస్తూ ఉంటే నెలవారీ ఈఎంఐలను చాలా సులభంగా చెల్లించవచ్చు.

రాయితీలు ఉంటాయ్

రాయితీలు ఉంటాయ్

* మగవారితో పోల్చితే మహిళలకు బ్యాంకులు రుణాలపై కొంత రాయితీని ఇస్తుంటాయి. ముఖ్యంగా తక్కువ వడ్డీ రేటును అఫర్ చేస్తాయి. కాబట్టి భార్యతో కలిసి రుణం తీసుకోవడం వల్ల తక్కువ వడ్డీ రేటు పడుతుంది.

* మహిళల పేరుమీద ఇంటిని రిజిస్టర్ చేసుకునే సమయంలో చెల్లించే స్టాంప్ డ్యూటీ కూడా తక్కువ ఉంటుంది. దీనివల్ల ప్రయోజనమే కదా.

పన్ను ప్రధానం

పన్ను ప్రధానం

* రుణంతో గృహాన్ని కొనుగోలు చేసిన వారికీ కొన్ని పన్ను మినహాయింపులు కూడా లభిస్తుంటాయి.

* ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్నప్పుడు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద ఒక్కొక్కరు రూ. 1.5 లక్షల పన్ను ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరికే కలిపితే ఇది రూ. మూడు లక్షలు అవుతుంది.

సమస్యలు...

సమస్యలు...

* భార్య భర్త కలిసి గృహ రుణం తీసుకోవడం వల్ల ప్రయోజనాలు ఉన్నట్టే కొన్ని సమస్యలు ఉన్నాయి. అవేమిటంటే...

* ఉమ్మడిగా గృహ రుణం తీసుకున్న కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకున్నా లేదా ఎవరో ఒకరు చనిపోయినా రుణ భారం తడిసిమోపెడవుతుంది. తీసుకున్న రుణంపై నెలవారీ వాయిదాలను చెల్లించని సందర్భంలో అప్పిచ్చిన రుణదాత ఇంటిని తమ స్వాధీనంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.

* గృహ రుణం తీసుకునే సమయంలో భార్య కో అప్లికెంట్ గా ఉంటేఇంటిలో ఆమె కొంత వాటాను మాత్రమే పొందే అవకాశం ఉండవచ్చు. కో ఓనర్ గా ఉంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. భర్త చనిపోయిన సందర్భంలో ఈ సమస్య తలెత్తుతుంది.

* రుణం పొందిన తర్వాత ఎవరో ఒకరు ఈఎంఐ చెల్లించనంటూ మొండికేస్తే మరొకరి మీద భారం పడవచ్చు. ఒకవేళ ఈఎంఐ సక్రమంగా చెల్లించకపోతే అది ఇద్దరి క్రెడిట్ స్కోర్ ను దెబ్బ తీస్తుంది. దీని వల్ల భవిష్యత్తులో రుణాలు పొందడం ఇబ్బందికరంగా మారుతుంది.

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని సరైన నిర్ణయం తీసుకోండి.

English summary

ఉమ్మడిగా గృహ రుణం.. తెలుసా ప్రయోజనం? | Common home loans: Know this

A home loan (or mortgage) is a contract between a borrower and a lender that allows someone to borrow money to buy a house, apartment, condo, or other livable property. A home loan is typically paid back over a term of 10, 15 or 30 years.
Story first published: Tuesday, September 17, 2019, 11:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X