For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలా కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు

|

గత కొన్నేళ్ల కాలంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఇన్వెస్టర్ల సంపదను పెంచడంలో కీలక పాత్ర వహిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లకు అవగాహనా పెరుగుతున్నందువల్ల వీటిలో పెట్టుబడికి ఉన్న సులభతర మార్గాలు మరిన్ని అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే వీటి ద్వారా పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య పెరుగుతోంది. కొన్ని అంకుర కంపెనీలు ఇన్వెస్టర్లు నేరుగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. దీని వల్ల పెట్టుబడి చాలా సులభంగా మారుతోంది. వీటివల్ల ఇన్వెస్టర్లకు కూడా కూడా శ్రమ తగ్గుతోంది. వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థల వెబ్ సైట్లకు వెళ్లి తమకు నచ్చిన ప్లాన్ల కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వారి సమయం కూడా ఆదా అవుతుంది.

SIP రిటర్న్స్: రూ.300 ఇన్వెస్ట్‌తో కోటీశ్వరులు కావొచ్చు!SIP రిటర్న్స్: రూ.300 ఇన్వెస్ట్‌తో కోటీశ్వరులు కావొచ్చు!

మ్యూచువల్ ఫండ్ అగ్రిగేటర్లు

మ్యూచువల్ ఫండ్ అగ్రిగేటర్లు

* పేటీఎం మనీ, గ్రో, కువేరా వంటి మ్యూచువల్ ఫండ్ అగ్రిగేటర్లు ఇన్వెస్టర్లు సులభమైన పద్దతిలో నేరుగా పెట్టుబడి పెట్టే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

* ఈ సంస్థలు మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లో పెట్టుబడులపై కమీషన్లు వసూలు చేయడం లేదు.

* పెట్టుబడులు పెరిగే విధంగా ఈ సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి.

సులభమే...

సులభమే...

* ఇలాంటి అగ్రిగేటర్ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టడం సులభమే.

* పెట్టుబడులు పెట్టాలనుకునే వారు తమ ఇమెయిల్ అడ్రెస్స్, పాన్ నెంబర్ ద్వారా ఖాతాను ప్రారంభించవచ్చు. దీనికి బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయాలి. ఈ ఖాతా ద్వారా పెట్టుబడులకు అవసరమైన సొమ్మును కేటాయించుకోవచ్చు.

* ఈ ప్లాట్ ఫార్మ్స్ పై బాలెన్సుడ్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, టాక్స్ సేవింగ్స్ ఫండ్స్ కూడా అందుబాటులో ఉంటున్నాయి.

* మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయించినప్పుడు అవసరమైన టాక్స్ ప్లానింగ్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంటున్నందువల్ల ఇన్వెస్టర్లకు మరింత ప్రయోజనం కలుగుతోంది.

* క్రమానుగత పెట్టుబడులకు అవసరమైన ప్రక్రియను కూడా సులభతరం చేశారు. అవసరమైనప్పుడు సిప్ ను నిలిపివేయడానికి లేదా సిప్ పెట్టుబడి మొత్తాన్ని టాప్ అప్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి.

ఆందోళన అవసరం లేదు...

ఆందోళన అవసరం లేదు...

ఆన్ లైన్ ద్వారా లేదా మొబైల్ యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టడానికి కొంతమంది అనుమాన పడుతుంటారు . ఇలాంటి వారు డిస్ట్రీ బ్యూటర్ల ద్వారా డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడులు పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తారు. దీనివల్ల వారు ఎక్కువ ఖర్చులను భరించాల్సి వస్తుంది.

అయితే మ్యూచువల్ ఫండ్స్ ను అందించే ప్లాట్ ఫామ్స్ కూడా క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా సెక్యూరిటీ కి సంభందించిన నియమ నిబంధనలు పాటించాలి. కాబట్టి ఇన్వెస్టర్లు నిర్భయంగా తమ పెట్టుబడులు పెట్ట వచ్చని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు.

English summary

అలా కూడా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు | Invest in Mutual Fund through paytm

Paytm Money introduces NFO subscription, to allow investments from all 40 AMCs. Bengaluru: Paytm Money, one of India's largest online platforms for mutual fund (MF) investments.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X