న్యూఢిల్లీ: వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ (PPA)లను సమీక్షించాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకంచింది. ఏపీలో చేసుకున్న పీపీఏల్లో ఎలాంటి అవకతవకలు జరిగినట్లుగా ఆధారాలు లేవని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ సోమవారం చెప్పారు. గత తెలుగుదేశం హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను రద్దు చేయాలని ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీని కోరినట్లు చెప్పారు.

జగన్‌కు సర్ది చెప్పాం
పీపీఏ ఒప్పందాలను సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ పునరుద్బాతక ఇంధన డెవలపర్లందరిపై ఎలాంటి ఆధారాలు లేనందున ఇలాంటి చర్యలు సరికాదని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. ఆరోపణల్లో సరైన ఆధారాలు లేకుండా పీపీఏలను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశముందని హెచ్చరించారు. ఇదే విషయం చెప్పి జగన్‌కు సర్ది చెప్పామన్నారు.

ఆధారాలు ఉంటే చర్యలు...
అవకతవకలపై ఆధారాలు ఉంటే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎంకు చెప్పామని కేంద్రమంత్రి అన్నారు. కానీ ఎలాంటి ఆధారాలు లేవని అభిప్రాయపడ్డారు. త్వరలో వివాదం పరిష్కారం అవుతుందని, అలాగే ప్రైవేటు కంపెనీలకు రూ.2వేల కోట్లు చెల్లిస్తారని నమ్మకం ఉందన్నారు.

అలా చేస్తే పెట్టుబడులు పెట్టేందుకు వెనక్కి తగ్గుతారు
జపాన్, ఫ్రాన్స్, యూరోప్, సౌతాఫ్రికా దేశాల నుంచి క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుంది. చాలామంది ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు నమ్మకంతో వచ్చారని, వారితో ఒప్పందాలను సమీక్షిస్తామని చెబుతుంటే అలాంటి ఇన్వెస్టర్లు వచ్చేందుకు భయపడతారని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు.

భారత్ వైపు ప్రపంచ ఇన్వెస్టర్లు..
భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో విదేశీ పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయని కేంద్రమంత్రి చెప్పారు. ప్రపంచ ఇన్వెస్టర్లు కూడా భారత్‌ను మంచి మార్కెట్‌గా చూశారని చెప్పారు. పీపీఏలను రద్దు చేసే నిర్ణయం తీసుకుంటే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని తాను జగన్ రెడ్డికి చెప్పానని తెలిపారు. పీపీఏలపై జగన్ ప్రభుత్వం ఆందోళనకు లేఖ ద్వారా ప్రత్యుత్తరం పంపిస్తామన్నారు.

సాక్ష్యాలుంటే రండి...
పీపీఏల విషయంలో మా స్టాండ్ చాలా క్లియర్‌గా ఉందని, చట్ట విరుద్దంగా ఏమైనా సాక్షాలు ఉంటే మా ముందుకు తీసుకు వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా అన్ని ఒప్పందాలను తిరిగి సమీక్షించలేరని ఏపీ ప్రభుత్వానికి చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications