For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సూపర్ న్యూస్: దుబాయ్‌లో ఇళ్ల ధరలు భారీగా తగ్గుతున్నాయి!!

|

లగ్జరీ షాపింగ్, అల్ట్రా మోడర్న్ ఆర్కిటెక్చర్, లైవ్లీ నైట్ లైఫ్ వంటి వాటికి యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నగరం ప్రసిద్ధి. 830 మీటర్ల ఎత్తైన బుర్జ్ ఖలీఫా, ఆకాశహర్మ్యాలతో నిండి ఉంటుంది. ఇలాంటి నగరంలో ఇంటిని కావాలని ఎవరికి ఉండదు? అయితే దుబాయిలో రియల్ ధరలు అందనంత ఎత్తులో ఉంటాయి. అయితే రానున్న కాలంలో ఇక్కడ హౌస్ ధరలు పడిపోతాయని ఓ పోల్ సర్వే వెల్లడించింది. గత దశాబ్దకాలంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ మందగమనాన్ని ఎదుర్కోంది. 2014 మధ్యకాలం నుంచి ప్రాపర్టీ ధరలు 25 శాతం నుంచి 35 శాతం మధ్య తగ్గిపోయాయి. 2022 వరకు ఇలాగే ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.

గుడ్‌న్యూస్: ఆధార్ అప్‌డేట్ కోసం ఆన్‌లైన్‌లో అపాయింటుమెంట్గుడ్‌న్యూస్: ఆధార్ అప్‌డేట్ కోసం ఆన్‌లైన్‌లో అపాయింటుమెంట్

దుబాయ్‌లో ఇళ్ల ధరల తగ్గుదల

దుబాయ్‌లో ఇళ్ల ధరల తగ్గుదల

ఓ ప్రాపర్టీ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ పోల్ ప్రకారం... దుబాయ్‌లో ఇళ్ల ధరలు ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం తగ్గుతాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనం, హౌసింగ్ యూనిట్స్ అధిక ధర సరఫర బలహీనమైన మార్కెట్‌కు మరింత ఇబ్బందికరం కానున్నాయి. దుబాయ్... వైవిధ్యభరిత వాణిజ్య, పర్యాటక ఆర్థిక వ్యవస్థ. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ ఏడు టెర్రిటరీస్‌లలో ఒకటి. ఈ దశాబ్దంలోనే ఇప్పుడు మార్కెట్లో తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంటోంది.

15 శాతం తగ్గుదల...

15 శాతం తగ్గుదల...

దుబాయ్ స్థూల జాతీయోత్పత్తికి ప్రాథమిక సహకారి అయిన దుబాయ్ హౌసింగ్ మార్కెట్ కార్యకలాపాల్లో ఈ డౌన్‌వార్డ్ కొనసాగే అవకాశం ఉంది. దుబాయ్‌లో ఈ ఏడాది 10 శాతం, వచ్చే ఏడాది 5 శాతం ధరలు తగ్గుతాయని రూటర్స్ పోల్ ఆఫ్ మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. 2021లో ఈ తగ్గుదల 3.3 శాతంగా ఉంటుందని చెప్పారు. గత ఏడాది దుబాయ్ ఎకానమీ కేవలం 1.94 శాతం మాత్రమే పెరిగింది. 2009 ఆర్థిక సంక్షోభం తర్వాత అత్యంత మందగమనం ఇదే. రియల్ మార్కెట్ దెబ్బ బాగానే పడింది.

కోలుకోవాలి కానీ...

కోలుకోవాలి కానీ...

పర్యాటకం, అంతర్జాతీయ వ్యాపార సేవలపై ప్రధానంగా దృష్టి సారించిన దుబాయ్ వృద్ధి 2020లో 3.8 శాతం, 2021లో 2.8 శాతంగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే దీనికి బాహ్య కారకాలు కూడా కారణమే. ఇటీవల ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మార్కెట్ కోసం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. సహజంగా దీని వల్ల కోలుకోవాలి.

అందుకే తగ్గుదల...

అందుకే తగ్గుదల...

కానీ హౌసింగ్ యూనిట్ల అధిక సరఫరా ధరలను, డిమాండును తగ్గించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సప్లై ఎక్కువగా ఉందని, గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి అంటున్నారు. 2014 మధ్య కాలం నుంచి 25 శాతం నుంచి 35 శాతం ధరలు పడిపోయాయని, 2022 వరకు ఇలాగే ఉండవచ్చునని చెబుతున్నారు.

English summary

సూపర్ న్యూస్: దుబాయ్‌లో ఇళ్ల ధరలు భారీగా తగ్గుతున్నాయి!! | Dubai house prices to fall sharply: Poll

Dubai house prices will decline sharply this year and next, according to property market experts in a Reuters poll, who said a slowdown in the economy and an oversupply of housing units are big downside risks to their already weak outlook.
Story first published: Saturday, September 7, 2019, 16:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X