For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎల్ఐసీలో ఈక్విటీ పోర్ట్‌పోలియోలో 80 శాతం షాక్, రక్షణ ఇవే...

|

ముంబై: భారత అతిపెద్ద సంస్థాగత పెట్టుబడిదారు లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఈక్విటీ పోర్ట్‌పోలియో దేశీయ స్టాక్స్‌లో భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ పోర్ట్‌పోలియోలోని 80 శాతం స్టాక్స్ నష్టాలబాట పట్టాయి.

ఝున్‌ఝున్‌వాలాకు షాక్, దెబ్బకు రూ.200 కోట్ల ఆస్తి మటాష్ఝున్‌ఝున్‌వాలాకు షాక్, దెబ్బకు రూ.200 కోట్ల ఆస్తి మటాష్

షిప్‌బిల్డింగ్, ఫుట్‌వేర్, ఫార్మా, ఐటీ, సిమెంట్, కెమికల్స్ వంటివి మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఈ పోర్ట్‌పోలియోలే టాప్ గెయినర్ పిఎస్‌యూ షిప్‌బిల్డింగ్ కంపెనీ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డింగ్ అండ్ ఇంజినీరింగ్. కొద్ది నెలల్లో వీటి షేర్లు 46 శాతం పెరిగాయి. జనవరిలో రూ.91.40 ఉండగా ఆగస్ట్ 30వ తేదీ నాటికి రూ.133.30కి పెరిగింది.

80% of LICs equity portfolio deep in the red: a high flying PSU & a few others play saviour

బీఎస్ఈ సెన్సెక్స్ ఏడాదిలో 0.85 శాతం పెరిగింది. అదే సమయంలో బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు వరుసగా 14 శాతం, 16 శాతం తగ్గాయి. గార్డెన్ రీచ్ ఇయర్ టు ఇయర్ నెట్ ప్రాఫిట్ జూన్ క్వార్టర్ నాటికి 25.30 కోట్లుగా నమోదు చేసింది. అయితే సేల్స్ మాత్రం 12 శాతం తగ్గి రూ.160 కోట్లుగా ఉన్నాయి. ఈ కంపెనీ ప్రధానంగా ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ నౌకా నిర్మాణ అవసరాలను తీరుస్తుంది. జూలై 1, 2019 నాటికి PSU ఆర్డర్ బుక్ రూ.27,804గా ఉంది.

జూన్ 30 నాటికి ప్రముఖ ఇన్వెస్టర్ రమేష్ దామని, మ్యుచువల్ ఫండ్ హౌసెస్ హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, రిలయన్స్ మ్యుచువల్ ఫండ్ వాటాలు కలిగి ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ మ్యుచువల్ ఫండ్ 6.56 శాతం, రిలయన్స్ కాపిటల్ ట్రస్టీ 4.11 శాతం, రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్ 1.87 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

మరో ఎల్ఐసీ పోర్ట్‌ఫోలియో బాటా ఇండియా (37 శాతం పెరుగుదల), ప్రోక్టర్ అండ్ గాంబిల్ హెల్త్ (30 శాతం పెరుగుదల), హీడెల్ బర్గ్ సిమెంట్ (29 శాతం పెరుగుదల), గుజరాత్ స్టేట్ పెట్రోనెట్ (25 శాతం పెరుగుదల)లు లాభాల్లో ఉన్నాయి.

బ్రోకరేజ్ ఫర్మ్ ఐసీఐసీఐ డైరెక్ట్ ఆగస్ట్ నెలలో బాటా ఇండియాకు కొనుగోలు రేటును రూ.1585 టార్గెట్ ఇచ్చింది. సెప్టెంబర్ 3న ఇది 1539 వద్ద ట్రేడ్ అయింది.

పిడిలైట్ఇండస్ట్రీస్ (25 శాతం పెరుగుదల), ఇంద్రప్రస్త గ్యాస్ (24 శాతం పెరుగుదల), రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (23 శాతం పెరుగుదల), ఇన్ఫోసిస్ (23 శాతం పెరుగుదల), జైదూస్ వెల్ నెస్ (21 శాతం పెరుగుదల) లాభాల్లో ఉన్నాయి. 2019లో ఇప్పటి వరకు 20 శాతం రిటర్న్స్ ఇచ్చాయి.

పిడిలైట్ ఇండస్ట్రీస్ కొనుగోలు రేటును ఆగస్ట్ 27 52 వారాల గరిష్టానికి రూ.1,399.80 ఇచ్చింది ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఎల్ఐసి తన పోర్ట్ పోలియోలో జూన్ 2019 నాటికి 350కి పైగా కంపెనీలను కలిగి ఉంది. ఇందులోని 2018 డిసెంబర్ నుంచి 290 కంపెనీల విశ్లేషణ ఇది.

English summary

ఎల్ఐసీలో ఈక్విటీ పోర్ట్‌పోలియోలో 80 శాతం షాక్, రక్షణ ఇవే... | 80% of LIC's equity portfolio deep in the red: a high flying PSU & a few others play saviour

India’s biggest institutional investor Life Insurance Corporation of India (LIC)’s equity portfolio has been bleeding profusely in the ongoing selloff in domestic stocks.
Story first published: Wednesday, September 4, 2019, 12:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X