For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐఆర్ డీఏ పేరుతో మోసపూరిత వెబ్ సైట్... జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

|

ఆన్ లైన్ ద్వారా బీమా కంపెనీలు వివిధ రకాల పాలసీలను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. చాలా కంపెనీలు జీవిత బీమా, ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్సు, వాహన బీమా పాలసీలను ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తున్నాయి. వీటికి ఆదరణ కూడా బాగానే పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మోసపూరిత వెబ్ సైట్లు ప్రవేశించి బీమా కొనుగోలు దారుల సొమ్మును కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటివాటి గురించి అవగాహనా లేకపోవడం వల్ల కొంత మంది మోసపోయే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐ ఆర్ డీ ఏ) ప్రజల ప్రయోజనం కోసం హెచ్చరిక ప్రకటన జారీ చేసింది. అందులో ఉన్న విషయం ఏమిటంటే..

www. irdaionline.org ద్వారా బీమా పాలసీలను విక్రయిస్తున్నారు. ఐఆర్ డీఏఐ అన్న పేరు ఉండటం వల్ల చాలా మంది ఇది బీమా రంగ నియంత్రణ సంస్థ వెబ్ సైట్ అని భావించి బీమా పాలసీని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీని వల్ల వారు తమ సొమ్మును కోల్పోవడమే కాకుండా బీమా ప్రయోజనాన్ని పొందడానికి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సైట్ నుంచి పాలసీలను కొనుగోలు చేయవద్దని సూచించింది. అంతే కాకుండా ఈ డొమైన్ పేరు ఐ ఆర్ డీ ఏ ఐ వద్ద అనుమతి పొందలేదని పేర్కొంది. తాము బీమా ఉత్పత్తులను విక్రయించమని స్పష్టం చేసింది. ఐ ఆర్ డీ ఏ అధికారిక వెబ్ సైట్ www.irdaonline.org అన్న విషయాన్నీ గుర్తు చేసింది.

<strong>దిగ్గజాల ఆస్తుల కంటే అప్పులెక్కువ, రూ.13లక్షల కోట్లపై ఆందోళన</strong>దిగ్గజాల ఆస్తుల కంటే అప్పులెక్కువ, రూ.13లక్షల కోట్లపై ఆందోళన

Dont buy insurance from this fake website

సరైన రిజిస్ట్రేషన్ లేకుండా బీమా ఉత్పత్తులు విక్రయిస్తున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్టు ఐ ఆర్ డీ ఏ హెచ్చరించింది. తాము కానీ, తమ అధికారులు గానీ బీమా లేదా ఆర్థిక ఉత్పత్తులను విక్రయించమని ఇంతకు ముందు కూడా స్పష్టం చేసింది. బోనస్ లాంటివి ప్రకటించామని తెలిపింది. ఇలాంటి మోసపూరిత కాల్స్ చేస్తున్న వారి సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ మేరకు ఐ ఆర్ డీ ఏ ప్రకటన చేసింది. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించింది.

ఇక మోసపూరిత వెబ్ సైట్ల ద్వారా బీమా పాలసీలను కొనుగోలు చేస్తే మీకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. అంతే కాకుండా మీరు కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే మీ కార్డుల సమాచారం కూడా మోసగాళ్ల చేతిలో పడే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త...

English summary

ఐఆర్ డీఏ పేరుతో మోసపూరిత వెబ్ సైట్... జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక | Don't buy insurance from this fake website

Please note that IRDAI authorized website is having domain name www.irdaonline.org and this website is hosting Centralized Agency Portal.
Story first published: Monday, August 26, 2019, 7:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X