For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంధన్ బ్యాంక్ క్రెడిట్ కార్డు... ఇవీ ఫీచర్లు

|

దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డుల వ్యాపారం క్రమంగా వృద్ధిచెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలోని బంధన్ బ్యాంకు క్రెడిట్ కార్డు వ్యాపార విభాగంలోకి ప్రవేశించింది. బంధన్ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించి నాలుగేళ్లు అవుతున్న సందర్భంగా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ భాగస్వామ్యంతో ఈ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు ను విడుదల చేసింది. ఈ కార్డులో మూడు వేరియెంట్లు ఉన్నాయి. ఇవి వన్ పేరుతో సాధారణ ప్రజలు, ప్లస్ పేరుతో సంపన్నులు, ఎక్స్ క్లూజివ్ పేరుతో ప్రీమియం విభాగాల అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. దేశవ్యాప్తంగా 1,000కి పైగా శాఖలున్న ఈ బ్యాంకుకు 40 లక్షలకు పైగా ఖాతాదారులున్నారు.

ఇవీ ప్రయోజనాలు

ఇవీ ప్రయోజనాలు

* ఈ కార్డులను వినియోగించే వారికీ ఆకర్షణీయమైన రివార్డ్ పాయింట్లను అందిస్తున్నారు.

* డైనింగ్, మూవీ టిక్కెట్లు, సూపర్ మార్కెట్ లావాదేవీలపై ఈ రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.

* ఇంధన సర్చార్జీ ఎత్తివేశారు. విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగ్ పై ఆఫర్లు ఉన్నాయి.

* ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ సదుపాయం ఉంది. వార్షికంగా కనీస ఖర్చుపై ఫీజు మినహాయింపు ఉంది.

 బంధన్ బ్యాంక్ వన్ ఫీచర్లు

బంధన్ బ్యాంక్ వన్ ఫీచర్లు

* ఇంధన సర్ ఛార్జ్ మినహాయింపు

* రూ. 150 ఖర్చు చేస్తే 1 రివార్డ్ పాయింట్

* సూపర్ మార్కెట్లు, డైనింగ్, మూవీ టికెట్లు, గ్రాసరీ కొనుగోలుపై 5 రివార్డ్ పాయింట్లు

* జాయినింగ్ బెనిఫిట్ 500 రివార్డ్ పాయింట్లు

* వార్షికంగా రూ. 60,000 ఖర్చు చేస్తే రెన్యూవల్ ఫీజు ఎత్తివేత

* వార్షిక ఫీజు రూ. 299

బంధన్ బ్యాంక్ ప్లస్

బంధన్ బ్యాంక్ ప్లస్

* ఇంధన సర్ ఛార్జ్ మినహాయింపు

* రూ. 150 ఖర్చు చేస్తే 3 రివార్డ్ పాయింట్

* సూపర్ మార్కెట్లు, డైనింగ్, మూవీ టికెట్లు, గ్రాసరీ కొనుగోలుపై 5 రివార్డ్ పాయింట్లు

* జాయినింగ్ బెనిఫిట్ 1500 రివార్డ్ పాయింట్లు

* వార్షికంగా రూ. 90,000 ఖర్చు చేస్తే రెన్యూవల్ ఫీజు ఎత్తివేత

* వార్షిక ఫీజు రూ.699

బంధన్ బ్యాంకు ఎక్స్ క్లూజివ్

బంధన్ బ్యాంకు ఎక్స్ క్లూజివ్

* ఇంధన సర్ ఛార్జ్ మినహాయింపు

* రూ. 150 ఖర్చు చేస్తే 3 రివార్డ్ పాయింట్

* సూపర్ మార్కెట్లు, డైనింగ్, మూవీ టికెట్లు, గ్రాసరీ కొనుగోలుపై 10 రివార్డ్ పాయింట్లు

* వార్షికంగా రూ. 4,00,000 ఖర్చు చేస్తే రెన్యూవల్ ఫీజు ఎత్తివేత

* జాయినింగ్ బెనిఫిట్ కింద రూ. 3,000 విలువైన మాక్ మై ట్రిప్ ఈ వోచర్

* వార్షిక ఫీజు రూ.2,999

ఐదేళ్ల క్రితం ఈ బ్యాంకు భారత రిజర్వ్ బ్యాంకు నుంచి యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ ను పొందింది. 2015లో ప్రారంభమైన బంధన్ బ్యాంకు దేశవ్యాప్తంగా క్రమంగా విస్తరిస్తోంది. మొదటగా బేసిక్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చారు. క్రమంగా వీటి సంఖ్యను పెంచుకుంటూ వెళుతున్నారు. తాజాగా క్రెడిట్ కార్డులను విడుదల చేశారు.

English summary

బంధన్ బ్యాంక్ క్రెడిట్ కార్డు... ఇవీ ఫీచర్లు | Bandhan Bank launches co branded credit card with Standard Chartered

In a bid to offer a complete suite of services to its existing customers, Bandhan Bank, on Friday, launched a co branded credi
Story first published: Saturday, August 24, 2019, 18:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X