For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో గిగాఫైబర్ ఎఫెక్ట్, ఎయిర్‌టెల్ V-ఫైబర్ భారీ ఆఫర్లు ఇవే...

|

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇటీవల గిగా ఫైబర్ బంపరాఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మరో పదిపదిహేను రోజుల్లో (సెప్టెంబర్ 6) గిగా ఫైబర్ సేవలు ప్రారంభం కానున్నాయి. జియో వచ్చాక ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా బాగా దెబ్బతిన్నాయి. పోటీని తట్టుకునేందుకు కొత్త కొత్త స్కీంలతో ముందుకు వస్తున్నాయి. జియో గిగా ఫైబర్ పోటీ నేపథ్యంలో ఎయిర్‌టెల్ కూడా భారీ ఆఫర్‌తో వస్తోంది.

<strong>విడుదలైన రోజు ఇంట్లోనే సినిమా: జియో గిగా దెబ్బతో వారికి వణుకు!!</strong>విడుదలైన రోజు ఇంట్లోనే సినిమా: జియో గిగా దెబ్బతో వారికి వణుకు!!

ఎయిర్ టెల్ V ఫైబర్

ఎయిర్ టెల్ V ఫైబర్

ఎయిర్‌టెల్ V-ఫైబర్ పేరుతో భారీ బ్రాండ్ బాండ్ సేవల్లోని మూడు ప్లాన్స్‌తో 200GB నుంచి 100GB వరకు అదనపు డేటా ఆఫర్ అందించనుంది. ఈ మేరకు ప్రకటన చేసింది. ఇప్పటికే ఉన్న తమ కస్టమర్లను నిలబెట్టుకోవడంతో పాటు కొత్తవారిని ఆకర్షించేందుకు వీ-ఫైబర్ బ్రాండ్ సేవలను రీవాంప్ చేస్తున్నట్లు తెలిపింది.

ఈ బెనిఫిట్స్...

ఈ బెనిఫిట్స్...

అయితే V-ఫైబర్ బ్రాండ్ బాండ్ సేవలు అక్కడికే పరిమితం కాలేదు. ఇప్పటికే ఎయిర్ టెల్ ఉచిత డేటా, ఎయిర్ టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్‌ను ఈ బ్రాడ్ బాండ్ ప్లాన్స్‌లలో అందిస్తుంది. ప్రస్తుతం ఎయిర్ టెల్ బ్రాడ్ బాండ్ ప్లాన్ బేసిక్ రూ.799, ఎయిర్‌టెల్ ఎంటర్టైన్‌మెంట్ ప్లాన్ రూ.1,099, ఎయిర్ టెల్ ప్రీమియం ప్లాన్ రూ.1,599తో ఈ అదనపు డేటా ఆఫర్ లభిస్తోంది.

రూ.799 ప్లాన్

రూ.799 ప్లాన్

ప్రస్తుతం ఎయిర్ టెల్ రూ.799 ప్లాన్ ద్వారా నెలకు 40MBPS స్పీడ్‌తో 100GB డేటా అందిస్తోంది. ఇప్పుడు దీనికి అదనంగా 200GB డేటాను ఆరు నెలల కాలపరిమితితో ఇస్తున్నట్లు ఎయిర్ టెల్ తెలిపింది. ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎయిర్ టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎయిర్ టెల్ థ్యాంక్స్‌లో ఎయిర్ టెల్ టీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉంది.

రూ.1,099 ప్లాన్

రూ.1,099 ప్లాన్

సెకండ్ బ్రాడ్ బాండ్ ప్లాన్ ఎంటర్టైన్మెంట్. దీని కాస్ట్ రూ.1,099. నెలకు 300 GB డాటా, 100MBPS స్పీడ్‌తో అందిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆఫర్‌లో ఆరు నెలలు 500GB డేటాను అదనంగా ఇస్తున్నారు. ఎయిర్ టెల్ థ్యాంక్స్ బెనిఫిట్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం కంటెంట్ సబ్‌స్క్రిప్షన్, జీ5 ప్రీమియం కంటెంట్ యాకెస్స్, అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ఏడాది, నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ 3నెలలు అందిస్తుంది. అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్‌తో ల్యాండ్ లైన్ ఫోన్.

రూ.1,599 ప్లాన్

రూ.1,599 ప్లాన్

మూడో ప్లాన్ రూ.1,599. ఈ ప్లాన్ కింద నెలకు 300MBPS వేగంతో 600GB ఉచిత డేటా అందిస్తున్నారు. ఇప్పుడు ఎయిర్ టెల్ 1000GB ఉచిత డేటాను ఆరు నెలల పాటు అదనంగా ఇస్తుంది. అలాగే, ఎయిర్ టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు పొందవచ్చు. ఎయిర్ టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం కంటెంట్ సబ్‌స్క్రిప్షన్, జీ5 ప్రీమియం కంటెంట్ యాక్సెస్, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఏడాది, మూడు నెలల నెట్ ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్. ల్యాండ్ లైన్ ఫోన్, అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ ప్రయోజనాలు ఉంటాయి.

Read more about: jio reliance jio reliance
English summary

జియో గిగాఫైబర్ ఎఫెక్ట్, ఎయిర్‌టెల్ V-ఫైబర్ భారీ ఆఫర్లు ఇవే... | Jio Effect: Airtel V Fiber Offers up to 1000GB Free Data and Plans Start at Rs 799

Bharti Airtel has revamped its V-Fiber home broadband plans, in an attempt to simplify the options available to new and existing users.
Story first published: Friday, August 23, 2019, 8:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X