For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకుల నుంచి హోమ్, కారు లోన్ తీసుకుంటున్నారా.. మీకో గుడ్‌న్యూస్

|

న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే వారికి కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త తెలిపారు. రెపో రేటు లింక్డ్ రుణాలకు బ్యాంకులు సంసిద్ధత వ్యక్తం చేశాయని ఆమె శుక్రవారం నాడు వెల్లడించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బ్యాంకు రుణాలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును తగ్గించినప్పుడు ఆ ప్రయోజనాలను కస్టమర్లకు అందించేందుకు బ్యాంకులు ఆలస్యం చేయడం లేదా రెపో రేటుకు లింక్ చేయకపోవడం జరుగుతోంది. దీంతో కస్టమర్లకు బెనిఫిట్ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో రెపో రేటు లింక్డ్ రుణాలపై బ్యాంకులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. దీనికి బ్యాంకులు అంగీకరించాయి.

దీంతో సామాన్యులకు రుణాలపై భారీ ఊరట లభించింది. రెపో రేటు ప్రయోజనాలను ఆమ్ ఆద్మీకి అందించేందుకు బ్యాంకులు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. హోమ్ లోన్, పర్సనల్ లోన్, వెహికిల్ లోన్ రెపో రేటు తగ్గినప్పుడు తగ్గుతాయన్నారు. హోమ్ లోన్స్, వర్కింగ్ కేపిటల్ లోన్స్ తక్కువ కానున్నాయి. రెపో రేట్ల తగ్గింపుతో గృ, వాహన రుణాల వాయిదాలు అనుసంధానం చేస్తారన్నారు.

<strong>నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ హైలైట్స్</strong>నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ హైలైట్స్

FM pushes banks to pass on rate cuts faster, link interest on loans to repo rate

రెపో రేటు ప్రయోజనాలను కస్టమర్లకు లేదా రుణగ్రహీతలకు అందించాల్సిన బాధ్యత బ్యాంకులకు ఉందని ఆమె చెప్పారు. ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తే ఆ ప్రయోజనాలు ఇప్పటి వరకు కస్టమర్లకు చేరడం లేదని, ఇక ముందు అలా ఉండదని చెప్పారు.

ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి అలాగే ఉంది. దాదాపు అన్ని రంగాలు ఆర్థికమాంద్యం భయంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజులుగా మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గురువారం నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు, శుక్రవారం ఉదయం నుంచి కూడా ఒడిదుడుకుల మధ్య ట్రేడ్ అయ్యాయి. సాయంత్రం నిర్మలా సీతారామన్ మీడియా ముందుకు వస్తున్నారని తెలియడంతో మార్కెట్లు లాభాల్లో క్లోజ్ అయ్యాయి.

English summary

బ్యాంకుల నుంచి హోమ్, కారు లోన్ తీసుకుంటున్నారా.. మీకో గుడ్‌న్యూస్ | FM pushes banks to pass on rate cuts faster, link interest on loans to repo rate

Finance minister Nirmala Sitharaman said in a press briefing that banks should be more reasonable in passing on interest rate cuts to the end customer.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X