For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏపీ పాలిటిక్స్ దెబ్బ, నెలలో 25% మార్కెట్ వ్యాల్యూ కోల్పోయిన కంపెనీ!!

|

ముంబై: ఎన్‌సీసీ స్టాక్స్ 60-140 శాతం వరకు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. అయితే అందుకు విరుద్ధంగా గత నెల రోజుల్లో ఈ స్మాల్ క్యాప్ స్టాక్ 25 శాతం మార్కెట్ వ్యాల్యూను కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు మూడు నెలల క్రితం కొత్తగా ఏర్పడిన వైయస్ జగన్ ప్రభుత్వం రూ.6,100 కోట్ల ప్రాజెక్టులను రద్దు చేసింది. ఆ తర్వాత ఎన్‌సీసీ భారీ మార్కెట్ వ్యాల్యూను కోల్పోయిందని ప్రముఖ ఆంగ్ల పత్రికలో కథనం వచ్చింది.

<strong>ఏపీలో పెట్టుబడులు పెట్టాలా.. ఇక చాలా సులభం!</strong>ఏపీలో పెట్టుబడులు పెట్టాలా.. ఇక చాలా సులభం!

జగన్ రద్దు ప్రభావం.. జూన్‌లో ప్రభావం

జగన్ రద్దు ప్రభావం.. జూన్‌లో ప్రభావం

ఎన్‌సీసీ ప్రాజెక్టులు రద్దు చేసిన నేపథ్యంలో ఆ ప్రభావం జూన్ క్వార్టర్‌లో కనిపించింది. ఈ కంపెనీ ఆర్డర్స్ మార్చి క్వార్టర్‌లో రూ.41,000 కోట్లుగా ఉండగా, జూన్ క్వార్టర్‌లో రూ.33,495కు పడిపోయాయి. 12 నెలల ఆదాయంలో దీని ఆర్డర్ పుస్తకంలో 2.8 శాతం తగ్గుదల ఉంది. ఇప్పటికీ ఈ కంపెనీకి రూ.12,500 కోట్ల ఏపీ ప్రాజెక్టులు ఉన్నాయి.

ఏపీలో ఉన్న ఆర్డర్లు ఇవే..

ఏపీలో ఉన్న ఆర్డర్లు ఇవే..

ఈ ఏపీ ప్రాజెక్టుల్లో రూ.4,980 కోట్ల ఆర్డర్స్ PMAY స్కీం కింద ఉన్నాయి. రూ.6,500 కోట్ల ఆర్డర్ అమరావతి రాజధాని ప్రాజెక్టు కింద ఉన్నాయి. రూ.1,025 ఆర్డర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటర్, ఇరిగేషన్ డిపార్టుమెంట్ కింద ఉంది.

ఆర్డర్లు రద్దు చేసే అవకాశాలు తక్కువ...

ఆర్డర్లు రద్దు చేసే అవకాశాలు తక్కువ...

కాగా, ఈ కంపెనీకి చెందిన మిగిలిన ఆర్డర్లు రద్దు చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. ఆంద్రా ఆర్డర్ బూక్ బ్యాలెన్స్ అనిశ్చితి నేపథ్యంలో ఎన్సీసీ డీరేటింగ్ చవి చూసూస్తోందని చెబుతున్నారు.

రూ.500 కోట్ల క్యాష్ ఫ్లో అన్ లాక్

రూ.500 కోట్ల క్యాష్ ఫ్లో అన్ లాక్

సెంబ్‌కార్ప్‌తో మధ్యవర్తిత్వం నేపథ్యంలో ఈ కంపెనీకి రూ.400-రూ.500 కోట్ల క్యాష్ ప్లో అన్‌లాక్ కావొచ్చునని బ్రోకరేజ్ నిపుణులు భావిస్తున్నారు. ఈ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఏపీ ఆర్డర్స్‌ను మినహాయించి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.11,000 కోట్లను, ఎబిడా మార్జిన్‌ను 11.7- 12 శాతంగా మార్గనిర్దేశనం చేసుకుంది.

బ్యాంకు గ్యారెంటీ అమౌంట్ విడుదల

బ్యాంకు గ్యారెంటీ అమౌంట్ విడుదల

ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన ప్రాజెక్టులకు సంబంధించిన బ్యాంకు గ్యారెంటీ అమౌంట్ విడుదలవుతాయని కంపెనీ వెల్లడించింది. అదే సమయంలో కొనసాగుతున్న ఇతర ప్రాజెక్టులకు బ్యాంకు గ్యారెంటీని పొడిగించాలి ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ ఉత్తర్వుల కారణంగా అవి నిలిచిపోయాయి.

జూన్ క్వార్టర్‌లో తగ్గిన లాభం

జూన్ క్వార్టర్‌లో తగ్గిన లాభం

ప్రభుత్వం ప్రాజెక్టులను సమీక్షించే పనిలో ఉందని, రానున్న రెండు మూడు నెలల్లో ఎన్సీసీ తిరిగి ప్రారంభమవుతుందని రిలయన్స్ సెక్యూరిటీస్ వెల్లడించింది. జూన్ క్వార్టర్‌లో ఎన్సీసీ ప్రాఫిట్ 21.6 శాతం పడిపోయి రూ.81.30 కోట్లకు చేరుకుంది. ప్రాజెక్టుల్లో చెల్లింపు ఆలస్యం వర్కింగ్ కేపిటల్ అవసరాలు పెంచడంతో పాటు అధిక వ్డీ కారణంగా లాభాలు తగ్గాయి.

కంపెనీ అప్పులు..

కంపెనీ అప్పులు..

జూన్ క్వార్టర్‌లో రెవెన్యూ 7.3 శాతం తగ్గి రూ.2,187.70గా ఉంది. జూన్ త్రైమాసికంలో కంపెనీ రూ.635 కోట్ల ఆర్డర్లను పొందింది. రూ.2,261 కోట్ల విలువైన అర్డర్స్‌ను అమలు చేసింది. అదే సమయంలో జూన్ క్వార్టర్‌లో ఎన్సీసీ గ్రాస్ స్టాండలోన్ డెబిట్స్ రూ.400 కోట్ల నుంచి రూ.2,400 కోట్లకు పెరిగింది. అయితే 2019 ఆర్థిక సంవత్సరంలోని రూ.400 కోట్ల వర్క్‌కు సంబంధించి నాన్-రిసిప్ట్ వల్ల ఇది జరిగింది. అప్పుడు రుణం రూ.1800 కోట్లకు తగ్గుతుందని కంపెనీ భావిస్తోంది.

కంపెనీల రుణాలు తగ్గుతాయి

కంపెనీల రుణాలు తగ్గుతాయి

ఆర్థిక నిపుణులు కూడా కంపెనీ రుణాలు కొంత తగ్గుతాయని భావిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం (రూ.200 కోట్లు), ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ ప్రభుత్వాల (రూ.200 కోట్లు) రసీదులు రావాల్సి ఉంది. ప్రధానంగా ఎన్నికల నేపథ్యంలో యూపీ, జార్ఖండ్‌లలో నిలిచిపోయిన బకాయిలను రాబట్టుకోవాలని ఎన్సీసీ భావిస్తోంది.

English summary

ఏపీ పాలిటిక్స్ దెబ్బ, నెలలో 25% మార్కెట్ వ్యాల్యూ కోల్పోయిన కంపెనీ!! | Trapped in Andhra politics, this smallcap is readying to rally as risks ebb

The smallcap stock has lost 25 per cent of its market value in last one month after the construction and engineering company saw cancellation of Rs 6,100 crore worth of orders by the newly formed YS Jaganmohan Reddy-led government in Andhra Pradesh.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X