For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆల్రెడీ రుణం తీసుకున్నారా.. ఈ హోమ్‌లోన్ శుభవార్త మీకోసమే!

|

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నుంచి మీరు ఇప్పటికే రుణం తీసుకున్నారా? మళ్లీ హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా... అయితే ఈ వార్త మీకోసమే. ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్న కస్టమర్లకు కూడా రెపో రేటు లింక్ గృహ రుణాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఇప్పటికే ఎస్బీఐ జూలై నుంచి రెపో రేటుతో హోమ్ లోన్స్ అనుసంధానం చేసింది.

<strong>మోడీ ప్రభుత్వం గుడ్‌న్యూస్, వ్యాపారులకు రుణమాఫీ.. కండిషన్స్</strong>మోడీ ప్రభుత్వం గుడ్‌న్యూస్, వ్యాపారులకు రుణమాఫీ.. కండిషన్స్

ఎగ్జిస్టింగ్ రుణ గ్రహీతలకు రెపో లింక్ హోమ్ లోన్ పరిశీలన

ఎగ్జిస్టింగ్ రుణ గ్రహీతలకు రెపో లింక్ హోమ్ లోన్ పరిశీలన

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది పలుమార్లు రెపో రేటు తగ్గించింది. ఈ ఏడాదే 6.50 నుంచి 5.40కి తగ్గింది. ఎస్బీఐ ఈ ప్రయోజనాలను తమ కస్టమర్లకు అందిస్తోంది. అలాగే, ఎగ్జిస్టింగ్ రుణగ్రహీతలకు రెపో లింక్ హోమ్ లోన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్ రజినీష్ కుమార్ తెలిపారు.

అప్పుడే ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్లకు మారే అవకాశం

అప్పుడే ఎంసీఎల్ఆర్ లింక్డ్ లోన్లకు మారే అవకాశం

2014లో మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ (ఎంసీఎల్ఆర్) రేటును ప్రవేశ పెట్టిన సమయంలో ప్రతి బ్యాంకు కూడా ఎగ్జిస్టింగ్ రుణగ్రహీతలకు బేస్ రేట్ లింక్డ్ లోన్స్ నుంచి ఎంసీఎల్ఆర్ - లింక్డ్ లోన్లకు మారే అవకాశం కల్పించింది. హోమ్ లోన్లకు ఎస్బీఐ లెడింగ్ రెపో రేటు రూ.75 లక్షల వరకు 8.35 శాతం నుంచి 8.90 శాతం వరకు ఉంది.

బ్యాంకర్ల సమాలోచనలు

బ్యాంకర్ల సమాలోచనలు

ఇదిలా ఉండగా, దేశ ఆర్థిక వ్యవస్థని ఐదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరే విందాగ అవసరమైన సమాలోచనలు చేయడం, రుణ వృద్ధికి ఉన్న రంగాల్ని, అవకాశాలపై శాఖల వారీ వివరాలు సేకరించడం లక్ష్యంగా ప్రభుత్వ బ్యాంకులన్నీ శని, ఆదివారాల్లో మేనేజర్ల సమావేశాలు నిర్వహించాయి. ఎస్బీఐతో పాటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఆంధ్రా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ తదితర ప్రభుత్వరంగ బ్యాంకులు ఈ సమావేశాలు నిర్వహించాయి.

రుణాలకు డిమాండ్ మందగించిందని, ఈ నేపథ్యంలో, ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన చర్యలు అవసరమని రజనీష్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు అన్ని కూడా తగినంత మూలధనంతో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సరఫరా వైపు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.

రుతు పవనాలు ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ క్రెడిట్ గ్రోత్ 12 నుంచి 14 శాతం మధ్య ఉండే అవకాశముందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ రుణ వృద్ధి 14 శాతంగా నమోదయింది. ప్రస్తుతం తమ బ్యాంకు రుణ పోర్ట్ ఫోలియో రూ.23 లక్షల కోట్లు ఉందన్నారు.

English summary

ఆల్రెడీ రుణం తీసుకున్నారా.. ఈ హోమ్‌లోన్ శుభవార్త మీకోసమే! | State Bank of India mulls repo linked home loans for existing borrowers

SBI said it is contemplating extending the benefit of the repo linked lending rate to the existing home loan borrowers while hoped for better traction in consumer demand in the second half of the fiscal expecting the government to offer fiscal stimulus.
Story first published: Monday, August 19, 2019, 14:47 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X