For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త మ్యూచువల్ ఫండ్ ఆఫర్లు ఇవే...

|

మ్యూచువల్ ఫండ్ సంస్థలు కొత్త ఫండ్ ఆఫర్లను తీసుకు వచ్చాయి. పెట్టుబడులు పెట్టాలనుకునే వారు వీటిని పరిశీలించవచ్చు.

యెస్ ఓవర్ నైట్ ఫండ్

* యెస్ మ్యూచువల్ ఫండ్.. యెస్ ఓవర్ నైట్ ఫండ్ పేరుతో కొత్త స్కీం ను తీసుకువచ్చింది. ఒక బిజినెస్ లో మెచ్యూర్ అయ్యే ఓవర్ నైట్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం ఈ ఫండ్ ఉద్దేశం. అంతే కాకుండా తక్కువ రిస్క్, ఎక్కువ లిక్విడిటీ ఈ ఫండ్ ప్రత్యేకత.
* డెట్ స్కీం - ఓవర్ నైట్ ఫండ్ కేటగిరీలో వచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది.
* ఈ ఆదివారం ప్రారంభమైన న్యూ ఫండ్ ఆఫర్ సోమవారం నాడే ముగియనుంది.
* ఇందులో ఎంట్రీ, ఎగ్జిట్ లోడ్ లేదు. కనీస పెట్టుబడి రూ. 1,000.

టాటా మ్యూచువల్ ఫండ్

టాటా మ్యూచువల్ ఫండ్

* టాటా నిఫ్టీ ప్రైవేట్ బ్యాంకు ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్ పేరుతో ఈ ఫండ్ ను ప్రారంభించారు.

* అదర్ స్కీం - అదర్ ఈటీఎఫ్ కేటగిరీలో వచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది.

* ఆగస్టు 16న ప్రారంభమైన ఈ ఫండ్ 29 న ముగుస్తుంది.

ఇందులో ఎగ్జిట్, ఎంట్రీ లోడ్ లేదు.

* కనీస పెట్టుబడి రూ. 5,000

సుందరం మ్యూచువల్ ఫండ్

సుందరం మ్యూచువల్ ఫండ్

* సుందరం ఈక్విటీ ఫండ్ పేరుతో ఈ కొత్త ఫండ్ ప్రారంభమైంది.

* ఈక్విటీ, ఈక్విటీ సంభందిత సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా క్యాపిటల్ ను పెంచాలనేది ఈ ఫండ్ ఉద్దేశం.

* ఈక్విటీ స్కీం - మల్టీ క్యాప్ ఫండ్ కేటగిరీలో వచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది.

* ఆగస్టు 16న ప్రారంభమైన ఈ స్కీం 30 న ముగుస్తుంది.

* ఇందులో ఎంట్రీ లోడ్ లేదు. ఏడాది లోపు రెడెంప్షన్ చేసుకుంటే ఒక శాతం ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. ఏడాది తర్వాత ఉండదు.

* కనీస సబ్ స్క్రిప్షన్ రూ. 100

పీజీఐఎమ్ ఇండియా మ్యూచువల్ ఫండ్

పీజీఐఎమ్ ఇండియా మ్యూచువల్ ఫండ్

* పీజీఐఎమ్ ఇండియా ఓవర్ నైట్ ఫండ్ పేరుతో ఈ ఫండ్ అందుబాటులోకి వచ్చింది. ఒక రోజు మెచ్యూరిటీ ఉండే ఓవర్ నైట్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం ఈ స్కీం ఉద్దేశం.

* డెట్ స్కీం - ఓవర్ నైట్ ఫండ్ కేటగిరీ లో వచ్చిన ఓపెన్ ఎండెడ్ స్కీం ఇది. ఇందులో కనీస పెట్టుబడి రూ. 100. దీన్ని పెంచుకుంటూ పోవచ్చు.

* ఆగస్టు 12న ప్రారంభమైన ఈ స్కీం .. 26న ముగుస్తుంది.

ఐటీఐ మ్యూచువల్ ఫండ్

ఐటీఐ మ్యూచువల్ ఫండ్

* ఐటీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ పేరుతో ఈ స్కీం ను ప్రారంభించారు.

*ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘ కాలంలో మూలధనాన్ని పెంచాలన్నది ఈ స్కీం ఉద్దేశం.

* ఈ ఎల్ ఎస్ ఎస్ కేటగిరీలో వచ్చిన ఓపెన్ ఎండెడ్ పథకం ఇది.

* ఈ కొత్త ఫండ్ ఆఫర్ జులై 15న ప్రారంభమైంది. అక్టోబర్ 14న ముగుస్తుంది.

* ఇందులో కనీస పెట్టుబడి రూ. 500

English summary

కొత్త మ్యూచువల్ ఫండ్ ఆఫర్లు ఇవే... | New Mutual Funds offers

A mutual fund is a type of financial vehicle made up of a pool of money collected from many investors to invest in securities such as stocks, bonds, money market instruments, and other assets.
Story first published: Monday, August 19, 2019, 11:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X