For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షాపింగ్ టైమ్: పెస్టివ్ సీజన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీ!

|

న్యూఢిల్లీ: నవరాత్రి, దసరా, దీపావళి సందర్భంగా గత ఏడాది కంటే ఈసారి అమెజాన్, ప్లిప్‌కార్ట్‌లలో ఫెస్టివ్ సీజన్ సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. పలు ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ ఫోన్స్, ఫ్యాషన్ బ్రాండ్స్ కంపెనీలు కూడా అదే అంచనా వేస్తున్నాయి. ఆన్‌లైన్ ఫోకస్డ్ బ్రాండ్లు, అలాగే ఫెస్డివ్ ఆర్డర్స్ రెండింతలు అయ్యాయని సీనియర్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్స్ చెబుతున్నారు.

రెస్టారెంట్ ఓనర్ల దెబ్బకు దిగొచ్చిన జొమాటో సీఈవో!

షాపింగ్ టైమ్

షాపింగ్ టైమ్

దసరా, దీపావళి వంటి పండుగ సీజన్‌లో మార్కెట్లకు 40 శాతం తాకిడి ఎక్కువగా ఉంటుందని ప్రముఖ బ్రాండ్స్ ఎగ్జిక్యూటివ్స్ చెబుతున్నారు. ఈ పండుగల సీజన్ భారతీయ కస్టమర్లకు అతిపెద్ద షాపింగ్ కాలం అని చెబుతున్నారు. డిస్కౌంట్స్, తొలిసారి ఆన్‌లైన్ షాపింగ్ చేసేవారి కారణంగా మార్కెట్ అంచనాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

పండుగ సీజన్‌లో డిస్కౌంట్స్

పండుగ సీజన్‌లో డిస్కౌంట్స్

పండుగ సీజన్‌లో వినియోగదారులు అత్యధిక డిస్కౌంట్స్ కోసం ఎదురు చూస్తారని చెబుతున్నారు. ఇందులో వారు ప్రధానంగా ఆన్ లైన్ సేల్స్ లేదా బ్రాండ్స్ వైపు దృష్టి సారిస్తారు. ఈ సమయంలో కంపెనీలు, దుకాణాలు కూడా మార్జిన్లు తక్కువగా చూసుకొని డిస్కౌంట్స్ ఇస్తాయని చెబుతున్నారు.

దసరా నుంచి దీపావళి వరకు...

దసరా నుంచి దీపావళి వరకు...

ఈ ఏడాది తొలి మెగా ఆన్‌లైన్ ఫెస్టివెల్ సేల్ దసరా సందర్భంగా సెప్టెంబర్ నెలలో ప్రారంభమై దీపావళి వరకు అంటే అక్టోబర్ వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. 2019లో 5-6 శాతం వృద్ధి సాధించామని, దీపావళి సందర్భంగా ఉత్పత్తుల వృద్ధి 8-10 శాతం వరకు ఉంటాయని భావిస్తున్నయ్లు రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేథ్ అన్నారు. ఫీచర్ ఫోన్స్ నుంచి స్మార్ట్ ఫోన్ వైపు మరలుతున్నారని, దీని వల్ల సేల్స్ పెరుగుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఫెస్టివెల్ సీజన్‌లో సేల్స్ డబుల్ ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు.

టీవీ సేల్స్ పైన ఆశలు

టీవీ సేల్స్ పైన ఆశలు

టీసీఎల్, కొడక్, థామ్సన్, ఇఫాల్కన్ వంటి కంపెనీలు కూడా తమ ఉత్పత్తులు ఈసారి డబుల్ అవుతాయని భావిస్తున్నారు. ఉదాహరణకు గత ఏడాది ఇదే పండుగ సీజన్‌లో టీసీఎల్, ఇఫాల్కన్ టెలివిజన్ సేల్స్ 225,000గా ఉండగా, ఈసారి రెండింతల స్టాక్‌కు సిద్ధమయ్యారు. జూన్ - జూలై క్వార్టర్ తర్వాత స్వాతంత్ర దినోత్సవం (ఆగస్ట్ 15) సందర్భంగా టెలివిజన్ సేల్స్ కాస్త సంతృప్తికరంగా ఉన్నాయని థామ్సన్ అండ్ కొడక్ లైసెన్సీ సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ అన్నారు.

ఆన్‌లైన్ షాపింగ్‌కు డిమాండ్

ఆన్‌లైన్ షాపింగ్‌కు డిమాండ్

భారతదేశంలో ఈ-కామర్స్ అమ్మకాలకు ప్రధానంగా స్మార్ట్ ఫోన్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, దుస్తులు ఉపయోగపడ్డాయి. ఇవే 80 శాతం ఆన్ లైన్ వ్యాపారం కలిగి ఉన్నాయి. ఆన్‌లైన్ మార్కెట్లోకి విదేశీ ఫండ్స్ నిబంధనలు ప్రభుత్వం కఠినతరం చేసిన నేపత్యంలో సగటు ఆన్ లైన్ విక్రయాలు కాస్త తగ్గాయి. కానీ అందుబాటు షాపింగ్, అందుబాటు ధరలు, వివిధ వెరైటీలు, కొత్త కొత్త షాప్స్ కారణంగా సేల్స్‌లో ఈ-కామర్స్ కాంట్రిబ్యూషన్ ఎక్కువే ఉంది.

ఆన్‌లైన్ సేల్స్ సూపర్

ఆన్‌లైన్ సేల్స్ సూపర్

వృద్ధి బాగుందని, పండుగ సీజన్‌లోను ఇది కొనసాగుతుందని భావిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ ఇండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ-కామర్స్ బిజినెస్‌లో తాము కీలకంగా ఉన్నామని, తమ సేల్స్‌లో పెద్దగా మందగమనం లేదని చెబుతున్నారు. కాగా, ఈ-కామర్స్ వెబ్ సైట్లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండుగల సీజన్లో భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

English summary

Amazon, Flipkart bet big on festive sales spike

Executives of leading brands said the marketplaces have projected a surge of over 40% in consumer traffic during the festive season, which is the largest shopping period for Indian consumers. The marketplaces expect much of these will be converted into actual sales led by discounts and first time online shoppers.
Story first published: Monday, August 19, 2019, 12:39 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more