For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈటీఎఫ్ ఆస్తులు జోరుగా పెరుగుతున్నాయ్.. ఎందుకో తెలుసా..

|

ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ఆస్తులు ఈ మధ్య కాలంలో జోరుగా పెరుగుతున్నాయి. ఎందుకంటే ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్ఓ), ప్రావిడెంట్ ఫండ్స్ నుంచి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వీటిలోకి వస్తున్నాయి. అందుకే గత రెండేళ్ల కాలంలో ఈటీఎఫ్ ఆస్తులు ఏకంగా మూడింతలు పెరిగాయి. ఇది అంచనాలకు మించిన వృద్ధి అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈపీఎఫ్ఓ అండ...

ఈపీఎఫ్ఓ అండ...

* ఈపీఎఫ్ఓ 2015 ఆగస్టులో స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.

* పెట్టుబడుల కోసం తన వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లలో తొలుత 5 శాతం వరకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించారు.

* 2016 సంవత్సరంలో 5 శాతాన్ని 10 శాతానికి పెంచారు. ఆ తర్వాత 2017 సంవత్సరంలో 10 శాతం నుంచి 15 శాతానికి పెంచారు.

* ఇక ఈపీఎఫ్ఓ తన పెట్టుబడులకు సరైన ఈటీఎఫ్ లను ఎంచుకుంటోంది. ఇప్పటి వరకు ఎస్ బీ ఐ మ్యూచువల్ ఫండ్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తున్న ఈటీఎఫ్ స్కీమ్స్ లోకి ఎక్కువగా ఈపీఎఫ్ఓ పెట్టుబడులు వెళ్లాయి. ప్రస్తుతం ఎస్ బీ ఐ నిఫ్టీ ఈటీఎఫ్ ఆస్తులు రూ. 55,000 కోట్ల వరకు ఉన్నాయి.

* తొలుత ఈపీఎఫ్ఓ ఇండెక్స్ ఫండ్స్ కు ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడు ఈటీఎఫ్ లకు పెద్ద పీట వేస్తోంది.

రిటైల్ ఇన్వెస్టర్ల వాటా ఇంకా తక్కువే..

రిటైల్ ఇన్వెస్టర్ల వాటా ఇంకా తక్కువే..

* మొత్తం మార్కెట్ ఆస్తుల్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వాటా ఇంకా 8 శాతం కన్నా తక్కువగానే ఉంది.

* ప్రస్తుతం ఈటీఎఫ్ ఆస్తుల్లో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 5 శాతం మాత్రమే ఉంది. వీటిపై ఇన్వెస్టర్లకు ఇంకా అవగాహన పెరగాల్సి ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. చాలా మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్ లను అందిస్తున్నాయి. అయితే వీటిలో మంచి పనితీరు, రాబడిని అందించే వాటికే ఎక్కువ ఆదరణ లభిస్తోంది.

* ఈ ఫండ్స్ ఏ ఇన్వెస్టర్ అయినా పెట్టుబడి పెట్టవచ్చు.

* ఈటీఎఫ్ విభాగంలో నగదు లభ్యతతో పాటు సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరిగితే ఇది మారవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

క్రమంగా పెరుగుతోంది..

క్రమంగా పెరుగుతోంది..

* ఈక్విటీ నిర్వహణలోని ఆస్తుల్లో (ఏయుఎం) ఈటీఎఫ్ వాటా క్రమంగా పెరుగుతోంది.

* 2015 జులై లో ఈక్విటీ ఏయుఎం రూ. 3.9 లక్షల కోట్లు ఉంటే ఈటీఎఫ్ వాటా 1.8 శాతం ఉండేది.

* 2016 జులై లో ఈక్విటీ ఏయుఎం రూ. 4.5 లక్షల కోట్లకు చేరుకోగా ఈటీఎఫ్ వాటా 4.5 శాతానికి పెరిగింది.

* 2017, 2018 సంవత్సరాల్లోనూ ఇది పెరుగుతూ వచ్చింది.

* 2019 జులై నాటికీ ఈక్విటీ ఏయుఎం రూ. 7. 1 లక్షల కోట్లకు చేరుకోగా ఈటీఎఫ్ వాటా 20.4 శాతానికి ఎగబాకినట్టు యాంఫి గణాంకాల ద్వారా తెలుస్తోంది.

* ఈటీఎఫ్ లు అండర్లయింగ్ ఉత్పత్తులుగా స్టాక్స్, బాండ్లు, కమొడిటీలతో కలిసి స్టాక్ ఎక్స్చేంజి ల్లో ట్రేడ్ అవుతుంటాయి.

English summary

ఈటీఎఫ్ ఆస్తులు జోరుగా పెరుగుతున్నాయ్.. ఎందుకో తెలుసా.. | ETF assets reach all time high

ETF assets reach all time high. An exchange-traded fund (ETF) is an investment fund traded on stock exchanges, much like stocks.
Story first published: Friday, August 16, 2019, 15:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X