బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే దానికి వడ్డీ రేటు ఉంటుంది. ఒక్కో బ్యాంకు రేటు ఒక్కో విధంగా ఉంటుంది. మనం తీసుకున్న రుణానికి గాను మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో అసలుతో పాటు వడ్డీని కూడా చెల్లిస్తుంటాం. ఇప్పటి వరకు రుణంపై రుణగ్రహీత.. బ్యాంకులకు వడ్డీని చెల్లించడమే తెలుసు... అయితే మీరు నెగిటివ్ ఇంటరెస్ట్ గురించి విన్నారా? అంటే అప్పు తీసుకున్న వ్యక్తికే బ్యాంకు వడ్డీ చెల్లిస్తుంది. అయితే ఇది మన దేశంలో కాదు.. డెన్మార్క్‌లో. డానిష్ బ్యాంకు ప్రపంచంలోనే తొలిసారి నెగిటివ్ ఇంటరెస్ట్ రేట్ రుణాన్ని లాంచ్ చేసింది.

వారికే వర్తిస్తుంది...0.5 శాతం వడ్డీ చెల్లింపు
రుణం తీసుకునే వ్యక్తికి ప్రతి ఏడాది 0.5 శాతం వడ్డీని చెల్లించనున్నట్లు డెన్మార్క్ దేశంలోని జైస్కే బ్యాంకు ప్రకటించింది. అయితే ఇది హోమ్‌లోన్ తీసుకునే వారికి వర్తిస్తుంది. ఇంటిని కొనుగోలు చేసే వారు పదేళ్ల కాలపరిమితితో తీసుకునే రుణంపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇలా ఓ బ్యాంకు హోమ్ లోన్ తీసుకున్న వారికే వడ్డీని చెల్లించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి.

ఇదే బ్యాంకు దారిలో...
జిస్కే బ్యాంకు డెన్మార్క్‌కు చెందిన మూడో అతిపెద్ద బ్యాంకు. తాము పదేళ్ల కాలపరిమితిపై 0.5 శాతం చెల్లిస్తామని చెబుతోంది. అదే దారిలో మరో డానిష్ బ్యాంకు... నోర్డీయా నడుస్తోంది. తమ బ్యాంకులో 20 ఏళ్ల కాలపరిమితిపై సున్నా వడ్డీ రేటు, 30 ఏళ్ల కాలపరిమితిపై 0.5 శాతం వడ్డీ చెల్లిస్తుందని తెలిపారు.

రీపేమెంట్ తగ్గుతుంది
జిస్కే బ్యాంకు ప్రకారం రుణగ్రహీతలు ప్రతి నెల తమ మంత్లీ రీపేమెంట్స్ (ఈఎంఐ చెల్లిస్తారు) చేస్తారు. ఇలా నెలనెలా చెల్లించే ఈఎంఐ కంటే అధిక మొత్తంలో మిగులు బకాయిని తగ్గించుకుంటూ రావడం జరుగుతుందని ఈ బ్యాంకు తెలిపింది. మొత్తంగా రుణం తీసుకున్న వ్యక్తి తాను తీసుకున్న దాని కంటే రీపేమెంట్ మొత్తం తగ్గుతుంది.

బ్యాంకు ఏం చెప్పిందంటే...
రుణగ్రహీతలకు తాము ఆ డబ్బును నేరుగా చేతికి ఇవ్వమని, కానీ ప్రతి నెల మీరు చెల్లించే రుణ మొత్తం తగ్గుతుందని, అప్పుడు మీరు తీసుకున్న దాని కంటే తగ్గుతుందని జిస్కే బ్యాంకు హౌసింగ్ ఎకనామిస్ట్ మిక్కెల్ హోగ్ వెల్లడించారు.

అందుకే అక్కడ ఇలా సాధ్యం
డెన్మార్క్‌తో పాటు స్వీడన్, స్విట్జర్లాండ్ దేశాల్లో మనీ మార్కెట్లో రేట్లు తగ్గిపోయాయి. ఎంతలా అంటే బ్యాంకుల పరిస్థితులను తలకిందులు చేసేస్థాయికి పడిపోయాయి. ఈ కారణంగా ఇక్కడ ఇలాంటి రుణాలు ఇవ్వడం సాధ్యమేనని చెబుతున్నారు.

డిపాజిట్ చేస్తే కస్టమర్‌పై వడ్డీ పోటు
బ్యాంకుల్లో చేసే డిపాజిట్స్ పైన మనకు ఎంతోకొంత వడ్డీ రేటు వస్తుంది. కానీ స్విట్జర్లాండ్‌కు చెందిన ఓ బ్యాంకు మాత్రం డిపాజిట్స్ పైన కస్టమర్లకే వడ్డీ విధిస్తోంది. ఈ మేరకు గత వారం ప్రకటన చేసింది. €500,000ను డిపాజిట్ చేసే వారి పైన ఏడాదికి 0.6 శాతం ఛార్జ్‌ను వసూలు చేసే ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించింది. రుణం తీసుకుంటే రుణగ్రహీతలకే వడ్డీ చెల్లించడం, డిపాజిట్ చేస్తే కస్టమర్ల పైనే వడ్డీ విధించడం ఆసక్తికరమే.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications