For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అత్యంత నమ్మకమైన ఆన్ లైన్ బ్రాండ్లు ఏవంటే ... అమెజాన్, పేటీఎం, జీయో..

|

ఆన్ లైన్ ద్వారా కోట్లాది మంది అనేక రకాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. సేవలను కూడా వినియోగించుకుంటున్నారు. ఇలాంటి సదుపాయాలను కల్పించే ఆన్ లైన్ బ్రాండ్లు అనేకం అందుబాటులోకి వచ్చినాయి. కానీ అన్నింటినీ అందరు వినియోగించరు. కొన్నిటి మీదనే కస్టమర్లకు విశ్వాసం ఉంటుంది. అలాంటి వాటికే మంచి ఆదరణ లభిస్తుంది. తాజాగా యూగావ్ అనే సంస్థ ఆన్ లైన్ బ్రాండ్లపై ఉన్న నమ్మకానికి సంభందించి ఒక సర్వేను నిర్వహించింది ఇందులో చాలా ఆసక్తి కరమైన అంశాలు వెల్లడయ్యాయి. అవేమిటంటే..

* రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన రిలయన్స్ జియో, మేక్ మై ట్రిప్, పేటీఎం అత్యంత నమ్మకమైన ఆన్ లైన్ బ్రాండ్లుగా నిలిచాయి.
* ఈ - కామర్స్ దిగ్గజం అమెజాన్ ఎక్కువ విశ్వాసం కలిగిన ఆన్ లైన్ షాపింగ్ రిటైలర్ గా నిలిచింది.
* యుగావ్ ఈ నెల లోనే ఇంటర్నెట్ ద్వారా 1,017 మందిని సర్వే చేసింది. ఇందులో 18 నుంచి 40 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు పాల్గొన్నారు.
* ఐదు కేటగిరీల్లో (ఈ-కామర్స్, ఆన్ లైన్ ట్రావెల్ బుకింగ్స్, ఆన్ లైన్ పే మెంట్స్ లేదా ఈ- వాలెట్లు, క్యాబ్ సర్వీసులు, మొబైల్ నెట్ వర్క్ అందించే సంస్థలు ) 75 బ్రాండ్లను అందుబాటులో ఉంచి వాటిలో నమ్మకమైన బ్రాండ్ ను ఎంచుకునే అవకాశం కల్పించారు.
* ఆన్ లైన్ షాపింగ్, ఈ- కామర్స్ కు సంభందించి భారతీయులు ఎక్కువగా గ్లోబల్ బ్రాండ్లను నమ్ముతున్నారు. ఆన్ లైన్ చెల్లింపులు, ఆన్ లైన్ ట్రావెల్ బుకింగ్స్, మొబైల్ నెట్ వర్క్ విషయంలో దేశీయ బ్రాండ్లకు పట్టం కడుతున్నారు.

<strong>ఆస్ట్రేలియాలో ఇన్ఫోసిస్ సరికొత్త రికార్డ్, కానీ షాక్ తప్పదా</strong>ఆస్ట్రేలియాలో ఇన్ఫోసిస్ సరికొత్త రికార్డ్, కానీ షాక్ తప్పదా

రిలయన్స్ జియో...

రిలయన్స్ జియో...

అత్యంత నమ్మకమైన టెలికాం బ్రాండ్లలో జియో అగ్ర స్థానంలో ఉంది. 41 శాతం మంది జియో ట్రస్టెడ్ బ్రాండుగా పేర్కొన్నారు. ఎయిర్ టెల్ రెండో స్థానంలో నిలిచింది. మూడో వంతు మంది ఈ సంస్థపై నమ్మకం వ్యక్తం చేశారు. వొడాఫోన్ మూడో స్థానంలో ఉంది.

అమెజాన్

అమెజాన్

ఆన్ లైన్ షాపింగ్ లో అమెజాన్ అగ్రస్థానంలో ఉంది. ఫ్యాషన్ కు సంబంధించి షాపింగ్ చేసే సమయంలో అమెజాన్ ను నమ్ముతున్నట్టు సర్వేలో పాల్గొన్న వారిలో 45 శాతం మంది పేర్కొన్నారు.

* ఫ్లిప్కార్ట్ (21 శాతం), మింత్రా (13 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

మేక్ మై ట్రిప్..

మేక్ మై ట్రిప్..

* ఆన్ లైన్ ట్రావెల్ బుకింగ్ కు సంభందించి మాక్ మై ట్రిప్ అత్యంత నమ్మకమైన బ్రాండుగా నిలిచింది. దీన్ని 34 శాతం మంది ఎంచుకున్నారు. పే టీఎం 17 శాతం, గోయిబిబో పై 6 శాతం మంది నమ్మకం వ్యక్తం చేశారు.

పేటీఎం

పేటీఎం

* ఆన్ లైన్ లావాదేవీల విషయంలో పే టీ ఎం ముందంజలో ఉంది. 40 శాతం మంది దీన్ని నమ్మతున్నట్టు తెలిపారు. గూగుల్ పే రెండో స్థానం (27 శాతం) లో ఉంది. ఫోన్ పే 10 శాతం తో మూడో స్థానంలో ఉంది.

* గూగుల్ పే వినియోగదారుల సంఖ్యను క్రమంగా పెంచుకుంటోంది.

* టాక్సీ అగ్రిగేటింగ్ సంస్థలైన ఉబెర్, ఓలా లపై కస్టమర్లు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

English summary

అత్యంత నమ్మకమైన ఆన్ లైన్ బ్రాండ్లు ఏవంటే ... అమెజాన్, పేటీఎం, జీయో.. | Amazon, Paytm, Jio, MakeMytrip most trusted online brands

Indian consumers opted between foreign and home-grown brands while shopping for clothes, booking online tickets and their preferred telecom services provider, according to findings of a survey by YouGov that asked Indian shoppers about their most trusted online brands in India.
Story first published: Wednesday, August 14, 2019, 14:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X