For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆల్గో ట్రేడింగ్‌ అంటే ఏంటి ? సింపుల్‌ ఎనాలిసిస్

|

ఒకప్పుడు ట్రేడింగ్ ఫ్లోర్ గందరగోళంగా ఉండేది. షేర్లు అమ్మేవాళ్లు, కొనేవాళ్ల అరుపులు.. ఫోన్ కాల్స్, ఆర్డర్స్.. ఇలా గందరగోళంగా ఉండేది. తర్వాత మెల్లిగా బ్రోకర్ ఆఫీసుల్లో సందడి తగ్గిపోయింది. ఆన్‌లైన్, యాప్స్ రాకతో ఎక్కడ కూర్చునైనా ట్రేడ్ చేసుకునే వెసులుబాటు రావడంతో జనాలు వాటి వైపు మళ్లిపోయారు. ఇప్పుడు మనషులకు బదులు మెషీన్లు ట్రేడ్ చేయడంతో బ్రోకర్లు, ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్‌తో ఏ మాత్రం పనిలేకుండా పోతోంది. ఆల్గో ట్రేడ్ దెబ్బకు సంప్రదాయ ట్రేడర్లు నిలబడగలరా లేదా.. అనే ప్రశ్నే వినిపిస్తోంది.

మనీ సేవింగ్: ఈ చెడు అలవాట్లను మార్చుకోండి!

ఏంటీ ఆల్గో ట్రేడ్

ఏంటీ ఆల్గో ట్రేడ్

కళ్లు మూసి తెరిచే లోపే ఒకటికి నాలుగు ట్రేడ్స్ జరిగిపోయాయి. మనం ఆర్డర్ ప్లేస్ చేసేలోపు అక్కడ ఒకటి, రెండు ట్రేడ్స్ పూర్తి అయిపోయి ఉంటాయి. అదే ఆల్గో. మనిషికి బదులు మెషీన్ చేసే ప్రోగ్రాం బేస్డ్ ఫాస్ట్ ట్రేడ్‌నే ఆల్గో ట్రేడ్ అంటున్నాం. మనిషి సైకాలజీని, ట్రేడర్స్ ఎమోషన్‌ను కంట్రోల్ చేస్తూ చేసే ట్రేడ్ ఇది.

ఇప్పుడు మనం అధిక శాతం ఛార్ట్స్‌ లేదా టెక్నికల్ ఎనలిస్టులను ఫాలో అవుతున్నాం. కానీ ఆల్గో మాత్రం దీనికి భిన్నం. కేవలం ఛార్ట్స్‌పై పూర్తిగా ఆధారపడకుండా, ఆర్థిమెటిక్‌ను బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తుంది ఆల్గో.

ట్రేడ్ ప్యాటర్న్స్ వేరు

ట్రేడ్ ప్యాటర్న్స్ వేరు

ఒకప్పుడు (ఇప్పుడూ అదే పరిస్థితి) పెద్ద పెద్ద ఆర్థిక సంస్థలు, ట్రేడర్లు.. భారీ సైజ్‌లో ట్రేడ్స్ చేయకుండా చిన్న చిన్న మొత్తాల్లో చేస్తుంటారు. దీని వల్ల మార్కెట్‌లో కానీ.. లేదా సదరు షేర్‌లో కానీ ఎలాంటి ఒడుదుడుకులూ పెద్దగా కనిపించవు. కానీ ఇప్పుడు పెద్ద ట్రేడర్లు, సంస్థలు తమ ట్రేడ్‌కు సంబంధించిన వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేసి ప్రోగ్రాం రాస్తున్నారు. దీంతో చిన్న చిన్న ట్రేడ్స్ అతి స్వల్ప సమయంలోనే జరిగిపోతున్నాయి. ఉదాహరణకు రిలయన్స్ స్టాక్ రూ.1161 ఉందని అనుకుందాం. అతి తక్కువ సమయంలోనే రూ.1161లో కొని రూ.1162 లేదా ఒకటి రెండు రూపాయలకు అటో ఇటో ట్రేడ్‌ను పూర్తి చేసేస్తోంది. మనం ఆర్డర్లు పెట్టేలోపు అమ్మకాలు, కొనుగోళ్లు జరిగిపోతున్నాయి. దీని వల్ల కృత్రిమంగా డిమాండ్ కూడా పెరుగుతుంది.

ఇక్కడ ఆర్బిట్రేజ్ అవకాశాలను కూడా ఆల్గో ట్రేడ్స్ వదిలిపెట్టడం లేదు. అంటే ఒక స్టాక్‌ను ఎన్ఎన్ఈలో కొని, బిఎస్ఈలో అమ్మడం లాంటి ట్రేడ్స్ కూడా స్ప్లిట్ సెకెన్లలో పూర్తి చేసేస్తోంది ఆల్గో.

ఎప్పుడు ఉపయోగపడ్తుంది ?

ఎప్పుడు ఉపయోగపడ్తుంది ?

ఆల్గో ట్రేడ్స్ ప్రధానంగా మేజర్ న్యూస్ సమయంలో బాగా ఉపయోగపడ్తుంది. ఆర్బీఐ ప్రకటనలు, కార్పొరేట్ ఫలితాలు సహా ప్రభుత్వ విధాన నిర్ణయాల సమయంలో మార్కెట్లో ఎక్కువగా ఒడుదుడుకులు ఉంటాయి. అందుకే అలాంటి సమయాల్లో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అన్నట్టు .. ఎంతవేగంగా ట్రేడ్స్ చేసుకోగలిగితే అంత ప్రయోజనం ఉంటుంది.

ఇండియాలో ఉందా

ఇండియాలో ఉందా

వాస్తవానికి ఇన్‌స్టిట్యూషనల్ క్లైంట్స్‌కు మాత్రమే ఆల్గో ట్రేడ్ చేసుకునేలా తమ సభ్యులకు సెబీ అనుమతినిచ్చింది. వేల కోట్ల రూపాయల ఫండ్స్‌ను నిర్వహిస్తున్న ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్స్, హెడ్జ్ ఫండ్స్‌ తమ ట్రేడ్ పోర్ట్‌ఫోలియోలను మేనేజ్ చేసుకునే వెసులుబాటును సెబీ కల్పించింది. ప్రస్తుతం ఈ తరహా ట్రేడ్స్ చేస్తున్నవాళ్ల టర్నోవర్ 35-40 శాతం వరకూ ఉంది.

ప్రపంచ వ్యాప్తంగా ఆల్గో ట్రేడ్ మార్కెట్ సైజ్ 11.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2024 నాటికి 18.8 బిలియన్ డాలర్లకు చేరొచ్చని పరిశ్రమ అంచనా.

అయితే రాబోయే రోజుల్లో ఇలాంటి ఆల్గో ట్రేడ్స్‌కే ఫ్యూచర్ ఉండబోతోంది. వీటి గురించి పూర్తి అవగాహన తెచ్చుకోవడం ముఖ్యం. ప్రధానంగా ట్రేడర్స్‌కు వీటిపై కనీస క్లారిటీ ఉండాలి.

English summary

Will the rapid rise in algo trading leave traditional traders behind?

Financial trading floors are experiencing a huge transition from innovative technologies. It has given traders more powers to do fast execution of trades with discipline in a rapidly changing market scenario by reducing human errors, as computer-programmed software remains unaffected by human psychology.
Story first published: Sunday, August 11, 2019, 12:23 [IST]
Company Search