For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

7 నెలల్లో రూ.6 లక్షల కోట్ల నష్టం: గట్టెక్కిన, నష్టపోయిన బిలియనీర్లు వీరే

|

న్యూఢిల్లీ: 2019 క్యాలెండర్ ఇయర్‌లో ఏడు నెలలు గడిచిపోయి, ఎనిమిదో నెల నడుస్తోంది. జనవరి నుంచి ఆగస్ట్ (ఇప్పటిదాకా) వరకు దలాల్ స్ట్రీట్ రూ.6.07 లక్షల కోట్లు నష్టపోయింది. సెన్సెక్స్, నిఫ్టీలు హైలెవల్, లో-లెవల్ వరకు వెళ్లి సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఈ ఏడు నెలల కాలంలో మార్కెట్లు భారీ నష్టాలు చవిచూసినప్పటికీ పలువురు ఇండియన్ బిలియనీర్లు మాత్రం లాభాలు మూటగట్టుకున్నారు.

<strong>పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్: రెట్టింపు పెన్షన్?</strong>పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్: రెట్టింపు పెన్షన్?

5గురు బిలియనీర్లు రూ.7,000 కోట్లు లాభపడ్డారు

5గురు బిలియనీర్లు రూ.7,000 కోట్లు లాభపడ్డారు

బ్లూమ్‌బర్గ్ ప్రకారం జూలై చివరి నాటికి టాప్ 10 ఇండియన్ బిలియనీర్లలో 5గురు 1 బిలియన్ డాలర్లు (రూ.7,000 కోట్లు) తమ ఖాతాలో జమ చేసుకున్నారు. అంటే ఆ మేర వీరు లాభపడ్డారు. పలువురు బిలియనీర్లు మాత్రం నష్టాలను చవిచూశారు.

అజీమ్ ప్రేమ్‌జీ టాప్

అజీమ్ ప్రేమ్‌జీ టాప్

ఇండియన్ బిలియనీర్లలో లాభపడిన వారిలో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ ముందున్నారు. అతని సంపాదన 3.06 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆగస్ట్ 2వ తేదీ నాటికి అతని నెట్ వర్త్ 20.4 బిలియన్ డాలర్లుగా ఉంది. విప్రో షేర్లు ఈ ఏడాది ఆరు శాతం ఎగబాకాయి.

ముఖేష్ అంబానీ ఆస్తులు పెరిగినా...

ముఖేష్ అంబానీ ఆస్తులు పెరిగినా...

అజీమ్ ప్రేమ్ జీ తర్వాత ఎక్కువ గెయిన్ అయిన పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ముఖేష్ అంబానీ. ఆయన ఆస్తులు 2.94 బిలియన్ డాలర్లు పెరిగాయి. జూలై 30, 2019 నాటికి అతని ఆస్తులు 47.3 బిలియన్ డాలర్లు. రిలయన్స్ స్టాక్స్ 2 శాతం పెరిగాయి. అయితే గత పది సెషన్లలో రిలయన్స్ షేర్లు పడిపోతున్నాయి. ఈ కాలంలో రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 33% నష్టపోయింది.

ఉదయ్ కొటక్ (కొటక్ మహీంద్రా బ్యాంకు)

ఉదయ్ కొటక్ (కొటక్ మహీంద్రా బ్యాంకు)

కొటక్ మహీంద్రా బ్యాంకు సీఎండీ ఉదయ్ కొటక్ ఆస్తులు ఈ ఏడాది 1.96 బిలియన్ డాలర్లు పెరిగాయి. జూలై 30వ తేదీ నాటికి అతని మొత్తం ఆస్తులు 13.4 బిలియన్ డాలర్లు. ఆగస్ట్ 1వ తేదీ నాటికి కొటక్ మహీంద్రా బ్యాంకు షేర్లు 19 శాతం పెరిగాయి.

గౌతమ్ అదానీ సహా...

గౌతమ్ అదానీ సహా...

ఈ ఏడు నెలల్లో లాభపడిన బిలియనీర్లలో అదానీ గ్రూప్‌కు చెందిన గౌతమ్ అదానీ కూడా ఉన్నారు. శ్రీ సిమెంట్స్‌కు చెందిన బేణు గోపాల్ బంగూర్, హెచ్‌సీఎల్‌కు చెందిన శివనాడర్ కూడా ఉన్నారు. అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ గ్యాస్ షేర్లు 50.22 శాతం, అదానీ పవర్ 15.22 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్ 3.05 శాతం పెరిగాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యాల్యూ 5.93 శాతం పెరిగింది. శ్రీ సిమెంట్స్ 16.06 శాతం పెరిగింది.

సునీల్ మిట్టల్ (ఎయిర్ టెల్)

సునీల్ మిట్టల్ (ఎయిర్ టెల్)

భారతీ ఎయిర్ టెల్ సునీల్ మిట్టల్ (511 మిలియన్ డాలర్లు), బజాజ్ గ్రూప్ రాహుల్ బజాజ్ (73 మిలియన్లు) కూడా ఈ ఏడాది ఆదాయాన్ని ఆర్జించారు.

లక్ష్మీ మిట్టల్.. భారీ నష్టం

లక్ష్మీ మిట్టల్.. భారీ నష్టం

ఈ ఏడాది ఎక్కువ నష్టం చవిచూసిన టైకూన్ ఆర్సెలార్ మిట్టల్‌కు చెందిన లక్ష్మీమిట్టల్. అతని ఆస్తుల్లో 2.01 బిలియన్ డాలర్ల మేర కోతపడింది. అతని టోటల్ నెట్ వర్త్ 11.8 బిలియన్ డాలర్లుగా ఉంది. వాడియా గ్రూప్ చైర్మన్ నుస్లీ వాడియా ఆస్తి 1.44 బిలియన్ డాలర్ల మేర నష్టపోయి 5.86 బిలియన్ డాలర్లుగా ఉంది.

సావిత్రీ జిందాల్ సహా వీరు నష్టపోయారు..

సావిత్రీ జిందాల్ సహా వీరు నష్టపోయారు..

రిచ్చెస్ట్ ఇండియన్ వుమెన్, జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్‌పర్సన్ సావిత్రీ జిందాల్ ఆస్తి 1.26 బిలియన్ డాలర్ల మేర నష్టపోయి 6.20 బిలియన్ డాలర్లుగా ఉంది. సన్ ఫార్మా దిలీప్ సంఘ్వీ, అవెన్యూ సూపర్ మార్కెట్ రాధాకృష్ణన్ దమానీ, ఆదిత్య గ్రూప్ కుమార మంగళం బిర్లా, పూనావాలా గ్రూప్ సైరస్ పూనావాలా తదితరులు కూడా వారి ఆస్తుల్లో దాదాపు సగం వరకు కోల్పోయారు. జిందాల్ స్టీల్ అండ్ పవర్ షేర్లు 30 శాతం, బ్రిటానియా ఇండస్ట్రీస్ షేర్లు 17.46 శాతం, అవెన్యూ సూపర్ మార్కెట్ షేర్లు 7.02 శాతం, సన్ ఫార్మా షేర్లు 2.79 శాతం పడిపోయాయి.

English summary

7 నెలల్లో రూ.6 లక్షల కోట్ల నష్టం: గట్టెక్కిన, నష్టపోయిన బిలియనీర్లు వీరే | D Street lost Rs.6 lakh cr year to date, but these billionaires still made billions

The roller coaster ride in the stock market in the first seven months of Calendar 2019 cost equity investors about Rs 6.07 lakh crore. The equity indices touched new all time highs and then fell sharply within this period.
Story first published: Sunday, August 11, 2019, 12:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X