For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్: రెట్టింపు పెన్షన్?

|

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో సభ్యులకు పెన్షన్ మొత్తాన్ని పెంచే అవకాశాలు లేకపోలేదు. త్వరలో పెన్షన్ అమౌంట్ రెండింతలు అంటే రూ.1000 నుంచి రూ.2000కు పెంచనున్నారు. పీఎఫ్ వడ్డీ రేటుపై పీఎఫ్ ఖాతాదారుల నుంచి ఎన్నో విజ్ఞప్తులు వచ్చాయి. ఇది కూడా పెరిగే అవకాశముంది.

<strong>ఎల్ఐసీ సరికొత్త 'జీవన్ అమర్': పాలసీ పూర్తి వివరాలు</strong>ఎల్ఐసీ సరికొత్త 'జీవన్ అమర్': పాలసీ పూర్తి వివరాలు

ఈపీఎఫ్ఓ పెంపుకు సంబంధించి భేటీ

ఈపీఎఫ్ఓ పెంపుకు సంబంధించి భేటీ

లేబర్ మినిస్ట్రీ సోర్సెస్ ప్రకారం ఆగస్ట్ రెండో వారం ఈపీఎఫ్ఓ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం పెన్షనర్ల కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచడంపై. ఈ సమావేశంలో ఓ నిర్ణయానికి వస్తే సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీతో సమావేశంలో ఈపీఎఫ్ఓ నిర్ణయాన్ని ఉంచుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఆమోదం అనంతరం పెన్షనర్లకు కనీస పెన్షన్ పెంపు గురించి ఈపీఎఫ్ఓ ప్రకటన చేస్తుంది. అయితే ఇప్పటికే ఈపీఎఫ్ఓ నోడ్ ఇచ్చింది. సీబీటీ నిర్ణయంపై ఇది ఆధారపడి ఉంటుంది.

పెన్షనర్లకు అనుకూలంగా.. వడ్డీ రేటు పెంపు

పెన్షనర్లకు అనుకూలంగా.. వడ్డీ రేటు పెంపు

పెన్షనర్ల పలు సిఫారసులకు ఈపీఎఫ్ఓ అనుకూలంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. అంటే పీఎఫ్ ఖాతాదారుల వడ్డీ రేటును పెంచే అవకాశముందని భావిస్తున్నారు. పీఎఫ్ ఖాతాలపై వడ్డీ రేటు పెంచాలనే ప్రతిపాదన కూడా సమావేశంలో చర్చకు రావొచ్చని భావిస్తున్నారు.

వడ్డీ రేట్ల సమీక్ష

వడ్డీ రేట్ల సమీక్ష

2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌వో ఇప్పటికే 8.65 శాతం వడ్డీ రేటును ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఈపీఎఫ్‌వో నిర్ణయాన్ని ఆమోదించింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంక్షోభం నేపథ్యంలో ఈపీఎఫ్ వడ్డీ రేట్లను సమీక్షించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈపీఎఫ్ఓను కోరింది. ఈపీఎఫ్ఓ మాత్రం పీఎప్ అకౌంట్ హోల్డర్స్‌కు ఎక్కువ వడ్డీనే రావాలని కోరుకుంటోంది. అంటే ఈపీఎఫ్ఓ అధిక వడ్డీ రేటుకే కట్టుబడి ఉంది.

వడ్డీ రేటు పెంపు కోసం సిఫార్సు

వడ్డీ రేటు పెంపు కోసం సిఫార్సు

సబ్‌స్క్రైబర్లకు అధిక వడ్డీ రేటు అందించినా కూడా వచ్చే నష్టం లేదని ఈపీఎఫ్ఓ అధికారులు చెబుతున్నారు. వడ్డీ రేటు పెంపు తర్వాత ఈపీఎఫ్ఓ వద్ద రూ.150 కోట్ల మిగులు నిధులు ఉంటాయని చెబుతున్నారు. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును 8.55 శాతం నుంచి 8.65 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది.

English summary

పీఎఫ్ అకౌంట్ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్: రెట్టింపు పెన్షన్? | Pension hike coming soon? These decisions may be announced

Employees Provident Fund Organisation (EPFO) may soon increase the minimum pension for its members.
Story first published: Friday, August 9, 2019, 15:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X