For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లోన్ రేట్లను తగ్గించిన HDFC, ఏ కాలపరిమితిపై ఎంత ఉందంటే?

|

ప్రయివేటురంగ బ్యాంకు దిగ్గజం HDFC రుణ రేట్లను తగ్గించింది. ఈ మేరకు వడ్డీ రేట్ల తగ్గింపుపై మంగళవారం ప్రకటన చేసింది. అన్ని కాల పరిమితుల రుణాలపై 10 బేసిస్ పాయింట్లు (0.10 శాతం) తగ్గించింది. సవరించిన వడ్డీ రేట్లు 7 ఆగస్ట్, బుధవారం నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. దీంతో బ్యాంకు ఏడాది కాలపరిమితి MCLR (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్) ఆధారిత రుణ రేటు 8.60 శాతానికి తగ్గింది.

ఆర్బీఐ ప్రకటనకు ఒకరోజు ముందు...

ఆర్బీఐ ప్రకటనకు ఒకరోజు ముందు...

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ రోజు (7, ఆగస్ట్) పరపతి సమీక్షను ప్రకటించనుంది. ఆర్బీఐ ప్రకటనకు ఒక్క రోజు ముందు HDFC వడ్డీ రేట్లు తగ్గించడం గమనార్హం. ఆర్బీఐ గత మూడు సమీక్షల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున మొత్తం 75 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. దీంతో 6.50 నుంచి 5.75కు వచ్చింది. ఈ రోజు ఆర్బీఐ మరోసారి రెపో రేటు తగ్గిస్తుందని భావిస్తున్నారు.

ఆయా కాలపరిమితులపై వడ్డీ రేటు ఇలా...

ఆయా కాలపరిమితులపై వడ్డీ రేటు ఇలా...

HDFC అన్ని కాలపరిమితులకు ఏడాది కాల పరిమితి కలిగిన రుణాలపై MCLR రేటును 8.70 శాతం నుంచి 8.60 శాతానికి తగ్గించంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లు ఇలా ఉంటాయి...

కాలపరిమితి w.e.f 8 July w.e.f 7 August

Overnight 8.30% 8.20%

1 నెల 8.30% 8.20%

3 నెలలు 8.40% 8.30%

6 నెలలు 8.50% 8.40%

1 ఏడాది 8.70% 8.60%

2 సంవత్సరాలు 8.80% 8.70%

3 ఏళ్లు 8.95% 8.85%

రేటు తగ్గించిన బ్యాంకులు

రేటు తగ్గించిన బ్యాంకులు

తగ్గుతున్న వడ్డీ రేటు ప్రయోజనాలను కస్టమర్లకు అందించాలని ఆర్బీఐ బ్యాంకులకు ఎప్పటికి అప్పుడు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు ఈ ప్రయోజానాల్ని కస్టమర్లకు అందిస్తున్నాయి. గత కొద్ది వారాలుగా బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ.. ఇలా పలు బ్యాంకులు తమ వడ్డీ రేట్లను తగ్గించాయి.

English summary

లోన్ రేట్లను తగ్గించిన HDFC, ఏ కాలపరిమితిపై ఎంత ఉందంటే? | HDFC Bank Lowers MCLR By 10 Bps Across All Tenures

On Tuesday, HDFC Bank decided to cut its lending rates by 0.10 percent across all tenures and the new rates will be effective from 7 August, a PTI report said, citing sources.
Story first published: Wednesday, August 7, 2019, 8:20 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X