For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రైవేటు వాతావరణ కంపెనీలకు డిమాండ్, $100 మిలియన్‌కు చేరుకొన్న భారత్ మార్కెట్

|

ఒకప్పుడు వాతావరణ వార్తలపై బోలెడన్ని జోకులు పేలేవి. వర్షం పడుతుంది అంటే ఎండా కాస్తుందని, వాతావరణం పొడిగా ఉంటుంది అంటే అదే రోజు వర్షం పడుతుందని వెటకారం ఆడేవారు. కానీ కొన్నేళ్లుగా పరిస్థితిలో భారీ మార్పు వచ్చింది. ఒకప్పుడు కేవలం ప్రభుత్వం మాత్రమే వాతావరణ సంబంధిత అంశాలకు ప్రాధాన్యం ఇచ్చేది. అల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లో వచ్చే వెదర్ న్యూస్ పై రైతులు, ఇతరులు ఆధారపడేవారు. కానీ ప్రస్తుతం ఈ రంగంలోకి ప్రైవేట్ వెదర్ ఫోరేకేస్టింగ్ కంపెనీలు వచ్చి చేరాయి. దీనిని కూడా సీరియస్ బిజినెస్ ఆప్షన్ గా పెట్టుకున్నాయి. గ్లోబల్ ట్రెండ్ కు అనుగుణంగా మన దేశం లోనూ ప్రైవేట్ సెక్టార్ కంపెనీలు వాతావరణ అంచనాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఈ రంగంలో ఉన్న కంపెనీలకు డిమాండ్ పెరుగుతోంది.

<strong>మీరు హౌస్‌పైఫ్ లేదా టీచరా?: ఇలా రూ.15,000 దాకా సంపాదించవచ్చ</strong>మీరు హౌస్‌పైఫ్ లేదా టీచరా?: ఇలా రూ.15,000 దాకా సంపాదించవచ్చ

100 మిలియన్ డాలర్ల మార్కెట్...

100 మిలియన్ డాలర్ల మార్కెట్...

ప్రపంచ వ్యాప్తంగా ప్రైవేట్ వెదర్ ఫోరేకేస్టింగ్ రంగ మార్కెట్ పరిమాణం 2016 లో 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ 8,400 కోట్లు) కాగా.. 2023 నాటికీ 2.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ 18,900 కోట్లు ) స్థాయికి చేరుకొంటుందని అల్లైడ్ మార్కెట్ రీసెర్చ్ అనే సంస్థ అంచనా వేస్తోంది. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. అదే సమయంలో భారత్ లో ఈ మార్కెట్ విలువ ఇప్పటికే 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ 700 కోట్లు) చేరుకొంది, ఇది చాల వేగంగా వృద్ధి చెందుతోందని స్కైమెట్ అనే కంపెనీ జతిన్ సింగ్ వెల్లడించినట్లు ఈటీ పేర్కొంది.

అమెరికా కంపెనీతో నీతి ఆయోగ్ జట్టు...

అమెరికా కంపెనీతో నీతి ఆయోగ్ జట్టు...

అమెరికా కు చెందిన ప్రముఖ వెదర్ ఫోరేకేస్టింగ్ కంపెనీ ది వెదర్ కంపెనీ (WC) తో భారత్ కు చెందిన నీతి ఆయోగ్ జట్టు కట్టింది. దేశంలో ఇలాంటి కంపెనీలకు పెరుగుతున్న డిమాండ్ కు ఇదే నిదర్శనం. ఒక ప్రభుత్వరంగ సంస్థ ఒక ప్రైవేట్ వాతావరణ అంచనా కంపెనీతో కలిసి పనిచేయటం చాల కొత్త విషయం. ది వెదర్ కంపెనీని 2016 లో ప్రముఖ ఐటీ కంపెనీ ఐబీఎం కొనుగోలు చేసింది. దీనికి 178 దేశాల్లో శాఖలు ఉన్నాయి. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వాతావరణాన్ని అంచనా వేసే ఈ కంపెనీ ... స్థానిక ప్రాంతాలకు తగ్గట్లు నివేదికలను పొందుపరిచాం గలదు. భారత్ లో దీనికి అగ్రికల్చర్, లాజిస్టిక్స్, ట్రాన్స్ పోర్ట్ రంగాలలో పెద్ద క్లైంట్స్ ఉన్నట్లు ది వెదర్ కంపెనీ ఇండియా హెడ్ హిమాంశు గోయల్ తెలిపినట్లు ది ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ వంటి టెక్నాలజీలు వాడుతూ అతి సూక్ష్మ స్థాయి ఖచ్చితత్వం సాధిస్తున్నట్లు సమాచారం.

స్కైమెట్ కూడా ...

స్కైమెట్ కూడా ...

ప్రైవేట్ రంగంలో భారత్ లో వాతావరణ అంచనాలు వెల్లడిస్తున్న కంపెనీ స్కైమెట్. దీనికి కూడా దేశంలో చాలా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ మధ్య దేశంలో ఎల్ నినో ప్రభావం తో అనావృష్టి నెలకొంటుందని కచ్చితమైన అంచనాలను వెలువరించి వార్తల్లో నిలిచింది. 2003 లో ప్రారంభించిన ఈ కంపెనీ ఆదాయం 2012 లో కేవలం రూ 2 కోట్లు ఉంటె, ప్రస్తుతం అది రూ 41 కోట్లకు చేరుకొంది. 20 వరకు ప్రముఖ క్లైంట్స్ ఈ కంపెనీ సేవలను పొందుతున్నారు.

అయినా IMD నెంబర్ 1...

అయినా IMD నెంబర్ 1...

ప్రభుత్వరంగ వాతావరణ శాఖ ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ (IMD) ఇప్పటికీ నెంబర్ 1 సంస్థే. దీనికి ఉన్నంత నెట్వర్క్ ప్రైవేట్ కంపెనీలు ఉండదు. కచ్చితత్వంలోనూ గ్లోబల్ వెదర్ ఫోరేకేస్టింగ్ కంపెనీలకు ఏ మాత్రం తీసిపోమని IMD చీఫ్ ఎం మోహాపాత్ర తెలిపారు. హుధుద్ వంటి తుపానులను ముందుగా అంచనా వేసిన IMD ... తద్వారా ప్రాణ నష్టాన్ని భారీగా తగ్గించ గలిగింది. ఇటీవల వచ్చిన అనేక తుపానులను ఖచ్చితత్వంతో అంచనా వేస్తోంది. వడ గాలుల హెచ్చరికల వాళ్ళ 2015 లో నమోదైన 1,500 మరణాలను ఈ ఏడాది లో 100 కు పరిమితం చేయగలిగామని ఆయన పేర్కొన్నారు.

బంగారు భవిష్యత్ ...

బంగారు భవిష్యత్ ...

కార్పొరేట్ ఫార్మింగ్, హార్టికల్చర్, ఫ్లోరికల్చర్, ఫిషరీస్, లాజిస్టిక్స్, ట్రాన్స్ పోర్ట్, షిప్పింగ్, కమోడిటీస్, సీడ్, ఫెర్టిలైజర్స్, పెస్టిసిడ్స్ వంటి రంగాలు వెదర్ ఫోరేకేస్టింగ్ పై ఆధారపడుతున్నాయి. ప్రైవేట్ రంగం మరింతగా విస్తృతం అవుతున్న కొద్దీ ఈ రంగంలో నిమగనమైన కంపెనీలకు బంగారు భవిష్యత్ ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. స్టార్టుప్ కంపెనీలకు పెట్టుబడులు కూడా సమకూరుతున్నాయని వారు చెబుతున్నారు.

English summary

ప్రైవేటు వాతావరణ కంపెనీలకు డిమాండ్, $100 మిలియన్‌కు చేరుకొన్న భారత్ మార్కెట్ | Private forecasters smell big bucks in Indian weather

Indian weather seems to have given a pocketful of sunshine to private forecasters from across the world with a $100-million market opting for their services for various projects.
Story first published: Tuesday, August 6, 2019, 10:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X