మన తెలుగు సంప్రదాయం ప్రకారం ఉగాది అంటే కేవలం కాలం మారడమే కాదు, మన జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వడం. 2026 మార్చి 19న మనం జరుపుకోబోయే ఉగాది 'పరాభవ' నామ సంవత్సరం మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. సాధారణంగా అందరూ పంచాంగ శ్రవణం విని, ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయో అని ఆందోళన పడుతుంటారు. కానీ, గ్రహాల గతి ఎలా ఉన్నా.. మీ ఆర్థిక గతిని మార్చే శక్తి కేవలం మీ చేతుల్లోనే ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుచుకోవడానికి ఈ ఉగాది ఒక గొప్ప అవకాశం. దీర్ఘకాలిక లాభాల కోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) వంటి పెట్టుబడులను ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. సాధారణంగా ఏదైనా శుభకార్యం ప్రారంభించడానికి మనం మంచి ముహూర్తం చూస్తాం. తెలుగు రాష్ట్రాల్లో ఉగాది కంటే మించిన మంచి రోజు మరొకటి ఉండదు. కాబట్టి పెట్టుబడులు పెట్టాలనుకునేవాళ్లు ఉగాది రోజున SIP వంటివి మొదలుపెట్టండి. మీ సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం కేటాయించండి.
ఉగాది పచ్చడి వెనుక ఉన్న ఫైనాన్షియల్ సీక్రెట్!
మనం తినే ఉగాది పచ్చడిలో ఆరు రుచులు.. జీవితంలోని భిన్న అనుభూతులను సూచిస్తాయి. అలాగే మీ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో కూడా ఉగాది పచ్చడిలా ఉండాలి. అంటే పోర్ట్ ఫోలియో చాలా భిన్నంగా ఉండాలి. పచ్చడిలో వేప పువ్వు (చేదు) ఎలాగో.. మార్కెట్లో వచ్చే నష్టాలు కూడా అలాంటివే. కానీ, బెల్లం (తీపి) లాంటి లాభాలు రావాలంటే ఆ చేదును కూడా భరించాలి. ఈ ఉగాది నుండి మీరు ప్రారంభించే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) కూడా అంతే. ప్రారంభంలో చిన్నగా అనిపించినా, కాలక్రమేణా అది మీకు తీపి ఫలితాలను ఇస్తుంది.
మీరు చేసే ఆ ఒక్క పొరపాటు ఏంటి?
చాలామంది భారతీయులు చేసే పొరపాటు.. ద్రవ్యోల్బణాన్ని పట్టించుకోకపోవడం. కాలం గడిచే కొద్దీ ద్రవ్యోల్బణం పెరిగి ధరలు పెరుగుతుంటాయి. కానీ, దానికి సమానంగా ఆదాయం పెరగదు. అందుకేద్రవ్యోల్బణాన్ని తట్టుకోవాలంటే మీ డబ్బు కేవలం బీరువాలో ఉండకూడదు.. అది పని చేయాలి. అందుకే 2026 పరాభవ నామ సంవత్సరంలో సాంప్రదాయ పెట్టుబడులతో పాటు ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి సారించడం ఒక విప్లవాత్మక నిర్ణయం అవుతుంది.
పవర్ ఆఫ్ కాంపౌండింగ్: ఒక అద్భుతం
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పినట్లు కాంపౌండింగ్ అనేది ప్రపంచంలో ఎనిమిదో వింత. మీరు ఈ ఉగాది (ugadi) నాడు ఒక SIPని మొదలుపెడితే, అది మీ డబ్బును రెట్టింపు చేయడమే కాదు.. మీ పిల్లల ఉన్నత చదువులకు లేదా మీ రిటైర్మెంట్ జీవితానికి కొండంత అండగా నిలుస్తుంది. నెలకు మీరు పక్కన పెట్టే ఆ కొద్దిపాటి మొత్తం, కొన్ని ఏళ్ల తర్వాత ఒక భారీ సామ్రాజ్యాన్ని నిర్మిస్తుంది. చాలా మంది "ఇంకా సమయం ఉంది కదా" అని వాయిదా వేస్తుంటారు. కానీ, గుర్తుంచుకోండి.. మీరు ఎంత త్వరగామొదలుపెడితే అంత ఎక్కువ లాభం పొందుతారు.
ఏదేమైనా ఈ ఏడాది ఉగాది (ugagi) పచ్చడిని ఆస్వాదిస్తూనే, మీ ఆర్థిక భవిష్యత్తును ఒక క్రమ పద్ధతిలోకి తీసుకురండి. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, కొత్త తరం పెట్టుబడి మార్గాలను అన్వేషించండి. మార్కెట్ ఒడిదుడుకులకు భయపడకుండా, క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడమే ఈ ఏడాది మీరు తీసుకోవాల్సిన గొప్ప నిర్ణయం. ఈ పరాభవ నామ సంవత్సరం మీకు , మీ కుటుంబానికి ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించాలని కోరుకుందాం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications