For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంద్రబాబు హయాంలోని కియా నుంచి సెల్టోస్ కారు, రానున్న జగన్

|

అనంతపురం/విజయవాడ: కియా మోటార్స్ కంపెనీ తన కొత్త సెల్టోస్ కారును ఈ నెల 8వ తేదీన మార్కెట్లోకి తీసుకు వస్తుంది. ఈ లాంచింగ్ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కియా కంపెనీ ప్రతినిధులు ఆహ్వానించారు. అనంతపురం జిల్లాలోని పెనుగొండ కియా మోటార్స్ ప్లాంట్ వద్ద ఈ కొత్త కారును లాంచ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కియా ప్రతినిధులు ఆహ్వాన పత్రికను అందించారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు.

<strong>సరికొత్త SBI వెల్త్: అర్హతలు, ప్రయోజనాలు తెలుసుకోండి</strong>సరికొత్త SBI వెల్త్: అర్హతలు, ప్రయోజనాలు తెలుసుకోండి

కియా కొత్త కారు ప్రారంభోత్సవానికి జగన్

కియా కొత్త కారు ప్రారంభోత్సవానికి జగన్

కియా కొత్త కారు ప్రారంభోత్సవానికి జగన్ హాజరు కానున్నారు. దక్షిణ కొరియాకు చెందిన హ్యుండాయ్ అనుబంధ సంస్థ అయిన కియా మోటార్స్ పెనుగొండలో రూ.13,500 కోట్ల పెట్టుబడితో 650 ఎకరాల్లో కియా కార్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. కియాతో ఏపీ ప్రభుత్వం 2017, ఏప్రిల్ 27న ఒప్పందం చేసుకుంది.

చంద్రబాబు హయాంలో ప్రారంభం

చంద్రబాబు హయాంలో ప్రారంభం

ప్లాంట్ నిర్మాణ పనులు 2017 నవంబర్ 15వ తేదీన ప్రారంభించారు. 2018 ఫిబ్రవరి 22న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కియా మోటార్స్ చీఫ్ పార్క్ చేతుల మీదుగా ఫేమ్ ఇన్‌స్టలేషన్ కార్యక్రమం జరిగింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు కియా కారును ఆవిష్కరించారు. 2019 జనవరి 19న కియా కారులో చంద్రబాబు, కంపెనీ ప్రతినిధులు కాసేపు షికారు చేశారు. కియా తొలి కారును టెస్ట్ ట్రాక్‌లో చంద్రబాబు నడిపారు.

భవిష్యత్తులో ఉత్పత్తి రెండింతలు..

భవిష్యత్తులో ఉత్పత్తి రెండింతలు..

అనంతపురం జిల్లాలోని పెనుగొండలో ఉన్న కియా మోటార్స్ ప్లాంట్ నుంచి ఏడాదికి 3 లక్ష కార్లు ఉత్పత్తి కానున్నాయి. భవిష్యత్తులో ఏడాదికి ఏడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచనున్నారు. ఇక్కడ తయారైన ఇంజిన్లను టర్కీ, స్లొవేకియాకు ఎగుమతి చేస్తున్నట్లు కియా ప్రతినిధులు చెప్పారు.

English summary

చంద్రబాబు హయాంలోని కియా నుంచి సెల్టోస్ కారు, రానున్న జగన్ | AP CM Jagan Mohan Reddy invited to Kia Seltos launch in Anantapur

Representatives of Kia Motors invited Chief Minister YS Jagan Mohan Reddy to participate in the launch of its new car Kia Seltos on August 8. The event will be organised at Kia Motors plant at Penugonda in Anantapur district.
Story first published: Tuesday, August 6, 2019, 10:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X