For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ మార్కెట్ క్రాష్‌లో ఎఫ్ఐఐలు ఎగబడి కొంటున్న స్టాక్స్ ఇవే

|

స్టాక్ మార్కెట్లో భారీ పతనం ఇన్వెస్టర్లకు వణుకు పుట్టిస్తోంది. వారం రోజుల్లోనే నిఫ్టీ 1000 పాయింట్ల వరకూ పతనమైంది. మాంద్యం జాడలు కనిపిస్తున్నాయంటూ ఆందోళన పెరుగుతున్న నేపధ్యంలో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు), దేశీయ సంస్థాగత ఇన్వెవెస్టర్లు (డిఐఐలు) కొన్ని ఎంపిక చేసిన స్టాక్స్‌లో తమ వాటాలను పెంచుకుంటున్నారు. వీటిల్లో కొన్ని స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. ఇయర్ టు డేట్ ప్రకారం చూస్తే కొన్ని ఏకంగా 10 నుంచి 70 శాతం వరకూ కుప్పకూలాయి. భారీగా స్టాక్ రేట్లు తగ్గిన ఈ నేపధ్యంలో ప్రమోటర్లు కూడా తమ వాటాలను పెంచుకుంటున్నారు.

ఈ జాబితాలో కొన్ని ప్రముఖ కంపెనీల పేర్లు కనిపిస్తున్నాయి. వాటిల్లో మనకు బాగా తెలిసిన రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ హోల్టింగ్స్, టెక్ మహీంద్రాతో పాటు హైదరాబాద్ ఐటీ కంపెనీ సైయెంట్ పేరు కూడా ఉంది.

Heavy selloff in the midcap and smallcap space during June quarter

రిలయన్స్ ఇండస్ట్రీస్
రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ప్రమోటర్లు తమ వాటాను 35.87 నుంచి 35.90 శాతానికి పెంచుకున్నారు. మార్చి - జూన్ మధ్య కాలంలోనే ఈ వాటాలను పెంచుకున్నారు. మ్యూచువల్ కంపెనీలు రిలయన్స్‌లో తమ వాటాలను 4.48 నుంచి 4.56 శాతానికి పెంచుకున్నారు. ఇక ఎఫ్‌ఐఐల వాటా 24.39 నుంచి 24.40 శాతానికి ఎగబాకింది. జూలై 30 నాటికి చూస్తే ఇయర్ టు డేట్ ప్రకారం ఈ స్టాక్ ఇచ్చిన రిటర్న్ కేవలం 5 శాతం మాత్రమే.

బజాజ్ హోల్టింగ్స్
మార్చి - జూన్ క్వార్టర్‌ మధ్యలో బజాజ్ హోల్టింగ్స్ ప్రమోటర్లు తమ వాటాలను 49.03 నుంచి 49.56 శాతానికి పెంచుకున్నారు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు 0.88 నుంచి 1 శాతానికి, అలానే ఎఫ్ఐఐలు 14.43 నుంచి 14.52 శాతానికి పెంచుకున్నారు.

వోడా ఐడియా
కుప్పకూలిపోయి పెన్నీ స్టాక్‌లా మారిపోయిన కంపెనీ వోడా ఐడియా. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఈ సంస్థలో కూడా ప్రమోటర్లు ఇంకా యాక్టివ్‌గా ఉన్నారు. ప్రస్తుతం ప్రమోటర్లకు ఈ సంస్థలో 71.57 శాతం వాటా ఉంది. కొద్దికాలం క్రితం ఇది 71.33 శాతం మాత్రమే ఉండేది.
ఇక మ్యూచువల్ ఫండ్ సంస్థలకు తమకు ఉన్న 3.07 శాతం వాటాను 5.88 శాతానికి, అలానే ఎఫ్ఐఐలు 13.13 శాతం నుంచి 15.67 శాతానికి పెంచుకున్నారు.

ఈ జాబితాలో ఇంకా రాంకో ఇండస్ట్రీస్, జెన్సార్ టెక్నాలజీస్, అలెంబిక్, మిందా కార్పొరేషన్, నవభారత్ వెంచర్స్‌లో కూడా ప్రమోటర్లు, మ్యూచువల్ ఫండ్ సంస్థలు, ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఉన్నారు. వీళ్లంతా జూన్ క్వార్టర్‌లో ఈ స్టాక్స్‌లో యాక్టివ్ అయ్యారు. అయితే ఇన్వెస్టర్లు మాత్రం ఈ స్టాక్స్ జోలికి వెళ్లే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ఎఫ్ఐఐలు, మ్యూచువల్ ఫండ్ వంటి సంస్థల పెట్టుబడి సమయం ఏళ్లకు ఏళ్లు ఉంటుంది. నష్టం వచ్చిన భరించే శక్తి వాళ్లకు ఉంటుంది, అదే సమయంలో అవసరమైతే స్టాక్స్‌ను భారీ స్థాయిలో యావరేజ్ కూడా చేసుకునే సత్తా వాళ్లకు ఉంటుంది. కాబట్టి ఈ స్టాక్స్ ఎంపికకు ముందు మీ రీసెర్చ్ చేయడంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ సలహాలు కూడా తీసుకోండి.

English summary

ఈ మార్కెట్ క్రాష్‌లో ఎఫ్ఐఐలు ఎగబడి కొంటున్న స్టాక్స్ ఇవే | Heavy selloff in the midcap and smallcap space during June quarter

Amid the heavy selloff in the midcap and smallcap space during June quarter, at least 10 stocks stood out, as they witnessed simultaneous rise in shareholding by promoters, domestic institutional investors (DIIs) as well as foreign institutional investors (FIIs).
Story first published: Sunday, August 4, 2019, 10:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X