For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీగా పడిపోయిన డొమెస్టిక్ సేవింగ్స్: ఖర్చుకు మొగ్గు, రుణాల పెరుగుదల

|

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద పెట్టుబడిదారు అయిన భారతదేశ హౌస్‌హోల్డ్ సెక్టార్ సేవింగ్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. డొమెస్టిక్ సేవింగ్స్ దశాబ్ద కాలానికి దిగజారాయి. అదే సమయంలో ఈ రంగంలో రిటైల్ రుణాలు ప్రతి ఏడా డబుల్ డిజిట్‌తో పెరుగుతున్నాయి. ఇది హౌస్‌హోల్డ్ వినియోగాన్ని అధికం చేస్యని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. హౌస్‌హోల్డ్ బాధ్యతలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, ఇది మంచి సంకేతం కాదని నిపుణులు చెబుతున్నారు.

గాడ్జెట్స్ నుంచి హాలీడేస్ వరకు..

గాడ్జెట్స్ నుంచి హాలీడేస్ వరకు..

భారత్ సేవింగ్స్ రేటు లేదా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2018కి 30.5 శాతానికి పడిపోయిందని, 2008లో ఇది 37 శాతంగా ఉందని చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నుంచి హాలీడేస్ వరకు వివిధ రకాల సేవలపై ఖర్చు పెరిగిందని చెబుతున్నారు. ఇది ఏటా 17 శాతం పెరుగుతోందంటున్నారు. క్రెడిట్ లోన్లు కార్పోరేట్ రంగం నుంచి హౌస్ హోల్డ్స్‌కు వేగంగా పెరుగుతున్నాయని చెబుతున్నారు. కార్పోరేట్ బ్యాడ్ డెబిట్స్ కారణంగా ఇటువైపు మరలారు. వీటినే నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏలు అంటారు.

ఇదే అతిపెద్ద వనరు

ఇదే అతిపెద్ద వనరు

గత అయిదేళ్లుగా వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంలో రిటైల్ క్రెడిట్ ఉంది. ఆర్థిక వ్యవస్థకు హౌస్‌హోల్డ్ సేవింగ్స్ అతిపెద్ద వనరు. ప్రభుత్వ కార్పోరేట్ సెక్టార్‌లకు నిధుల నికర సరఫరాదారు ఇదే. ఏదైనా ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పొదుపుకు సమానమైనవిగా తీసుకోబడతాయి. ఎందుకంటే వినియోగించని ఆదాయాన్ని తప్పక ఆదా చేయాలి. అది పెట్టుబడికి ఉపయోగపడుతుంది. భారత పెట్టుబడి అవసరాలు పొదుపు ద్వారా తీర్చగల వాటి కంటే ఎక్కువే. ఈ కొరతను ఖరీదైన విదేశీ పెట్టుబడుల ద్వారా తీర్చుకుంటున్నాం. ఇది దేశ ప్రస్తుత డెఫిసిట్‌ను చూపిస్తుంది.

ఖర్చు చేసేందుకు ఆసక్తి

ఖర్చు చేసేందుకు ఆసక్తి

దేశంలోని మందగమనానికి పేలవమైన పొదుపు ఎక్కువ కారణమని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ డేటా ప్రకారం హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఎక్కువగా పడిపోయింది. హౌస్ హోల్డ్స్, యూత్ ఖర్చు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని రేటింగ్ సంస్థ క్రిసిల్ లిమిటెడ్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషి అన్నారు. పని చేయగలిగిన 70 శాతం మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నారని తెలిపింది.

భారీగా పెరిగిన ఖర్చు.. తగ్గిన సేవింగ్స్

భారీగా పెరిగిన ఖర్చు.. తగ్గిన సేవింగ్స్

రియల్ ఎస్టేట్ వంటి హౌస్ హోల్డ్ సేవింగ్స్ 2012లో 15.9 శాతంగా ఉంటే 2018కి 10.3 శాతానికి తగ్గింది. అలాగే వారి ఫైనాన్షియల్ సేవింగ్స్ 7.4 శాతం నుంచి 6.6 శాతానికి పడిపోయాయి. 2008-09 నుంచి 2018-17 వరకు చూస్తే హౌస్ హోల్డ్ ఖర్చులు రూ.1,635.98 బిలియన్ల నుంచి రూ.6,739.22 భారీగా పెరిగాయి. హౌస్ హోల్డ్ సేవింగ్స్ మాత్రం 23.6 శాతం నుంచి 17.2 శాతానికి పడిపోయాయి.

English summary

భారీగా పడిపోయిన డొమెస్టిక్ సేవింగ్స్: ఖర్చుకు మొగ్గు, రుణాల పెరుగుదల | భారీగా పెరిగిన ఖర్చు.. తగ్గిన సేవింగ్స్

India’s household-sector savings, the biggest source of investment for the economy, have “worryingly” dipped to a decadal low, while retail loans to the sector are growing annually in double digits, pointing to profligate consumption by households, economists have warned.
Story first published: Sunday, August 4, 2019, 17:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X