For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

1 బిలియన్ డాలర్లు సమీకరించనున్న రిలయన్స్ జియో

|

ఉచిత కాల్ సర్వీసులతో దేశ టెలికాం చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిన రిలయన్స్ జియో ... తన ప్రస్థానాన్ని మరింత విస్తృతం చేసుకొనే పనిలో పడింది. సేవలు ప్రారంభించిన కొన్ని సంవత్సరాల్లోనే దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా ఎదిగింది. మూడు దశాబ్దాలుగా నెంబర్ 1 స్థానంలో ఉన్న ఎయిర్‌టెల్ ను పక్కకు నెట్టి మరీ ఈ ఘనతను సాధించింది. 34 కోట్ల వినియోగదారులతో అత్యంత పటిష్టంగా కనిపిస్తున్న రిలయన్స్ జియో... సేవల విస్తరనకు కావాల్సిన నిధుల వేటలో నిమగ్నమైంది. సుమారు 1 బిలియన్ డాలర్లు (దాదాపు రూ 7,000 కోట్లు ) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది. ఈ నిధులను టెలికాం పరికరాల కొనుగోలు కోసం, బ్రాడ్ బ్యాండ్ సేవలు ప్రారంభించేందుకు సహా కొత్తగా ఆర్థిక సేవలను అందించేందుకు వినియోగించనుంది.

రూ.600కే జియో గిగాఫైబర్ 3 రకాల సేవలు: స్పీడ్, ఇతర ప్రయోజనాలివే...రూ.600కే జియో గిగాఫైబర్ 3 రకాల సేవలు: స్పీడ్, ఇతర ప్రయోజనాలివే...

హామీ ఇవ్వనున్న కొరియా బీమా సంస్థ...

ఆఫ్ షోర్ రుణాల రూపంలో సమీకరించనున్న ఈ నిధులకు దక్షిణ కొరియా కు చెందిన కొరియా ట్రేడ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (కే-షూర్) హామీ ఇవ్వనున్నట్లు సమాచారం. దక్షిణ కొరియా కంపెనీల నుంచే రిలయన్స్ జియో టెలికాం పరికరాలు కొనుగోలు చేస్తుంది కాబట్టి ... ఆ దేశ బీమా సంస్థ రుణాలకు హామీ ఇస్తున్నట్లు వెల్లడైంది. తద్వారా రుణాల సేకరణ సులభం అవుతుంది. కొరియా కంపెనీల ఎగుమతులను ప్రోత్సహించేందుకు కే-షూర్ ఇలా రుణాలకు హామీ ఇస్తుందట. రిలయన్స్ జియో... ఈ క్రమంలో శామ్ సంగ్ ఎలక్ట్రానిక్స్, ఏస్ టెక్నాలజీస్ వంటి దిగ్గజ కంపెనీల నుంచి టెలికాం పరికరాలను దిగుమతి చేసుకోనుంది.

Jio to raise $1 billion via offshore loans to buy telecom gear

ఆగష్టు 12 న వెల్లడి?

ఆర్థిక సేవలు వంటి కొత్త రంగాల్లో ప్రవేశం, నెట్వర్క్ విస్తరణ, 5జి స్పెక్ట్రమ్ కొనుగోలు వంటి విషయాలను ఆగష్టు 12న జరిగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) లో కంపెనీ చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, ఆర్థిక సేవలు ప్రస్తుతం ఉన్న జియో పెమెంట్స్ బ్యాంకు తో అందిస్తుందా లేదా మరో కొత్త కంపెనీ ఏర్పాటు చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా సంయుక్తంగా జియో ప్రెమెంట్స్ బ్యాంకు ను ఏర్పాటు చేసాయి.

ఋణం తీర్చేందుకు 10 ఏళ్ళు ...

ఇప్పుడు తీసుకొంటున్న రుణాన్ని రిలయన్స్ జియో .. 10 ఏళ్ళ కాలపరిమితితో సేకరిస్తోంది. 10 ఏళ్ళ తర్వాత లిబర్ రేటు 81 బేసిస్ పాయింట్ల వడ్డీ తో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ రుణాలపై వడ్డీ రేటును లెక్కించేందుకు లండన్ ఇంటర్ బ్యాంకు ఆఫర్డ్ రేట్ (లిబర్) ను ప్రామాణికంగా తీసుకొంటారు. ఇప్పటి వరకు రిలయన్స్ జియో కు రూ 75,000 కోట్ల మేరకు రుణ భారం ఉంది. రుణాల సిండికేట్ కోసం ప్రముఖ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఐన HSBC , ఆస్ట్రేలియా అండ్ న్యూజీలాండ్ బ్యాంకు, మిత్సుబిషి ఫైనాన్సియల్ గ్రూప్, సిటీ బ్యాంకు, జెడ్పీ మోర్గాన్ లను రిలయన్స్ జియో నియమిస్తోంది.

ఇన్సూరెన్స్ లోకి ...

నూతనంగా ప్రారంభించే సేవల్లో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి సేవలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే, అధిక వేల్యూ కలిగిన వినియోగదారులను ఆకర్షించటం కూడా ప్రణాళికలో భాగమేనట. ఇప్పటి వరకు రిలయన్స్ జియో కేవలం తక్కువ చెల్లించ గలిగే వినియోగ దారులనే కలిగి ఉంది. కానీ సరికొత్త సేవలతో అన్ని వర్గాల వినియోగదారులను పొందాలని లక్ష్యంగా పెట్టుకోండి. 5జి సేవలతో, ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్, ఇన్సూరెన్స్ వంటి సేవలతో ఈ లక్ష్యాన్ని సాధించాలని రిలయన్స్ జియో పట్టుదలగా ఉంది.

English summary

1 బిలియన్ డాలర్లు సమీకరించనున్న రిలయన్స్ జియో | Jio to raise $1 billion via offshore loans to buy telecom gear

Reliance Jio Infocomm is getting ready to borrow about $1 billion to buy telecom equipment, start a range of financial services to complement what it already offers subscribers and unveil its home broadband pricing.
Story first published: Wednesday, July 31, 2019, 10:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X